చేబ్రోలు
వికీపీడియా నుండి
?చేబ్రోలు మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | చేబ్రోలు |
జిల్లా(లు) | గుంటూరు |
గ్రామాలు | 11 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
68,810 (2001) • 35580 • 33230 • 64.65 • 72.50 • 56.21 |
అక్షాంశరేఖాంశాలు:
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామము మరియు మండల కేంద్రం. చేబ్రోలు, గుంటూరు - చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది. ఇది పొన్నూరు శాసనసభ నియోజక వర్గంలో భాగంగా ఉంది. భారతదేశంలోనే అరుదైన బ్రహ్మ ఆలయాల్లో ఒకటైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం చేబ్రోలులో ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
పురాతన గ్రామమైన చేబ్రోలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక శాసనాలు మరియు పురాతన నాణేలు లభ్యమైనవి. చేబ్రోలు కోట పల్లవులు, చాళుక్యులు మరియు కాకతీయ సామ్రాజ్యములలో ప్రాంతీయ దుర్గముగా ఉన్నది. చేబ్రోలుకు పూర్వము శంభోలు అనే పేరు ఉన్నది. శంభోలు నుండే చేబ్రోలు అన్న పేరుపుట్టింది. చేబ్రోలులో అనేక చాళుక్య శాసనాలు లభ్యమైనవి. యుద్ధమల్లుని విజయవాడ శాసనములో చేబ్రోలు యొక్క ప్రస్తావన ఉన్నది.[1] కాకతీయుల కాలములో చేబ్రోలు ప్రసిద్ధి చెందినది. కాకతీయుల సేనాని, నృత్యరత్నావళి రచించిన జయాప సేనాని చేబ్రోలు దుర్గాన్ని పాలించినాడు.
భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న అతికొద్ది ఆలయాల్లో ఒకటి చేబ్రోలులో వుంది. ఇక్కడి బ్రహ్మ పాలరాతి విగ్రహానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 19వ శతాబ్ధి ప్రారంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడని ప్రతీతి. పూర్వం చేబ్రోలులో 101 గుళ్ళు 101 బావులు ఉన్నట్లు ప్రసిద్ధి. కాలాంతరమున కొన్ని కాలగర్భమున కలిసి పోయినవి.
సంగం జాగర్లమూడి చేబ్రోలు మండలంలోని ప్రముఖ గ్రామం. ఇక్కడి సంగమేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది. రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన పాల ఉత్పత్తుల కేంద్రం ఇక్కడ ఉన్నది. చేబ్రోలుకు సమీపము ఉన్న బకింగ్‌హాం కాలువ జల రవాణాకు మరియు నీటిపారుదలకు ఉపయోగ్యముగా ఉన్నది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గొడవర్రు
- నారాకోడూరు
- వేజెండ్ల
- సుద్దపల్లి
- శేకూరు
- వడ్లమూడి
- శ్రీరంగాపురం
- చేబ్రోలు
- పాతరెడ్డిపాలెం
- మాంచాల
- మీసరగడ్డ అనంతవరం [2]
[మార్చు] మూలాలు
- ↑ Brāhmanism, Jainism, and Buddhism in Āndhra Dēśa By P. Arundhati పేజీ.72 [1]
- ↑ http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=AP&district=6&block=8&reportLevel=3
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
మాచెర్ల · రెంటచింతల · గురజాల · దాచేపల్లి · మాచవరం · బెల్లంకొండ · అచ్చంపేట · క్రోసూరు · అమరావతి · తుళ్ళూరు · తాడేపల్లి · మంగళగిరి · తాడికొండ · పెదకూరపాడు · సత్తెనపల్లి · రాజుపాలెం(గుంటూరు) · పిడుగురాళ్ల · కారంపూడి · దుర్గి · వెల్దుర్తి(గుంటూరు) · బోళ్లపల్లి · నకరికల్లు · ముప్పాళ్ల · ఫిరంగిపురం · మేడికొండూరు · గుంటూరు · పెదకాకాని · దుగ్గిరాల · కొల్లిపర · కొల్లూరు · వేమూరు · తెనాలి · చుండూరు · చేబ్రోలు · వట్టిచెరుకూరు · ప్రత్తిపాడు · యడ్లపాడు · నాదెండ్ల · నరసరావుపేట · రొంపిచెర్ల · ఈపూరు · శావల్యాపురం · వినుకొండ · నూజెండ్ల · చిలకలూరిపేట · పెదనందిపాడు · కాకుమాను · పొన్నూరు · అమృతలూరు · చెరుకుపల్లి · భట్టిప్రోలు · రేపల్లె · నగరం · నిజాంపట్నం · పిట్టలవానిపాలెం · కర్లపాలెం · బాపట్ల |
|
|
---|---|
గొడవర్రు · నారాకోడూరు · వేజెండ్ల · సుద్దపల్లి · శేకూరు · వడ్లమూడి · శ్రీరంగాపురం · చేబ్రోలు · పాతరెడ్డిపాలెం · కొత్తరెడ్డిపాలెం · మాంచాల · మీసరగడ్డ అనంతవరం |