See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
అప్పనపల్లి - వికీపీడియా

అప్పనపల్లి

వికీపీడియా నుండి

అప్పనపల్లి భాలాజీ దేవాలయము.
అప్పనపల్లి భాలాజీ దేవాలయము.
దేవాలయ అంతర్భాగం.
దేవాలయ అంతర్భాగం.
అప్పనపల్లి వద్ద గోదావరి దృశ్యం.
అప్పనపల్లి వద్ద గోదావరి దృశ్యం.
అప్పనపల్లి  గ్రామ కూడలిలో శివాలయము
అప్పనపల్లి గ్రామ కూడలిలో శివాలయము

అప్పనపల్లి, తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము కాకినాడకు 70 కిలోమీటర్లు, రాజమండ్రికి 85 కిలోమీటర్లు మరియు అమలాపురానికి 35 కీ.మీ. దూరంలో కలదు.

ఈ గ్రామం పవిత్రమైన వైనతేయ నది ఒడ్డున కలదు. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇక్కడి స్వామిని అప్పనపల్లి బాలాజీ అని పిలుస్తారు. ఈ క్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది పొందింది. ఈ ఉరికి మూడు ప్రక్కల గోదావరి నది నాలుగవ ప్రక్క బంగాళాఖాతం కలవు. పచ్చటి వరిచేలు, విస్తారంగా కొబ్బరి తోటలు, పనస చెట్లు, కూరగాయల మడులతో ఉన్న ఈ ప్రాంతం కోనసీమలో భాగం.

విషయ సూచిక

[మార్చు] గ్రామ చరిత్ర

ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు అప్పన అనే ఋషి ద్వారా వచ్చింది. ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్ధం తపస్సు చేశాడు. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలని వల్లె వేస్తూ ఉండేవారని ప్రతీతి.

[మార్చు] వెంకటేశ్వరస్వామి దేవస్థాన చరిత్ర

ఇక్కడ రెండు వెంకటేశ్వరదేవస్థానములు కలవు. ఇక్కడి వెంకటేశ్వరస్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి గారు ఒక కొబ్బరి వర్తకుడు. ఈయన ఒక ప్రాంతములో కొబ్బరి రాశి కొని తెచ్చినపుడు శ్రీ వెంకటేశ్వరుని మూర్తిని కనుగొన్నారు. అపుడు అదే కొబ్బరి కొట్లో స్వామివారిని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టారు. క్రమంగా ఈ దేవుడు భక్తులకోరికలు తీర్చే బాలాజీగా ప్రసిద్దిచెందాడు. కొన్నాళ్ళకు కొత్తగుడి కట్టాడం జరిగింది. కాని, కొత్తగుడిలో విగ్రహప్రతిష్టాపన జరిగితే రామస్వామి గారు మరణిస్తారని ఒక సిద్దాంతి గారు చెప్పడంవల్ల చాలాకాలంపాటు విగ్రహ ప్రతిష్ట జరగలేదు.

ఇక్కడ దేవాలయములో ప్రతిష్టించబడిన ధ్వజస్ఠంభం గురించి ఒక విశేషమైన కధ కలదు. ఈ ఆలయ నిర్మాణకర్త శ్రీ మొల్లేటి రామస్వామి గారు మరియు కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్థంభం కోసం నాణమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి జరిగింది. తరువాత కొన్ని దినములకు గోదావరి నదికి వరదలు వచ్చినవి. విచిత్రముగా ధ్వజస్ఠంభం కొరకు బేరమాడిన అదేచెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ద్వజస్థంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు.

దేవస్థాన విశేషాలు

అక్కడ జరిగే పూజాదులు, సేవలు, సాంసృతిక సేవాకార్యక్రమముల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజులలో రామస్వామి గారి నిస్వార్థము వలన ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానము తీరుగా వచ్చిన వాందరకూ ఉచిత భోజనము, లోపములేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతముగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానముగా రూపుదిద్దుకొన్నది. తరువాత కొంతకాలమునకు దేవస్థాన ఆదాయము అధికముగా ఉండుటవలన ప్రభుత్వ దేవాదాయశాఖవారు దేవస్థానమును వారి ఆధీనములోకి తీసుకొన్నారు. అప్పటినుండి వారు పాత కార్యవర్గమును రద్దుచేసి కొన్ని పూర్వ కార్యక్రమములను నిలిపివేయుటతో భక్తుల రాకపోకలు గణనీయముగా తగ్గిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందముగా భక్తుల వరవడి తగ్గుట ఆదాయము మందగించుటతో ఈ మధ్యనే తిరిగి పునరుద్దరించుట మొదలెట్టినారు.

పాత దేవాలయము

ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము కలదు. అప్పన ముని తపస్సుచేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉన్నది. గోదావరిలో స్నానించి పాత దేవస్థానములో దేవుని దర్శించి పిదప కళ్యాణకట్టలో తలనెలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రదాన దేవాలయమునకు వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.

[మార్చు] ఇతర విశేషాలు

  • ప్రదాన దేవాలయము నుండి పూర్వదేవాలయము వరకూ తిరునాళ్ళు లేదా తీర్ధము ఉంటుంది.
  • అప్పనపల్లెలో బహుసుందరముగా కొత్తగా కట్టిన శివాలయము కలదు. దేవాలయము మొత్తం తెల్లగా ఉండుట దీని ప్రత్యేకత.
  • అప్పనపల్లె గోదావరి పాయ అయిన వైనతేయనదిలో అప్పనపల్లె లంక చిన్నద్వీపం కలదు. పచ్చగా నిండుగా పెరిగిన వృక్షాలతో అందముగా కనిపిస్తుంటుంది. ఇక్కడ పశువుల గ్రాసం సమృద్దిగా దొరకుటచే గ్రామస్తులు పశువులను ఇక్కడే ఉంచి ప్రతిరోజూ వెళ్ళి వస్తుంటారు. యాత్రికులకు కూడా స్నానఘట్టము నుండి తక్కువ రుసుముతో లంకకు వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చేందుకు దేవస్థానమువారు పడవలను ఉంచుతారు.

[మార్చు] గ్రామ ప్రముఖులు

  • శ్రీ వాయువేగుల వెమ్కట రామయ్య గారు.
  • శ్రీ అల్లూరి సీతారామరాజు గారు.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -