చరిత్ర
వికీపీడియా నుండి
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యనమే చరిత్ర. ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాధమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల మరియు సమాజాల యొక్క పరిశీలన మరియు అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క జ్ఞానమును కూడా పరిగణలోకి తీసుకుంటుంది.
సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గము చరిత్రను క్రోనాలజీ మరియు హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగములతో సామాజిక శాస్త్రములలో భాగముగా వర్గీకరిస్తున్నారు.