కోనసీమ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి', దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996 సంవత్సరంలో కోనసీమకు ఉధృతంగా వరదలు వచ్చాయి.[1]
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] సంస్కృతి
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంసృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిది, అభ్యాగతులను ఆధరించడం, పందుగలను, పబ్బలను సాంప్రదాయానుసారం నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు.
[మార్చు] వ్యవసాయం
కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.
- వ్యవసాయ ఎగుమతులు
కొబ్బరి, పీచు, కూరగాయలు, పూలు, పండ్లు, కోడి గుడ్లు.
[మార్చు] పరిశ్రమలు
కోళ్ళ పారమ్స్, కొబ్బరి ఉత్పత్తులు, చేతి బొమ్మల తయారీ,
[మార్చు] కోనసీమ లొని పల్లె ప్రజల మాండలికం
- రేవు - తీరం.
- గోదారి - గోదావరి నది
- లంక - దీవి
- డిబ్బ/తిప్ప - నది పరివాహకం వల్ల లంక లొ ఏర్పడిన చిన్న మైదానం
- మేట - పెద్ద డిబ్బ లేదా తిప్ప ని మేట అని పిలుస్తారు
- పేట/పాలెం - పల్లె/పట్టణం.
- కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల(మైదాన ప్రాంతం) అరిగి పోవడం
- మాండలికపు ఒక సంభాషణ.
నేను ముందే సెప్పేను(చెప్పాను). సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపే ఎల్తానంటాడు. తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.
[మార్చు] ప్రధాన నగరాలు
కోనసీమలో ఉన్న ప్రధాన పట్టణాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట
[మార్చు] రవాణా
హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు కలవు. రాజమండ్రి కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం.