వి.వి.యెస్.లక్ష్మణ్
వికీపీడియా నుండి
వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ శైలి అజహరుద్దీన్ శైలిని పోలివుంటుంది. లక్ష్మణ ఇంతవరకు 88 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 12 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు.
విషయ సూచిక |
[మార్చు] కెరీర్ ఆరంభము
1996 సంవత్సరంలో దక్షిణాప్రికా జట్టుతో అహ్మదాబాదులో ఆడిన టెస్ట్ క్రికెట్ట్ మ్యాచ్ లొ యాభై పరుగులు చేసి అరంగ్రేట్రం చేశాడు. కాని తరువాత లక్ష్మణ్ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. 1997 సంవత్సరంలో దకిణాప్రికాతో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు, కాని విఫలం అయ్యాడు. ఇలా మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్టులో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. జనవరి 2000 సంవత్సరంలో భారత్ ఆస్ట్రేలియాకు జరిగిన సీరిస్ లో ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు.
[మార్చు] లక్ష్మణ్ అత్యుత్తమ ప్రదర్శనలు
లక్ష్మణ్ ఆట తీరు నాటకీయం గా ఈ సిరీస్ లో మారిపోయింది, ముంబయి లో జరిగిన మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ 20 మరియు 12 పరుగు లు చేసాడు. సచిన్ టెండుల్కర్ మినహా మిగతా అందరూ సరిగా ఆడలేకపోయారు. భారత్ ఈ టెస్ట్ లో పది వికెట్ల తేదాతో ఓడిపోయింది. అయినా తరువాత 2001 లో జరిగిన కలకత్తాలో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడి లో ఆస్ట్రేలియా పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతి లో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమం లో అతడు చాలా కాలం క్రితం సునీల్ గవాస్కర్ సాధించిన 236(నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు.[1] వీరేంద్ర సెహ్వాగ్ 2004 లో పాకిస్తాన్ తో ముల్తాన్ లో 309 పరుగులు చేసేవరకు ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. కలకత్తా లో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అంతకు ముందు టెస్టును ఇన్నింగ్స్ తేడా తో ఓడిపోయినప్పటికి మిగిలిన 2 టెస్టులు గెలిచి స్టీవ్ వా యొక్క " చివరి సరిహద్దు" కల ను వమ్ము చేసాడు. ప్రదర్శన భారత క్రికెట్ లో ఒక ఇతిహాసం గా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యద్బుత ప్రదర్శన లలో ఆరవది గా విజ్డన్ పత్రిక గుర్తించింది.[2] తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్మణ్ స్థానము ఒక రోజు పోటీ లకు, టెస్ట్ లకు పదిలం చేసుకున్నాడు. తర్వాత అతను తన ఆట తీరును ఇండియా ఆస్ట్రేలియా పర్యటన వరకు కొనసాగించాడు. ఇక్కడ అతను మూడు వన్డే , రెండు టెస్టు శతకాలు సాధించాడు. అతడు ఆస్ట్రేలియా పైన అడిలైడ్ లో 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రవిడ్ తో మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పై వారి సొంత గడ్డ పై గెలవడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడింది. అతను సిడ్నీ టెస్ట్ లో 178 పరగులు చేసి సచిన్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు.ఈ కారణము వలన ఇయాన్ చాపెల్ లక్ష్మణ్ ను " చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( very very special laxman ) అని వర్ణించాడు.
[మార్చు] ఇటీవలి ఆటతీరు
కాని లక్ష్మణ్ ఆటతీరు ఆస్ట్రేలియా పర్యటన నుండి తగ్గుతూ వచ్చింది. 2004 మార్చి లో పాకిస్తాన్ పర్యటన నుండి జింబాబ్వే( ఐసిసి ర్యాంకింగ్స్ లో చివరి స్థానం లో ఉన్న దేశము) తో సాధించిన ఒక సెంచరీ తో సహా కేవలము మూడు సెంచరీలు మాత్రమే సాధించాడు. అతను తన 2004 లో అభిమాన ఆస్ట్రేలియా తో మన దేం లో జరిగిన సీరీస్ లో ముంబయి లో జరిగిన టెస్ట్ లో 69 పరుగులు సాధించినా చాలా తడబడ్డాడు. ఆ టెస్ట్ భారత్ గెలిచినప్పటికి సిరీస్ కోల్పోయింది. ముంబయి లో మార్చ్ 2006 లో ఇంగ్లాండు తో మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ సున్నా పరుగులు చేసి స్థానము కోల్పోయాడు. తిరిగి గాయము కారణము గా సచిన్ గైర్హాజరీ కారణము గా వెస్టిండీస్ పర్యటన లో స్థానము సాధించి మూడవ టెస్ట్ లో శతకము సాధించాడు. గ్రెగ్ ఛాపెల్ 2005 లో కోచ్ గా వచ్చిన తర్వాత లక్ష్మణ్ యొక్క నాశిరకం ఫీల్డింగ్, అతని ఆటతీరు వన్డే లకు సరిపోకపోవడం వలన వన్డే ల నుండి తొలగింపబడ్డాడు. ఇది 2004 మొదట్లో ఆస్ట్రేలియా,పాకిస్తాన్ లతో 14 గేములలో 4 శతకాలు, ఆస్ట్రేలియా తో ఒకే వారము లో విబి సీరీస్ లో సాధించిన 3 సెంచరీలు కలుపుకుని, మరుగునపరిచింది. నవంబరు 2006 లో గంగూలీ తో పాటు లక్ష్మణ్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. లక్ష్మణ్ ఫిబ్రవరి 2004 లో జి.ఆర్.శైలజను వివాహమాడెను.