See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం - వికీపీడియా

తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు కలవు. ఇంతకు క్రితం ఈ నియోజకవర్గం హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పునర్విభజన ఫలితంగా నూతనంగా ఏర్పడిన చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగమైంది.

విషయ సూచిక

[మార్చు] ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1978 ఎం.మాణిక్ రావు భారత జాతీయ కాంగ్రెస్ సిరుగిరిపేట్ రెడ్డి జనతా పార్టీ
1983 ఎం.మాణిక్ రావు భారత జాతీయ కాంగ్రెస్ సిరిగిరిపేట్ రెడ్డి ఇండిపెండెంట్
1985 ఎం.చంద్రశేఖర్ భారత జాతీయ కాంగ్రెస్ సిరిగిరిపేట్ బాలప్ప తెలుగుదేశం పార్టీ
1989 ఎం.చంద్రశేఖర్ భారత జాతీయ కాంగ్రెస్ పసారాం శాంత్‌కుమార్ తెలుగుదేశం పార్టీ
1994 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.నారాయణ రావు కాంగ్రెస్
1999 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.మాణిక్ రావు కాంగ్రెస్
2004 ఎం.నారాయణ రావు కాంగ్రెస్ పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం

[మార్చు] పార్టీల బలాబలాలు

ఈ నియోజకవర్గంలో ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని వదులుకోలేదు. 1985 మరియు 1989 ఎన్నికలలో ఎం.చంద్రశేఖర్ వరుసగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినాడు. అంతకు క్రితం వరకు అతడి సోదరుడు ఎం.మాణిక్ రావు గెలుపొందుతూ తన సోదరుడికి స్థానం ఇచ్చాడు. దురదృష్టవశాత్తూ ఎం.చంద్రశేఖర్ మరణం తరువాత మరో సోదరుడు ఎం.నారాయణ రావు బరిలో దిగిననూ 1994లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి విజయం లభించింది. 1999లో మళ్ళీ మాజీ రోడ్డు, భవనాల మంత్రి అయిన ఎం.మాణిక్ రావు స్వయంగా రంగంలోకి దిగిననూ ఫలితం దక్కలేదు. 2004లో ఎం.నారాయణరావు విజయం సాధించాడు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం మినహా మూడో పార్టీ అంతగా బలపడలేదు. కాని లోకసభ ఎన్నికలలో మరియు పురపాలక సంఘపు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గణనీయమైన ఓట్లను సాధించగలిగింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందుిది హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉండి ఇక్కడి నుంచి భాజపా తరఫున పోటీచేసిన బద్దం బాల్‌రెడ్డి తాండుర్ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఓట్లను సాధించాడు. అలాగే పురపాలక సంఘ ఎన్నికలలో ఇంతకు క్రితం భాజపాకు చెందిన నాగారం నర్సిములు చెర్మెన్‌గా పనిచేశాడు.

[మార్చు] 2004 ఎన్నికలు

కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలకు పగ్గం వేసిన పి.మహేందర్ రెడ్డి రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన తరువాత 2004లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వీచిన రాజకీయ పవనాల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణ రావు చేతిలో ఓడిపోయాడు. అంతకు క్రితం 1994 వరకు అతడి సోదరులు ఎం.మాణిక్ రావు మరియు ఎం.చంద్రశేఖర్‌లు ఈ నియోజకవర్గం తరఫున శాసనసభ్యులుగా కొనసాగినారు.

2004 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
గెలుపొందిన అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
ఎం.నారాయణ రావు కాంగ్రెస్ పార్టీ 69,945
పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 56391
గౌస్ మొహియుద్దీన్ ఇండిపెండెంట్ 2622
రామావత్ మోత్య ఇండిపెండెంట్ 2351

[మార్చు] నియోజకవర్గ ప్రముఖులు

ఎం.మాణిక్ రావు
తాండూర్ నాపరాతి పరిశ్రమకు ఆద్యుడైన ఎం.మాణిక్ రావు అనేక దశాబ్దాలపాటు నియోజకవర్గానికి సేవలందించాడు. బషీరాబాద్ గ్రామ వాస్తవ్యులైన ఇతడు రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్డు,భవనాల శాఖామంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గం తరఫున తిరుగులేని నాయకుడిగా ఎదిగి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన స్థానం నుమ్చి తాత్కాలికంగా తప్పుకొని సోదరుడు ఎం.చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాడు. 1999లో మళ్ళీ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిననూ విజయం లభించలేదు.
పసారాం శాంత్‌కుమార్
ఇతడు ప్రారంభం నుంచి రాజకీయనాయకుడు కాకున్ననూ మంచి స్వభావం కల వ్యక్తి కావడంతో 1989లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్టు లభించింది. సినిమా థియేటర్ వల్ల తాండూరు ప్రజలకు ఎంతోచేరువైననూ, మంచి నాయకులలో ఒకడిగా పేరు సంపాదించిననూ ఎన్నికలలో మాత్రం విజయం లభించలేదు.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -