ఆగ్రా కోట
వికీపీడియా నుండి
ఆగ్రా కోట (Agra Fort), ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో కలదు. దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించారు. ఇది ప్రఖ్యాత తాజ్ మహల్ కు వాయువ్యంలో 2.5 కి.మీ. దూరాన గలదు. ఈ కోటకు 'లాల్ ఖిలా' (ఎర్రకోట కాదు) అని కూడా అంటారు.
భారతదేశం లోని ముఖ్యమైన కోటలలో ఒకటి. మొఘలులు బాబరు, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాను మరియు ఔరంగజేబు లు నివసించారు. దీనిని విదేశీ దౌత్యవేత్తలు, యాత్రికులు, ఉన్నత పదవులను అలంకరించినవారు సందర్శించారు.
[మార్చు] చరిత్ర
వాస్తవంగా దీనిని రాజపుత్రులు చౌహానులు నిర్మించారు. ఇది ఇటుకలతో నిర్మించిన కోట. అక్బర్ దీని ప్రాముఖ్యతను గుర్తించి, శిథిలమైన ఈ కోటను పునర్నిర్మించి, 1558లో ఆగ్రాను రాజధానిగా చేసుకొని, ఈకోట యందే జీవించాడు. అక్బర్ దీనిని, ఇసుక రాతితో నిర్మించాడు. అంతర్భాగం ఇటుకలతోనూ, బాహ్యభాగం ఇసుకరాతితోనూ నిర్మించాడు. దీనిని నిర్మించుటకు 1444000 మంది పనిచేశారు. 1573 లో దీని నిర్మాణం పూర్తయింది.
భారత ప్రభుత్వం ఈ కోట సంస్మణార్థం 28-11-2004 న, ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
[మార్చు] బయటి లింకులు
- Agra Fort in UNESCO List
- World Heritage Online Tour - 360 degree panoramas of fort buildings
- Centre to secure world heritage status for Red Fort - Milli Gazette article dated 16 May - 31 May 2004
- Pictures of Agra Fort Pictures of Agra Fort from a backpackers trip around India
- Agra Picture Gallery
- Agra Fort Stamp
[మార్చు] వనరులు
- http://whc.unesco.org/sites/251.htm
- http://www.aviewoncities.com/agra/fort.htm
- http://www.webindia123.com/monuments/forts/agra.htm
- Information on Agra Fort
- http://whc.unesco.org//whreview/article1.html
|
|
---|---|
· తాజ్ మహల్ · ఆగ్రా కోట · ఫతేపూర్ సిక్రీ · అజంతా గుహలు · ఛత్రపతి శివాజీ టెర్మినస్ · ఎలిఫెంటా గుహలు · ఎల్లోరా గుహలు · భింబేట్కా రాతికప్పులు · ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు · బౌద్ధ స్థూపాలు సాంచి · బౌద్ధ స్థూపాలు · సాంచి · చంపానేర్-పావగఢ్ · గోవా చర్చీలు మరియు కాన్వెంట్లు · చోళులు నిర్మించిన మహాదేవాలయాలు · మహాబలిపురం వద్ద నిర్మాణ సమూహాలు · హంపి వద్ద నిర్మాణ సమూహాలు · పట్టాడకల్ వద్ద నిర్మాణ సమూహాలు · కుతుబ్ మీనార్ · హుమాయూన్ సమాధి · ఎర్ర కోట · కాజీరంగా జాతీయవనం · మానస్ జాతీయ అభయారణ్యం · కియోలాడియో జాతీయవనం · మహాబోధి మందిరం · నందా దేవి జాతీయవనం · పుష్పాల లోయ జాతీయ వనం · కోణార్క సూర్య దేవాలయం · సుందర్ బన్ జాతీయవనం · భారత పర్వత రైల్వేలు |