అష్టాంగాలు
వికీపీడియా నుండి
పతంజలి యోగసూత్రాల్లోని అష్టాంగాలు సాధనా మార్గాలు.
- యమము అనగా ఇంద్రియ నిగ్రహము. ఇందులో పది రకాలున్నాయ (పదో రకం ఏదీ?)
- అహింస
- సత్యము
- అస్తేయము (మనో వాక్కాయ కర్మలచేత పర ద్రవ్యమునందు కోరిక లేకుండా ఉండుట)
- దొంగిలింపకుండుట
- బ్రహ్మ చర్యము
- దయ
- అర్జవము (అందరి పట్ల ప్రవృత్తిలో గాని, నివృత్తిలో గాని సమభావము కలిగి ఉండుట)
- క్షమ
- మితాహారము
- నియమము అనగా ఏర్పాటు. ఇది పది రకములు
- సంతోషము
- దానము
- అస్తిక్యము (వేదోక్తమైన ధర్మమునందు విశ్వాసము)
- దానము
- ఈశ్వర పూజ
- సిద్ధాంత శ్రవణము
- హ్రీ (వేదాలలో చెప్పిన లౌకిక మార్గములందు సిగ్గు కలిగి యుండుట)
- మతి (వేద విహిత మార్గములందు శ్రద్ధ)
- జపము
- వ్రతము
- ఆసనము అనగా కూర్చునే విధానం. ఎనిమిది విధాలైన ఆసనాలున్నాయి.
- స్వస్తికము
- గోముఖము
- పద్మము
- వీరము
- సింహము
- భద్రము
- ముక్తము
- మయూరము
- ప్రాణాయామము అనగా శ్వాస విధానము మూడు రకాలు
- రేచకము
- కుంభకము
- పూరకము
- ప్రత్యాహారము అనగా ఇంద్రియాలనుండి మనసును మరల్చడం. ఐదు విధాలు
- విషయములలో సంచరించే ఇంద్రియాలను బలాత్కారముగా వెనుకకు లాగడం
- చూచిన ప్రతి వస్తువూ ఆత్మయే అనే జ్ఞానము
- నిత్య విహితమైన కర్మ ఫల త్యాగము
- విషయాలలో ఆసక్తి లేకుండా ఉండడం
- ప్రతి ఇంద్రియమునందు ఆరోహణ, అవరోహణ
- ధారణ మూడు విధాలు
- ఆత్మ యందు మనసును ధారణ చేయడం
- దహరాకాశంలో బాహ్యాకాశం ధారణ చేయడం
- పంచ భూతములందు పంచమూర్తి ధారణ
- ధ్యానము రెండు విధాలు
- సగుణము
- నిర్గుణము
- సమాధి ఒకటే స్థితి.
సాష్టాంగ నమస్కారంలో అష్టాంగాలు అనగా మన శరీరంలోని 8 అంగాలు నేలను తాకాలి. ఆ 8 అవయవాలు:
రెండు చేతులు, రెండు కాళ్ళు, రొమ్ము, నుదురు, రెండు భుజాలు
"కరయుగములు, చరణంబులు,
నురము, లలాటస్థలంబు, నున్నత భుజముల్
సరిధరణిమోపి మ్రొక్కిన
బరువడి సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్"
[మార్చు] వనరులు
- "శ్రీ కైవల్య సారధి - విష్ణు సహస్రనామ భాష్యము" - డాక్టర్ క్రోవి పార్ధ సారధి.