See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
తాండూర్ (రంగారెడ్డి) - వికీపీడియా

తాండూర్ (రంగారెడ్డి)

వికీపీడియా నుండి

  ?తాండూర్ మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటములో తాండూర్ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో తాండూర్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°14′N 77°35′E / 17.23, 77.58
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము తాండూర్
జిల్లా(లు) రంగారెడ్డి
గ్రామాలు 33
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
103,278 (2001)
• 52136
• 51142
• 59.82
• 70.26
• 49.18

అక్షాంశరేఖాంశాలు: 17°14′N 77°35′E / 17.23, 77.58

తాండూర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణము, మండలము. తాండూరు పట్టణము హైదరాబాదు నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాండూర్ పారిశ్రామికంగా మరియు వ్యవసాయపరంగా బాగా అబివృద్ది చెందిన తాండూరు పట్టణము రంగారెడ్డి జిల్లా పశ్చిమాన ఉంది. పారిశ్రామికపరంగా నాపరాళ్ళకు మరియు వ్యవసాయపరంగా కందులకు ప్రసిద్ది. ఇక్కడి నుండి భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు వాడే నాపరాయి షోలాపూర్, ముంబాయి, హైదరాబాదు మున్నగు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. తాండూరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కాగ్నానది ఉంటుంది, ఇది మూసీనదికి ఉపనది. ఈ నది నుండి మహబూబ్ నగర్లోని కోడంగల్ మున్నగు ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు.
రవాణా పరంగా కూడా తాండూర్ కు మంచి సౌకర్యాలు కలవు. హైదరాబాదు నుంచి కర్ణాటక లోని వాడి రైలుమార్గము లో హైదరాబాదు కు 110 కిలో మీటర్ల దూరంలో ఉంది. బస్సులు కూడ హైదరాబాదు నుంచి ప్రయాణానికి మంచి వసతులున్నాయి. ఇక్కడ ప్రతి ఏటా ఉగాది పర్వదినం తర్వాత శ్రీ భావిగి భద్రేశ్వర స్వామిజాతర మరియు రథోత్సవం జర్గుతుంది.

విషయ సూచిక

[మార్చు] తాండూరు పట్టణ చరిత్ర

తాండూరు పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1953 కు పూర్వం ఇది నిజాం రాష్ట్రం లో భాగంగా ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉండేది. 1953 లో ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాదు జిల్లాలో కలిసింది. 1956 లో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ఫలితంగా ఆంద్ర ప్రదేశ్ లో భాగమై 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. 1978 లో మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంతో ఇది ఈ జిల్లాలో భాగమై కొనసాగుతోంది.

మున్సీపాలిటీ : తాండూరు మున్సీపాలిటీ 1953 లో ఏర్పడింది. 1961 లో పట్టణ జనాభా కేవలం 2000 ఉండగా నేడు సుమారు 50 వేలు జనాభాతో విలసిల్లుతోంది. నాపరాతి గనులు, పాలిష్ మిషన్ల వల్ల అనేక మంది జీవనోపాధి కొరకు మారుమూల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పాలిష్ మిషన్ల వల్ల మున్సీపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం కూడ వస్తుంది. అలాగే భవన నిర్మాణాల పరిశ్రల ఏర్పాటు అనుమతులకు పెద్ద మొత్తంలో ఫీజు మునిసిపాలిటీకి లభిస్తుంది.

తాండూరు కంది పప్పు : మంచి మాంసకృత్తులు పౌష్టికాహారం కల్గిన కందిపప్పు ఉత్పత్తిలో తాండూరు పేరెన్నికగన్నది. కందిపప్పు ఉత్పతిలో తాండూరు రాష్ట్రంలోనే ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. నల్లరేగడి భూముల్లో పెరిగే కంది పంటకు ఇక్కడి భూములు అనువుగా ఉండటం మరియు రైతులు ఆసక్తి చూపడంతో పంట ఉత్పత్తి బాగుగా జర్గుతుంది. ఈ పంటకు వర్షాకాలం ఆరంభంలో విత్తనాలు చల్లుతారు. నవంబర్ చివరి నాటికి పంట మార్కెట్ లోకి వస్తుంది. పూర్తిగా ఎండని, కాయ దశలోనే ఉన్న కంది కాయలను రైతులు మార్కెట్ లో తెచ్చి అమ్మడం, దాన్ని ఉప్పు వేసిన నీటిలో ఉడకబెట్టి దాని విత్తులను తినడం ఇక్కడ మాత్రమే కన్పించే అపురూప దృశ్యం. కంది పంట వల్ల ఇక్కడ దాల్ మిల్లులు కూడ అధిక సంఖ్యలోనే ఉన్నాయి. కల్తీ లేని స్వచ్ఛమైన కందులకు ఇక్కడి మార్కెట్ ప్రసిద్ధి. పరిసర ప్రాంతాలలో కూడ తాండూరు కందికి విపరీతమైన డిమాండు ఉంది.

తాండూర్ పట్టణంచించోళి వెళ్ళు ప్రధాన రహదారి నుంచి విజయవిద్యాలయ పాఠశాలవైపు వెళ్ళు రహదారి
తాండూర్ పట్టణం
చించోళి వెళ్ళు ప్రధాన రహదారి నుంచి విజయవిద్యాలయ పాఠశాలవైపు వెళ్ళు రహదారి
తాండూర్ రైల్వేస్టేషన్
తాండూర్ రైల్వేస్టేషన్
తాండూర్ పట్టణం
తాండూర్ పట్టణం
అమ్మకానికి సిద్ధంగా ఉన్న తాండూర్ పాలిషింగ్ నాపరాయి
అమ్మకానికి సిద్ధంగా ఉన్న తాండూర్ పాలిషింగ్ నాపరాయి

పాలిషింగ్ పరిశ్రమ :

ముఖ్య వ్యాసము: తాండూర్ నాపరాతి పరిశ్రమ

తాండూరు నాపరాతి గనులు వేలాది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. గనుల నుంచి ముడి రాళ్ళను తీయడం ఒక ఎత్తయితే దానికి మెరుగులు దిద్ది భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు అనువైన రీతిలో మలచడం మరో ఎత్తు. ఈ పరిశ్రమ వల్ల అధిక సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది, కార్మికులకు, జీవనోపాధి లభిస్తుంది, వాహనాలకు గిరాకీ పెర్గుతుంది, ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఆదాయం లభిస్తుంది, యంత్రపరికరాలు తయారు చేయువారికి, మెకానిక్ లకు మంచి డిమాండు ఉంటుంది. ఈ విధంగా తాండూరు పట్టణము అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది.

[మార్చు] శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం

తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం కోర్కెలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటే ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తాండూరు, వికారాబాదు, పర్గి, బషీరాబాదు, యాలాల, పెద్దెముల్, కోడంగల్, కోస్గి నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా విపరీతంగా వస్తుంటారు.వారం రూజుల పాటు జర్గే ఈ ఉత్సవాల్లో చివరి రెండు రోజులు ప్రధానమైనవి. శని, ఆది వారాల్లో జర్గే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు వేచిఉంటారు. శనివారం అర్థరాత్రి జర్గే ర్థోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు. భక్తులు తమ కోరికల్ని మనస్సులో తలచి రథంపైకి అరటిపళ్ళు విసురుతారు. కలశపు భాగానికి అవి తగిలితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రథోత్సవం తర్వాత రథం చుట్టూ మరియు పరిసర ప్రాంతంలో దుకాణాలు వెలుస్తాయి. వారం రోజుల పాటు ఈ ప్రదేశం జనసందోహంగా ఉంటుంది. ఆదివారం అర్థరాత్రి జర్గే లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది.

దేవాలయ చరిత్ర

కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లాకు చెందిన భావిగి అనే గ్రామలో సుమారు 200 సం.ల క్రితం భద్రప్ప జన్మించినట్లు భక్తుల నమ్మకం. ఈయన వీరభద్రుని అవతారమని చెబుతారు. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగిలో కూడ ఇత్సవాలు జర్గుతాయి. తాండూరు నివాసి పటేల్ బసన్నకు భద్రప్ప కలలో కన్పించి తన పాదుకలను భావిగి మటం నుంచి తీసుకువచ్చి వీటిని తాండూరు లో ప్రతిష్టించి, ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, జాతర జర్పాలని అజ్ఝాపించినట్లు కథ ప్రచారంలో ఉంది.

[మార్చు] విద్యాసంస్థలు

డిగ్రీ కళాశాలలు
  • పీపుల్స్ డిగ్రీ కళాశాల
  • శ్రీసాయి డిగ్రీ కళాశాల
  • శాలివాహన డిగ్రీ కళాశాల
జూనియర్ కళాశాలలు
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • విజ్ఞాన్ జూనియర్ కళాశాల
  • చైతన్య జూనియర్ కళాశాల
  • అంబేద్కర్ సెంటినరీ జూనియర్ కళాశాల
  • సిద్ధార్థ జూనియర్ కళాశాల
  • సింధు బాలికల్ జూనియర్ కళాశాల
పాఠశాలలు
  • ప్రభుత్వోన్నత పాఠశాల నెం.1
  • విజయ విద్యాలయ హైస్కూల్
  • సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ (శివాజీ చౌక్)
  • సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల
  • తాండూర్ ప్రొగ్రెస్సివ్ హైస్కూల్ (గాంధీనగర్)
  • విద్యాభారతి హైస్కూల్ (వాల్మికీనగర్)
  • శివసాగర్ విద్యాలయ హైస్కూల్ (సాయిపూర్)
  • బ్రిలియంట్ కాన్వెంట్ హైస్కూల్
  • సెయింట్ మార్క్స్ హైస్కూల్
  • కోటేశ్వర హైస్కూల్ (పాత తాండూర్)
  • కన్యా పాఠశాల హైస్కూల్
  • విలియం మూన్ హైస్కూల్

[మార్చు] వినోదం

తాండూర్ పట్టణంలోని సినిమా థియేటర్లు

  • శాంత్‌మహల్ (ఏ.సి.) థియేటర్
  • లక్ష్మీమహల్ (ఏ.సి) థియేటర్
  • సరస్వతి థియేటర్
  • ఆదిశక్తి థియేటర్
  • శివశక్తి థియేటర్
  • శ్రీనివాస థియేటర్
  • చంద్ర థియేటర్

[మార్చు] తాండూరు పరిసరాలలో చూడదగిన ప్రదేశాలు

  • శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం
  • రసూల్‌పూర్ హనుమాన్ దేవాలయం
  • జుంటుపల్లి రామాలయము
  • జుంటుపల్లి ప్రాజెక్టు
  • కాగ్నానది
  • కోట్ పల్లి ప్రాజెక్టు
  • అనంతగిరి కొండలు
  • ముర్షిద్ దర్గా
  • అల్లాపూర్ ప్రాజెక్టు

[మార్చు] తాండూర్ సిమెంటు పరిశ్రమ

తాండూర్ రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాదు రైల్వేస్టేషన్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో కరన్‌కోట గ్రామం పరిధిలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అజమాయిషీలోని సిసిఐ సిమెంటు కర్మాగారం 1987లో ఉత్పత్తి ప్రారంభించబడింది.[1] ఇది 2340 ఎకరాల వైశాల్యంలో విస్తరించబడి ఉన్నది. సి సి ఐ కు దేశవ్యాప్తంగా ఉన్న 11 సిమెంటు ప్లాంట్లలో ఇది ఒకటి.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. http://cementcorporation.co.in/plants_tandur.html

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -