త్రిమూర్తులు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు
- బ్రహ్మ - సృష్టికర్త
- విష్ణువు - సృష్టి పాలకుదు
- మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
- బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.
- విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.
- శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు.
వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.
[మార్చు] విశేషాలు
- ఒక పురాణ కధ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
- ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
- హిందూమత సంప్రదాయాలగురించిన వ్యాసం
- అమెరికాలో హిందూదేవాలయాలలో సంప్రదాయాలు, విష్ణు-శివ మందిరాలు కలిపి ఉండడంపై చర్చ
- త్రిమూర్తుల గురించి
- శైవగురువు బోధినాధుని ప్రవచనాలు - శివుడు, విష్ణువు ఒకే పరమాత్ముని స్వరూపాలని
- భాగవత పురాణంలో కొన్ని అంశాలు.