కొబ్బరి
వికీపీడియా నుండి
కొబ్బరి భద్రంగా ఉన్నది
|
|||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Coconut Palm (Cocos nucifera)
|
|||||||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|||||||||||||||
కోకాస్ న్యూసిఫెరా L. |
|||||||||||||||
|
కొబ్బరి ఒక ముఖ్యమైన పామే కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera). కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉన్నది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి.
విషయ సూచిక |
[మార్చు] లక్షణాలు
- శాఖారహిత కాండంతో పెరిగే వృక్షం.
- పొడవుగా దీర్ఘవృత్తాకారంలో పొడిగించిన కొనతో ఉన్న అనేకమైన పత్రకాలు గల సరళ పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- సంయుక్త స్పాడిక్స్ పుష్పవిన్యాసాక్ష పీఠభాగంలో అమరిన ఆకుపచ్చరంగు స్త్రీ పుష్పాలు, కొనభాగంలో అమరిన మీగడరంగు పురుష పుష్పాలు.
- పీచు వంటి మధ్య ఫలకవచం ఉన్న టెంకగల ఫలాలు.
[మార్చు] ఉపయోగాలు
[మార్చు] ఆహారపదార్ధం
- కొబ్బరి కాయలోని తెల్లని గుజురు మంచి ఆహారం. దీని కోరు నుండి కొబ్బరి పాలు తీస్తారు. దీనిలో 17 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటాయి. పాలు తీయగా మిగిలిన దానిని పశువుల దానాగా వాడతారు.
- కొబ్బరి నీరు మంచి పానీయం. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బొండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవికాలంగా చల్లగా దాహం తీరుస్తాయి.
- కొబ్బరి పుష్పవిన్యాసాల చివరి భాగాన్ని కాబేజీ లాగా వంటలలో ఉపయోగిస్తారు. వీటి మూలం నుండి కల్లు తీస్తారు.
[మార్చు] ఇతరమైనవి
- కొబ్బరి పీచు తో తాళ్ళు, చాపలు, పరుపులు తయారుచేస్తారు. ఇది వంటచెరకుగా కూడా ఉపయోగిస్తారు.
- కొబ్బరి కురిడి నుండి కొబ్బరి నూనె తయారుచేస్తారు.
- కొబ్బరి ఆకులు చాపలు, బుట్టలు అల్లడానికి, పందిరి, ఇంటిపైకప్పులపైన వేస్తారు. కొబ్బరి ఈనెలను కట్టలు కట్టి చీపురుగా ఉపయోగిస్తారు.
- కొబ్బరి చెట్టు కాండం కలప గా ఇల్లు కట్టుకోవడంలో దూలాలు, స్తంభాలు క్రింద వాడతారు. ఇవి వంతెనలుగా పిల్ల కాలువల మీద ఉపయోగించవచ్చును.
[మార్చు] సంస్కృతి
- హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత కలదు. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు.
- భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి.
[మార్చు] బయటి లింకులు
- Coconut Research Center
- Coconut Research Institute of Sri Lanka
- Kokonut Pacific Developers of Direct Micro Expelling (DME) technology that enables Islanders to produce pure cold-pressed virgin coconut oil
- Coconut Time Line
- Plant Cultures: botany, history and uses of the coconut
- Purdue University crop pages: Cocos nucifera