పిల్లలు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను పిల్లలు అంటారు.[1][2] అయితే, సాధారణ వ్యవహారములో తల్లితండ్రులు తమ సంతానాన్ని ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అనటం పరిపాటే. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి.[3][4] ఈ పదం ఒకవిధంగా ఆలోచిస్తే ఏ వయసుకు చెందినవారికైనా వర్తిస్తుంది. ఉదా. పెద్దవాళ్ళు కూడా వారి తల్లిదండ్రులకు పిల్లలే కదా. ఇది పిల్ల మొక్కలకు కూడా వాడవచ్చును. ఒకేసారి పుట్టిన పిల్లలను కవలలు అంటారు.
విషయ సూచిక |
[మార్చు] చట్టపరమైన నిర్వచనం
వివిధ దేశాలలో పిల్లలను చట్టపరంగా 'మైనర్' అని నిర్వచిస్తారు.
The Convention on the Rights of the Child నిర్వచనం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మానవుల్ని పిల్లలుగా భావిస్తారు.[5]
పిల్లల్ని చదువుకోనీకుండా పనిలో ఉపయోగించి కార్మికులుగా చేయడం సరైనది కాదు. పేదవారైన తల్లిదండ్రులు దీనిని ప్రోత్సహిస్తున్నా, ఇళ్ళలో, కర్మాగారాలు, హోటల్లు మొదలైన వాటిలో వీరితో పనిచేయించుకోవడం బాల కార్మిక చట్టం ప్రకారం ఇది నేరం.
యుక్తవయసు రాకుండా పిల్లలకు వివాహం చేయడాన్ని 'బాల్య వివాహాలు' అంటారు. ఇది కూడా చట్టరీత్యా నేరం.
[మార్చు] పురాణాలలో
- భక్త ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు పిల్లలలో అత్యుత్తమ స్థాయికి చేరారు.
[మార్చు] పండుగలు
- నవంబరు 14: ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం (Children's day) పండుగ జరుపుకుంటాం.
- అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరుగుతుంది..
[మార్చు] మూలాలు
- ↑ yourdictionary.com: Child
- ↑ dict.die.net: Child
- ↑ Edwards, Jonathan (2007-05-17). Helping my son improve his game. allexperts.com. తీసుకొన్న తేదీ: 2007-10-16.
- ↑ Yearbook of the National Society for the Study of Education
- ↑ Convention on the Rights of the Child. Office of the United Nations High Commissioner for Human Rights ([[]]). Ratified by 192 of 194 member countries.