See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
మహాబలిపురం - వికీపీడియా

మహాబలిపురం

వికీపీడియా నుండి

  ?మహాబలిపురం
తమిళనాడు • భారతదేశం
మహాబలిపురంలో సముద్రపు ఒడ్డున ఉన్న గుడి
మహాబలిపురంలో సముద్రపు ఒడ్డున ఉన్న గుడి
అక్షాంశరేఖాంశాలు: 12°38′N 80°10′E / 12.63, 80.17
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
• ఎత్తు

• 12 మీ (39 అడుగులు)
జిల్లా(లు) కాంచీపురం
జనాభా 12,049 (2001)
కోడులు
పిన్‌కోడు
• టెలీఫోను
• వాహనం

• 603104
• +91-44
• TN-21

అక్షాంశరేఖాంశాలు: 12°38′N 80°10′E / 12.63, 80.17 మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 20 కి.మి దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నై కి 70 కి.మి దూరం లొ ఉన్నది. మహాబలిపురం తమిళ భాషలొ మామల్లపురం (மகாபலிபுரம்)(Mamallapuram) అని పిలుస్తారు. ఈ పట్టణం లొ ఉన్న తీర వెంబడి ఉన్న దేవలయం ప్రపంచం లొ యునెస్కో వారి చేత సంరక్షించ బడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలొ ఒకటి

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

7 వ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కధనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.

[మార్చు] సందర్శనా స్థలాలు

సముద్రపు వడ్డున దేవాలయం
సముద్రపు వడ్డున దేవాలయం
రాయల గోపురం
రాయల గోపురం
పాండవుల రధాలు
పాండవుల రధాలు

నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం అయిన మామల్లాపురం లేదా మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.

మొదటివి మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం. వీటిని చూడటానికి, ఫొటోలకి రుసుము లేదు పూర్తిగా ఉచితం. రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు. ఇవి చూడటానికి , ఫొటోలకి టికట్ తీసుకోవాలి. మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది. ఇది కూడా చాలా దగ్గరే. బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.

  • బిగ్ రాక్: ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు వుంది. ఆ చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి వుంటాయి.
  • బీచ్ : మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు.

ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ భొజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.

[మార్చు] రవాణా సౌకర్యాలు

మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు వున్నాయి. అక్కడినుంచి మహాబలిపురంకు ఒక గంటన్నర రెండు గంటల్లో చేరుకోవచ్చు. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలొనే వుంటాయి. ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు. లేదా ఆటోలు దొరకుతాయి.

  • తిరుకండళ్‌మలై -[1] విష్ణు మూర్తి ని ప్రధాన దేవాలయం. పల్లవ రాజు ఈ దేవాలయాన్ని సముద్రం నుండి వచ్చే కోత నుండి శిలా సంపదని రక్షించడం కోసం విష్ణుప్రీతి కోసం నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం జరిగాక సముద్ర కోత తగ్గింది.

[మార్చు] గ్యాలరీ

[మార్చు] మూలాలు

  1. http://www.divyadesamonline.com/hindu/temples/mahabalipuram/tirukadalmalai-temple.asp

[మార్చు] బయటి లింకులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -