పొన్నూరు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?పొన్నూరు మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పొన్నూరు |
జిల్లా(లు) | గుంటూరు |
గ్రామాలు | 19 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
123,060 (2001) • 61810 • 61250 • 71.91 • 78.34 • 65.48 |
అక్షాంశరేఖాంశాలు:
పొన్నూరు (Ponnuru), గుంటూరు జిల్లాలోని ఒక చారిత్రక పట్టణము. ఇదేపేరిట గల మండలానికి కేంద్రం కూడా. పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. గుంటూరు నగరానికి 25 కి మీ ల దూరంలో గుంటూరు, చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది. చెన్నై-కోల్కతా రైలు మార్గం ఈ పట్టణం గుండా పోతుంది.
విషయ సూచిక |
[మార్చు] పట్టణ విశేషాలు
గుంటూరు నుండి 25 కి.మీ.దూరం కలిగిన పొన్నూరులో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి గుడి కలదు. ఇక్కడి శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానం 1961 లో నిర్మితమైనది ఈయనను సాక్షిభావనారాయణుడని అంటారు.ఇదే ఆలయప్రాంగణమున శ్రీ రాజ్యలక్షీ అమ్మవారి ఆలయం,శ్రీ కాశీవిశ్వేశ్వరాలయము,శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయాలూ గలవు. 1961 లో నిర్మితమైన శ్రీఆంజనేయస్వామి శ్రీ గరుత్మంతస్వామిల విగ్రహ ప్రతిష్త జరిగినది. ఈ విగ్రహాలు 30 అడుగుల ఎత్తు 24 అడుగుల ఎత్తుతో నయనానందకరముగా కనిపిస్తూ భుహుళ ప్రసిద్ధికెక్కినవి. పొన్నూరు ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రము. గుంటూరు జిల్లా లోని ముఖ్య పురపాలక సంఘాలలో ఒకటి. నిడుబ్రోలు పొన్నూరును ఆనుకుని ఉన్న ఒక ప్రముఖ గ్రామం. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే పట్టణం వలె అనిపిస్తాయి. రైల్వే స్టేషను నిడుబ్రోలు పేరిటే ఉంటుంది. అలాగే చుట్టుపట్ల ఉన్న ఎన్నో వ్యవసాయ ఆధారిత గ్రామాలకు పొన్నూరు కేంద్రంగా ఉన్నది.
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, స్వర్గీయ ఎన్‌జీ రంగా (గోగినేని రంగనాయకులు) పొన్నూరునే కార్యస్థలంగా చేసుకుని తమ కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీరి పేరిటే ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము అని పేరు పెట్టారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చే కళాప్రపూర్ణ బిరుదాన్ని అందుకున్న తుమ్మల సేతారామ మూర్తి , కొందవీటి వెంటకవి , కొత్త సత్యనారాయణ చౌదరి వంటి కవులు , దళిత సాహిత్య, ఉద్యమ నిర్మాత కత్తి పద్మారావు , ప్రముఖ కవి యేటుకూరి వెంకట నరసయ్య , పండిత శ్రీ కృష్ణభగవాన్ వంటి వారు యిక్కద సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు.గుంటూరు జిల్లా విద్యారంగం లో పురోగమించడానికి మూలపురుషుడు , అప్పటి గుంటూరు జిల్లా బోర్డు అద్యక్షులు పాములపాటి కృష్ణయ్య చౌదరి ,ఎందరినో రక్షణ శాఖలో చేర్పించి , రాష్ట్రంలో ఎన్.సి.సి ని తీర్చి దిద్దిన కల్నల్ పి .ల్.న్ .చౌదరి నిడుబ్రోలు గ్రామస్తులే.మాజి కేంద్రమంత్రి పాములపాటి అంకినీడు ప్రసాద రావు, చేనేత ఉద్యమ పితామహులు, నాయకులు ప్రగడ కోటయ్య, మాజి శాసన సభ్యులు సజ్జా చంద్ర మౌళి , వెంకయ్య , గోగినేని నాగేస్వర రావు ,చిట్టినేని వెంకట రావు వంటి ఎందరో నాయకులకు స్వగ్రామం .
స్థానికంగా మంచి వ్యాపార కేంద్రంగా పొన్నూరు ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గల గ్రామాల నుండి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు పొన్నూరు ద్వారానే ఇతర ప్రాంతాలకు తరలుతూ ఉంటాయి. ధాన్యం, తమలపాకులు, అరటి పళ్ళు, కూరగాయలు మొదలైనవి ఈ ఉత్పత్తులలో ప్రముఖమైనవి. కృష్ణా నదిపై విజయవాడ వద్ద గల ప్రకాశం బారేజి నుండి పొన్నూరుకు, చుట్టుపక్కల గ్రామాలకు బకింగ్‌హాం కాలువ ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది.
ప్రముఖ చారిత్రక స్థలాలైన చేబ్రోలు, చందోలు (చందవోలు) పొన్నూరుకు సమీపంలో ఉన్నాయి. బాపట్ల పట్టణం 19 కి మీ ల దూరంలో ఉన్నది.
[మార్చు] రవాణా వివరాలు
పొన్నూరు పట్టణం తోపాటు మండలం కూడా మంచి రవాణా వ్యవస్థ కలిగిఉంది. పట్టణం గుంటూరు-బాపట్ల-చీరాల రాష్ట్ర రహదారిపై ఉండటం చేత దూర, సమీప ప్రాంతాలతో చక్కని సంధానం కలిగిఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క డిపో పొన్నూరు పట్టణంలో ఉండటంచేత పొన్నూరు, చుట్టుపక్కల గ్రామాలకు మంచి రవాణా వ్యవస్థ ఏర్పడింది. కాని డిసెంబరు 2006 లో బస్ డిపో ఎత్తివేయడంతో బస్సుల రాక పోకలలో కొద్దిగా మార్పు రావటమే కాకుండా, మునుపటంత సౌకర్యంగా లేదు.
పొన్నూరు నుండి బయటకు వెళ్ళు రహదారులు :
గుంటూరు(25 కి.మీ.), విజయవాడ(60 కి.మీ.) : పచ్చలతాడిపర్రు గుండా; పెదనందిపాడు (25 కి.మీ.) : కసుకర్రు గుండా; రేపల్లె (26 కి.మీ.), తెనాలి(28 కి.మీ.) : నిడుబ్రోలు గుండా; బాపట్ల(19 కి.మీ.), చీరాల (34 కి.మీ.): చింతలపూడి గుండా;
చెన్నై-కోలంకతా ప్రధాన రైలుమార్గం పట్టణం గుండా పోతుండడం వలన రైలు సౌకర్యం కూడా బాగా ఉంది.
[మార్చు] మండల వివరాలు
అత్యధిక భాగం గ్రామీణప్రాంతమైన ఈ మండలంలో పొన్నూరు పట్టణంలోని 25 వార్డులు కూడా కలిసిఉన్నాయి. మండలం మొత్తం జనాభాలో పట్టణప్రాంత జనాభా 47%. ఆర్ధికవ్యవస్థ వ్యవసాయ ఆధారితము. పట్టణములోని ముఖ్య ప్రాంతములు : పాత పొన్నూరు, గాజులపాలెం, షరాఫ్ బజార్, బ్రాహ్మణ బజార్, తెలగపాలెం, భావనగర్ కాలనీ, విద్యానగర్, నేతాజీనగర్, శ్రీనగర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ,ఐలాండ్ సెంటర్. పట్టణములో 7 సినిమా థియేటర్లు కలవు, అవి : సుబ్బరాయ, శ్రీనివాస, లక్ష్మి, పి.వి.ఎస్., అన్సార్, మూర్తిమహల్, వెంకట సీతారామ.
నిడుబ్రోలులో డిగ్రీ కాలేజిని 50 సంవత్సరముల క్రిందట పాములపాటి బుచ్చినాయుడు అనే వితరణ శీలి ఏర్పాటు చేశాడు. ఒక పంచాయతి గ్రామం లో డిగ్రీ కళాశాల ఏర్పాటు గావడం ఒక విశేషం.
[మార్చు] మండలంలోని గ్రామాలు
పొన్నూరు, గరికపాడు (కాకుమాను మండలం), జూపూడి (పొన్నూరు మండలం), బ్రాహ్మణ కోడూరు, వెల్లలూరు, మామిళ్ళపల్లి, ఆరెమండ, దండమూడి, మునిపల్లె (పొన్నూరు మండలం), పచ్చలతాడిపర్రు, దొప్పలపూడి, మన్నవ, ఉప్పరపాలెం, కొండముది, జడవల్లి, వడ్డెముక్కల, చింతలపూడి (పొన్నూరు మండలం), వల్లభరావుపాలెం,పెదపాలెం (పొన్నూరు మండలం) నండూరు, ములుకుదురు,మాచవరం,
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
మాచెర్ల · రెంటచింతల · గురజాల · దాచేపల్లి · మాచవరం · బెల్లంకొండ · అచ్చంపేట · క్రోసూరు · అమరావతి · తుళ్ళూరు · తాడేపల్లి · మంగళగిరి · తాడికొండ · పెదకూరపాడు · సత్తెనపల్లి · రాజుపాలెం(గుంటూరు) · పిడుగురాళ్ల · కారంపూడి · దుర్గి · వెల్దుర్తి(గుంటూరు) · బోళ్లపల్లి · నకరికల్లు · ముప్పాళ్ల · ఫిరంగిపురం · మేడికొండూరు · గుంటూరు · పెదకాకాని · దుగ్గిరాల · కొల్లిపర · కొల్లూరు · వేమూరు · తెనాలి · చుండూరు · చేబ్రోలు · వట్టిచెరుకూరు · ప్రత్తిపాడు · యడ్లపాడు · నాదెండ్ల · నరసరావుపేట · రొంపిచెర్ల · ఈపూరు · శావల్యాపురం · వినుకొండ · నూజెండ్ల · చిలకలూరిపేట · పెదనందిపాడు · కాకుమాను · పొన్నూరు · అమృతలూరు · చెరుకుపల్లి · భట్టిప్రోలు · రేపల్లె · నగరం · నిజాంపట్నం · పిట్టలవానిపాలెం · కర్లపాలెం · బాపట్ల |
|
|
---|---|
పొన్నూరు · గరికపాడు (కాకుమాను మండలం) · జూపూడి (పొన్నూరు మండలం) · బ్రాహ్మణ కోడూరు · వెల్లలూరు · మామిళ్ళపల్లి · ఆరెమండ · దండమూడి · మునిపల్లె (పొన్నూరు మండలం) · పచ్చలతాడిపర్రు · దొప్పలపూడి · మన్నవ · ఉప్పరపాలెం · కొండముది · జడవల్లి · వడ్డెముక్కల · చింతలపూడి (పొన్నూరు మండలం) · వల్లభరావుపాలెం · పెదపాలెం (పొన్నూరు మండలం) నండూరు · ములుకుదురు · మాచవరం · |