Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
తెలుగు అక్షరాలు - వికీపీడియా

తెలుగు అక్షరాలు

వికీపీడియా నుండి

తెలుగు వర్ణమాల
అం అః
క్ష

తెలుగు భాషకు అక్షరములు ఏబది ఆరు. ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి రోజుల్లో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలమట్టుకి తగ్గిపోయింది.

తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

విషయ సూచిక

[మార్చు] అచ్చులు

ఇవి 16 అక్షరములు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ పేర్లు కూడా కలవు. అచ్చులు మూడు రకములు. అవి:

  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఎ, ఒ.
  • దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ఏ, ఓ.
  • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

[మార్చు] హల్లులు

ఇవి 37 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అందురు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు కలవు.

  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప.
  • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - గ, జ, డ, ద, బ.
  • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, , ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ల, ళ, వ, శ, స, హ.
  • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
    • క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • మ వర్గము - ప, ఫ, బ, భ, మ

[మార్చు] ఉభయాక్షరములు

ఇవి 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.

  • సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు కలవు. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్న ను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
    • సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
    • సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
  • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు కలవు. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
  • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

[మార్చు] ఉత్పత్తి స్థానములు

  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, ఓ, ఔ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాలవ్యములు : దౌడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - చ, జ, త, థ, ద, ధ, న, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు : నాసిక నుండి పుట్టినవి - జ్ఞ, ఞ, ణ, స, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠ్యోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

[మార్చు] ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల

  • అచ్చులు (12): అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ , ఓ , ఔ,
  • పూర్ణ బిందువు (1): అం (ఒక ఉదాహరణ)
  • నకారపొల్లు (1): క్ (ఒక ఉదాహరణ)
  • హల్లులు (31):
    • క వర్గము - క, ఖ, గ, ఘ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • మ వర్గము - ప, ఫ, బ, భ, మ
    • య, ర, ల, ళ, వ, శ, స, హ.

[మార్చు] మూలాలు

  • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
  • పరవస్తు చిన్నయసూరి, బాల వ్యాకరణము
  • చిలుకూరి పాపయ్యశాస్త్రి, ఆంధ్ర లక్షణ సారము, చిలుకూరి బ్రదర్స్, సూర్యారావు పేట, కాకినాడ, తారీఖు వెయ్యలేదు
  • రాయప్రోలు రధాంగపాణి, వ్యాకరణ పారిజాతము, జనప్రియ పబ్లికేషన్స్, గంగానమ్మ పేట, తెనాలి - 522 201
  • భద్రిరాజు కృష్ణమూర్తి, తేలిక తెలుగు వాచకం,
  • బుడ్డిగ సుబ్బరాయన్‌, సురభి పెద్ద బాలశిక్ష,ఎడ్యుకేషనల్‌ ప్రోడక్ట్స్ అఫ్ ఇండియా, 3-4-495 బర్కత్‌పురా, హైదరాబాదు - 500 027
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com