ద్వాదశాదిత్యులు
వికీపీడియా నుండి
హిందూ పురాణాలలో "అదితి" మరియు కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు:
- ఇంద్రుడు - శ్రావణం
- ధాత - చైత్రం
- పర్జన్యుడు - మార్గశిరం
- త్వష్ట - ఆశ్వీయుజం
- పూషుడు - మాఘం
- అర్యముడు - వైశాఖం
- భగుడు - పుష్యం
- వివస్వంతుడు - భాద్రపదం
- విష్ణువు - కార్తీకం
- అంశుమంతుడు - ఫాల్గుణం
- వరుణుడు - ఆషాఢం
- మిత్రుడు - జ్యేష్ఠం
మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో(65-15,16) చెప్పబడిన పేర్లు:
- ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
- భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
- ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
- జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)
"ఆదిత్యానామహం విష్ణుః" - ఆదిత్యులలో నేను విష్ణువును - అని భగవద్గీతలో (10-21) చెప్పబడినది.