Web Analytics

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
సభ్యులపై చర్చ:Bojja - వికీపీడియా

సభ్యులపై చర్చ:Bojja

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] బొమ్మల పేర్లు, వాటి ఉపయోగం

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మలకు సరైన పేర్లను పెట్టండి. పేరు చదవంగానే అదేంబొమ్మ అర్థమయ్యేటట్లు పేర్లు పెట్టండి. ఇలా సంఖ్యలతో పేర్లను పెడితే ఆ బొమ్మ గురించి ఎవరికీ అర్థంకాదు. దయచేసి పేర్లను మార్చడానికి కొంత ఓపిక చేసుకోండి. బొమ్మకు 250.png అనే పేరు పెడితే అదేంటో ఎందుకుందో ఎవరికైనా అర్థమవుతుందా... ఒక సారి ఆలోచించండి. ఇక నుండి అప్లోడు చేసేముందు అర్థవంతమైన పేర్లను పెడతారని ఆశిస్తున్నాను. అలాగే మీరు సృష్తిస్తున్న వ్యాసాలలో సమాచారం కంటే ఎక్కువగా బయటి లింకులూ బొమ్మలూ ఉంటున్నాయి. విజ్ఞాన సర్వస్వం అంటే సమాచారం అంతా ఇక్కడే లభ్యమవుతుందని అర్థం. అందుకు బొమ్మలను చేర్చడం కంటే ముఖ్యమైనది విషయాన్ని గురించి తెలిపే సమగ్రమైన సమాచారం. మీరు బొమ్మలను చేర్చడం కంటే ముందు దానిపై దృష్టి పెట్టడం మంచిదని నా ఉద్దేశం, బొమ్మలు అప్పటికే ఉన్న సమాచారాన్ని మరింత విపులంగా వివరించడానికి మాత్రమే అనే సంగతి కూడా గుర్తుంచుకోండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:00, 9 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] నేను ఫోటోలు ఎగుమతి చేయడానికి కారణం(ఎక్కువని మీ ఉద్దేశం) వంద మాటలకంటే ఒక చిత్రం ఎక్కువ సమాచార

నేను ఫోటోకి పేరు మార్చకపోవటానికి కారణం, ఎగుమతి చేసిన ఫోటో దొరికిన సైట్,మూలం లో ఉన్న పేరే ఉండాలేమో అనే ఉద్దేశం.పేరు మారిస్తే అబ్యంతర పెడతారని అనుమానం.నేను ఫోటోలు ఎగుమతి చేయడానికి కారణం(ఎక్కువని మీ ఉద్దేశం) వంద మాటలకంటే ఒక చిత్రం ఎక్కువ సమాచారం ఇస్తుందని.ముందు అర్ధవంతమయిన చిత్రాలు కూర్చి వాటికి మరింత సమాచారం నాతో పాటు మిగతా వారు చేరుస్తారని ఒక ఆలోచన.వ్యాసం అత్యంత వివరంగా,విజ్ఞానంగా ఉండాలనే నాలుగు పేజీలుగా విభజించి వ్రాయటానికి కారణం.ముఖ్యంగా ఇది (ఫోటోషాప్) ఫోటోలు వాటి ఎడిటింగ్ గొడవ కాబట్టి ఫోటోలు ఎక్కువగా ఉంటాయి ప్రదీప్ గారు.ఉదా : ఈ సైట్ ఒక్క సారి చూడండి(http://inpics.net/tutorials/elements5/create2.html) అన్ని ఫోటోలతోనే ఫోటో షాప్ గురించి నేర్పిస్తున్నారు. రాజకీయాలు,సినిమాలు మొదలగు వాటి గురించి ఆయితే ఎంత కావాలంటే అంత వ్రాయవచ్చు.నిజంగా ఫోటోషాప్ గురించి పూర్తి వివరంగా వ్రాస్తే వంద పేజీలకు ఎక్కువ అవుతుంది కావున, మొత్తం సమయం దీని మీద వెచ్చించకుండా త్వరగా ఈ వ్యాసాన్ని ముగించి ఫోటోగ్రఫీ మీదకి వెళ్ళాలని నా ప్రయత్నం. వ్యాసం ఇంకా పూర్తి అవ్వలేదు కావున, పరవాలేదు ఈ వ్యాసం ఇంక చాలు అనుకున్నపుడు చివరిగా అవసరం లేని ఫోటోలు, లింకులు, సమాచారం వుంటే తీసివేయండి.
ఒక మంచి విషయం >>> మీరు చాల త్వరగా ప్రతిస్పందిస్తారు. ఈ సమాధానానికి మీ అభిప్రాయాని తెలుపండి.
PS:ఇక ఇప్పటి నుండి అర్ధవంత మయిన పేర్లు పెడతాను.vasu bojja 08:41, 9 ఏప్రిల్ 2008 (UTC)

బొమ్మలను ఎక్కడి నుండీ సేకరించామో తెలిపి, వాటి కాపీహక్కుల వివరాలు తెలిపితే సరిపోతుంది. ఆ తరువాత అప్లోడు చేస్తున్నప్పుడు ఏ పేరు పెట్టినా పరవాలేదు, దీని అర్థం బొమ్మను గురించి వివరించ గలిగే పేర్లు. ఇప్పుడు ఫొటోషాపు ఉదాహరణను తీసుకుందాము. మీరిచ్చిన లింకులో ఉన్న సమాచారాన్ని పరిశీలించాను. అందులో వారు చాలా బాగా వివరించారు. అయితే మనం వికీపీడియా ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుపడానికి లేదా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ ఆ విషయాన్ని నేర్పడానికి వికీపీడియా వేదిక కాదు. అంటే అప్పుడు ఫొటోషాపు అనే పేజీలో ఆ సాఫ్టువేరు ఎలా పుట్టింది, దాని చరిత్ర, అందులో వారు ఉపయోగించిన రకరకాల సాంకేతికాల గురించి పరిచయం చేయడం. ఆ సాఫ్టువేరును తయారు చేసిన అడోబీ సంస్థను పరిచయం చేయడం లాంటివి. ఫొటోషాపు పేజీలో అటువంటి వివరాలు కొంత వరకూ ఉన్నాయి, అంత వరకూ బాగానే ఉంది. కానీ వ్యాసం మిగతా భాగంలో ఫొటోషాపును ఎట్లా వాడాలో కూడా వివరించడం మొదలయ్యింది, ఇలా ఆ సాఫ్టువేరును ఎలా వాడాలో వివరించడం అనవసరం. వంద మాటలను ఒక్క బొమ్మ ద్వారా చెప్పేయవచ్చని నేను కూడా ఒప్పుకుంటాను, మరి ఈ బొమ్మను ఏ వంద మాటలకు బదులుగా చేర్చారు? నాకు తెలిసి ఇది "వెర్షను 8లో స్ప్లాషు ఫొటోషాపు స్క్రీను ఇలా ఉండేది" అనే మాటలను మాత్రమే చెబుతుంది, వేరే ఇంకేమయినా చెబుతుందా?... __మాకినేని ప్రదీపు (+/-మా) 13:49, 9 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] మీకు నేను చేసింది ప్రతిదీ తప్పులాగా అనిపిస్తుంది. మీరు ఉదహరించిన ఫోటో ఏమి సూచిస్తుంది అని వె

మీకు నేను చేసింది ప్రతిదీ తప్పులాగా అనిపిస్తుంది.మీరు ఉదహరించిన ఫోటో ఏమి సూచిస్తుంది అని వెటకారంగా అడుగుతున్నారు? అభివృద్ది చేసినవారి పేర్లు(అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారని తెలుస్తుంది),వెర్షన్ పేరు,తయారి సంవత్సరము మొదలుకుని ప్రారంభంనుండి ఇప్పటి వరకువున్న వేర్శన్ల ఫోటోలు అన్ని ఒకచోట వరుసగా ఇస్తే ఉపయోగకరంగా వుంటుందని(ఫోటోషాప్ అభివృద్ది పరిణామ క్రమం తెలుస్తుందని) ఆలోచన.నేనేమి ఫోటోషాప్ నేర్పే పని చేయటము లేదు(నేను ఫోటోషాప్ నేర్పించాలంటే నా స్వంత సైట్ తో చేయగలను కదా!).మీరు చెప్పినట్టు చేస్తే, ఫోటోషాప్ రెండు పేరాలలో క్లుప్తంగా చెప్పవచ్చు.ఇంత శ్రమతో నాలుగు పేజీలతో వివరించాల్సిన అవసరం లేదు.నేనేమి ప్రతిఫలం ఆశించి ఇన్ని ఫోటోలు,సమాచారం,లింకులు సేకరించి ఈ వ్యాసం వ్రాయటం లేదు.మీకు నేనోదో చెత్త ప్రోగు చేసి ఈ వ్యాసాన్ని నింపుతున్నట్టుగా ఉంది.అందరకి నచ్చిన ఈ వ్యాసం మీకు ఎందుకో చిరాకు కలిగిస్తుంది.నాకు కొంచెము మనసు భాద కలిగించింది,మీ ఉత్తరం. మీ ఇష్టం,మీరు కావాలంటే ఈ వ్యాసాన్ని ఒకే పేజీకి కుదించి వేయండి.లేక నేను వ్రాసే పద్దతి బాగోలేదు అనుకుంటే (తెవికి ప్రమాణాలలో) చెబితే వ్రాయటం మానేస్తాను.నేనేమి మిమ్మల్ని తూలనాడటం లేదు. కేవలం, ఇంత శ్రమకోర్చి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఒక్కరే చిరాకుగా చూస్తుంటే బాధతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.vasu bojja 07:24, 10 ఏప్రిల్ 2008 (UTC)

శాంతించండి. అన్ని వ్యాసాలు ఒకే రకంగా మూస పోసినట్లుండనవుసరం లేదు. ఇదొక రకం. వాసూ! ఫొటోషాప్ వ్యాసం తెలుగు వికీలో సాధారణ ప్రమాణాలకంటే ఉన్నతంగా ఉండబట్టే అందులో ఉన్న కొద్దిపాటి లోపాలూ ప్రదీప్‌కు స్పష్టంగా కనిపించాయి. అది ఒక వ్యాఖ్యగా భావించండి. మరొక విషయం. ఇది మీ వ్యాసం గాని, మరొకరి వ్యాసం కాని కాదు. రేపు మరొకరు దీని స్వరూపాన్ని పూర్తిగా మార్చేయవచ్చును. లేదా ఇతర సబ్జెక్టులపై ఈ తరహా వ్యాసాలు ఈ వ్యాసం స్ఫూర్తితో డెవలప్ చేయనచ్చును. వేచి చూద్దాం. అన్నట్టు మీ వ్యాసం చదివినాక ఆసక్తి పెరిగి ఈ మధ్య ఫొటోషాప్ నేర్చుకోవడం మొదలు పెట్టాను! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:56, 10 ఏప్రిల్ 2008 (UTC)
మీరు ఫొటోగ్రఫీ, వాటి అనుబంద వ్యాసాలపైచేసిన కృషిని నేను తక్కువంచనా వేయటంలేదు. మీరు కష్టపడి ఇన్నిన్ని బొమ్మలను వికీపీడియాలో ఎక్కిస్తున్నారు. వాటిలో చాలా బొమ్మలను "FAIR USE" అని చెప్పేసి అప్లోడు చేస్తున్నారు, అంటే ఆ బొమ్మలన్నిటి కాపీహక్కులు ఇంకొకరి దగ్గర ఉన్నాయి, వారు ఆ బొమ్మలను ఇతరలు ఉచితంగా వాడుకోవడానికి అనుమతించలేదని అర్థం చేసుకోవాలి. బొమ్మను తయారు చేసినవారు కాబట్టి వారి హక్కులను మనం గౌరవించాలి. ఇక నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం FAIR USE అని చెప్పేసి ఆ బొమ్మలను వాడుకోవడమంటే అలా ఆ బొమ్మలను తయారు చేసిన వారిని పరిహసించడమ్మన్నమాటే. నాకు ఈ అభిప్రాయం ఉండటం వలన FAIR USE బొమ్మలన్నిటినీ వికీపీడియా నుండీ ఎప్పుడో ఒకప్పుడు తొలగించాలని కూడా నమ్ముతుంటాను. అంటే రేపొద్దున వాటన్నిటినీ కాపీహక్కు సమస్యల వలన తొలగించాల్సి వస్తే బొమ్మల మీద ఆధారపడుతూ రాసిన చాలా సమాచారానికి అర్థంలేకుండా పోతుంది! అందుకనే బొమ్మల మీద ఆధారపడుతూ వ్యాసాలను రాసే బదులుగా వ్యాసాలను మొదటగా రాసి, ఆ తరువాత వాటికి బొమ్మలు చేరిస్తే ఇంకా బాగా అర్థమవుతుందనుకుంటేనే చేర్చమని నేను చెబుతున్నాను. ఏదయినా బొమ్మను "FAIR USE"గా వాడేముందు ఆ బొమ్మ నిజంగానే అవసరమా కాదా అనే విషయాన్ని బాగా ఆలోచించాలి. చివరిగా FAIR USE అని చెప్పి బొమ్మలను ఉపయోగించడాన్ని నిరుస్తాహపరచడంలో ఇదంతా ఒక భాగమని మీరు గుర్తించాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:18, 10 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] కాసుబాబు గారు మీరు ఫోటోషాప్ నేర్చుకున్తున్నందుకు అభినందనలు. మీ సమాధానానికి కృతజ్ఞతలు.

కాసుబాబు గారు మీరు ఫోటోషాప్ నేర్చుకున్తున్నందుకు అభినందనలు.
మీ సమాధానానికి కృతజ్ఞతలు.
నేను కోరేదికూడా అందరు తలో చేయి వేసి ఈ వ్యాసాన్ని (అలాగే మిగతావి కూడా) అభివృద్ది చేయాలని.నేను నాపేరు గురించి ఏమి ఆశించటం లేదు కాబట్టే ఇక్కడ వ్రాస్తున్నాను.ప్రదీప్ గారు క్లుప్తంగా వ్రాస్తే చాలన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు.అలాగయితే ఇంత శ్రమ ఎందుకనేది నా భాద.విజ్ఞానాత్మకంగా,వివరంగా ఉండాలంటారు అలా వ్రాస్తే(ప్రయత్నిస్తే) వంకలు పెడతారు.మరి ఈ పేజీ ఉదాహరణకి చూడండిలింకు .ఇంత వివరంగా అవసరమా అని అనుకుంటే, మరి ఈ పేజీ వ్యాసకర్తలు ఫోటోగ్రఫీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి ఇంత వివరంగా వ్రాయాల్సిన అవసరముందా!!! ఇంక వివరంగా ఫోటోగ్రఫీ పోర్టల్ అవసరముందా అంటే ఏమిచేపుతాం?నేను ఫోటోలు ఎక్కువ ఉంచడానికి కారణం ఇది ఫోటోలు వాటి ఎడిటింగ్ గురించి కావటం.vasu bojja 08:36, 10 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] ఫోటోలు తీసివేసేముందు చర్చా పేజీలో చర్చించి ఉంటే బావుండేది కదా.

చర్చ ఫోటోషాప్ లో ఫోటోలు ఉంచటం గురించి(ఫొటోగ్రఫీ, వాటి అనుబంద వ్యాసాల గురించి కాదు),నేను ఎగుమతి చేసిన ఫోటోలు 95 శాతం ఇంగ్లీష్ వికీపీడియా నుంచి తీసుకుని ఎగుమతి చేసినవే.మీరు(ప్రదీప్ )ఫోటోషాప్ వ్యాసంలో ఉంచిన అర్థవంతమయిన అన్ని ఫోటోలని తొలగించి మీకు ఇష్టమయిన పద్దతిలో వ్యాసం కుదించి వేశారు.ఫోటోలు తీసివేసేముందు చర్చా పేజీలో చర్చించి ఉంటే బావుండేది కదా. vasu bojja 13:29, 14 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] నెనర్లు

వాసుగారూ మీఅభినందనలకు నెనర్లు.మీ అభినందన నన్ను నాపనిలో ఉత్సాహంగా ముందుకు సాగేలా చేస్తుంది.ఉద్యానవనాలు అని వ్రాయాలనే ఉంటుంది మరీ గ్రాంధికం అనుకుంటారని అలా వ్రాస్తుంటాను.మీరు కూడా వ్యాసాలు అందించండి మేమంతా చదువుకుంటాము.
--t.sujatha 10:14, 17 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] ఈ వారం సమైక్య కృషి

వాసూ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] అభిమానానికి

వాసుగారూ అభిమానానికి కృతజ్ఞతలు. --t.sujatha 14:46, 18 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] తెవికీ పాలసీలపై ఒక చర్చ

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:35, 29 ఏప్రిల్ 2008 (UTC)

[మార్చు] రఘు ఫోటో

రఘు ఫోటో మరోటి సంపాదించినందుకు అభినందలు. సదుపాయానికి కూడా అది ఎక్కడినుండి తెచ్చారు, దాని కాపీహక్కులు ఎవరికి ఉన్నాయి అన్న విషయం తెలియజేయజేస్తూ {{Non-free fair use in}} మూస తగిలించాలి. --వైజాసత్య 21:22, 31 మే 2008 (UTC)

[మార్చు] వైజాసత్య గారికి కృతజ్ఞతలు,అభినందనలు :-)

నేను రఘు గారి ఫోటో(http://ilovehyderabad.com/interviews/interviews-i-write-with-the-light.html) నుండి సేకరించాను. మీరు తెలియపరచినట్టు నేను సోర్సు ఇవ్వటం మరచినట్టు ఉన్నాను.తెలియ పరచినందుకు కృతజ్ఞతలు. నాకు అర్థం కాని విషయం రఘు గారి వ్యక్తిగత విషయాలు (ఎవరి ద్వారా వి.ఎస్.ఆర్ స్వామి గారి దగ్గర చేరింది) ఎలా తెలుసుకున్నారు.తెవికి లో మీ కృషి చూస్తుంటే మీ కింత ఓపికా,శక్తి ఎలా వొచ్చాయో అని ఆచర్య మేస్తుంది.మీ కృషి కి అభినందనలు. నేను ఎం.వి.రఘు గారి దగ్గర పనిచేశాను.ఆయన అవార్డ్ ఫోటోలు,వర్కింగ్ స్టిల్ల్స్,కామేరామన్ గా చేసిన సినిమాల వివరాలు వ్యక్తీ గతంగా సేకరించి అప్లోడ్ చేస్తే సోర్సు ఎలా ఇవ్వాలో సందేహం.తీర్చగలరు. వ్యక్తిగతంగా సేకరించాను అని తెలిపితే వుంచుతారా?! లేక కాపీ హక్కుల గొడవ కారణముతో తీసేస్తార!? కొందరు ఘనులు వున్నారు తెసేసేదానికి.అందుకే సందేహం వాసు. bojja 13:42, 2 జూన్ 2008 (UTC)

మీరు పైన ఇచ్చిన లింకులోని ఇంటర్యూలో రఘుగారు స్వయంగా చిత్రరంగములో ఎలా ప్రవేశించారో చెప్పారు. నేను అదే చేర్చాను తప్ప నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు. మీరు రఘుగారు స్వయంగా తెలుసుకాబట్టి స్వయంగా సంపాదించిన ఫోటోలు పెడితే సదుపయోగం ద్వారా తెచ్చుకున్నవి తీసెయ్యవచ్చు. మూలాలని నమ్మశక్యం కానీ విషయాలకు, వివాదాస్పదమైన విషయాలకు మరీ గుచ్చి అడుగుతారు. కానీ మీరు రఘుగారి గురించి వ్రాసే మామూలు సమాచారానికి అంత ఖచ్చితంగా మూలాలు అక్కర్లేదు కానీ మీరు వ్రాసిన వాటికి వీలైతే వాటిని బలపరుస్తూ ఎక్కడైనా తర్వాత సమాచారం కనిపిస్తే దాన్నే మూలంగా ఉదహరించవచ్చు. ఫోటోలకు ఎలాగు వ్యక్తిగతంగా సేకరించినట్టు అప్లోడ్ చేస్తారు. సమాచారానికి అలా వ్రాయవలసిన అవసరం లేదు. సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి. --వైజాసత్య 00:31, 3 జూన్ 2008 (UTC)

[మార్చు] చాల వివరంగా సమాధాన మిచ్చినందుకు మరొక్క సారి ధన్యవాదాలు :-)

చాల వివరంగా సమాధాన మిచ్చినందుకు మరొక్క సారి ధన్యవాదాలు ! వాసు. bojja 06:33, 3 జూన్ 2008 (UTC)

[మార్చు] సిరివెన్నెల సీతారామశాస్త్రి సమాచారపెట్టె వ్యక్తి మూసలో wife=పద్మావతి అని ఇస్తే ఎందుకు క

సిరివెన్నెల సీతారామశాస్త్రి సమాచారపెట్టె వ్యక్తి మూసలో wife=పద్మావతి అని ఇస్తే ఎందుకు కనిపించటం లేదు???
ఇదే సమస్య చాల వ్యాసాలలో జరిగింది.
ఉద:ఎం.వి.రఘు కూడా!!!
ఎవరయినా సరిదిద్దగలరు.
ధన్యవాదాలు.వాసు. bojja 13:37, 11 జూన్ 2008 (UTC)

wife బదులు spouse అని ఉండాలి. మూస:సమాచారపెట్టె వ్యక్తి చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:12, 11 జూన్ 2008 (UTC)

[మార్చు] కాసుబాబు గారికి కృతజ్ఞతలు,అభినందనలు :-)

సందేహం నివృత్తి చేసినందుకు, సరిదిద్దినందుకు కాసుబాబు గారికి కృతజ్ఞతలు. పనుల వొత్తిడి వల్ల కాస్త ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి:( వాసు. bojja 06:32, 13 జూన్ 2008 (UTC)

[మార్చు] సభ్యుల మూస

బొజ్జా గారు మూస:మల్టీమీడియా సభ్యుడు నచ్చితే మీ సభ్యపేజీలో వాడుకోండి. δευ దేవా 10:02, 21 జూన్ 2008 (UTC)

[మార్చు] దేవా గారికి కృతజ్ఞతలు :)

మీ సూచన ఉపయోగకరంగా వుంది.తప్పక వాడుకుంటాను.
కృతజ్ఞతలు :)
వాసు. bojja 10:38, 21 జూన్ 2008 (UTC)

[మార్చు] తెలుగు మెడల్

తెలుగు మెడల్
దాదాపు 1500 మార్పులు చేసి, తెలుగు వికీపీడియాకు మల్టీమీడియా వ్యాసాలను పరిచయం చేసిన వీరికి ఈ మెడల్ సముచితం.δευ దేవా 09:31, 23 జూన్ 2008 (UTC)

[మార్చు] దేవా గారికి కృతజ్ఞతలు :)

దేవా గారికి కృతజ్ఞతలు :)వాసు. bojja 10:10, 23 జూన్ 2008 (UTC)

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu