కల్లు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కల్లు ఒక ఆల్కహాలు కలిగిన పానీయము. దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు మొదలైన పామే కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండము, దక్షిణ భారతదేశము, ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు. దీని లాంటి మరికొన్ని మత్తు పానీయాలు భంగు, సారాయి.
విషయ సూచిక |
[మార్చు] ఈత కల్లు
ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిపెడతారు. వారం రోజుల అనంతరమ్ మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది.
[మార్చు] తాటి కల్లు
తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్తలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాదారణ లిమ్కా రుచిని కలిగి ఉంటుంది. తరువాత్తరువాత మెల్లగా పులిసిపోయి, రుచి, వాసనలు మారిపోతాయి.
[మార్చు] పౌడర్ కల్లు
ఇది సర్వసాదారణంగా ఈత, తాటి చెట్లు లేని పట్టణ ప్రాంతాలలో తయారు చేస్తారు. ఒకరకమైన పౌడర్ నీటిలో కలిపి తయారు చేసే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారి. ఇటువంటి కల్లు పట్టణాల మద్య ప్రదాన రహదారులలో బాటిళ్ళలో నింపి, బల్లలపై ఉంచి అమ్మడం చూడవచ్చు.
[మార్చు] వివిద దేశాలలో కల్లు
ఫిలిప్పీన్స్ లో దీనిని 'టూబా' అని వ్యవహరిస్తారు.
[మార్చు] పేర్లు
దేశం / ప్రాంతం | వాడుక పేరు |
---|---|
కామెరూన్ | మింబో [1] |
కాంగో-కిన్షాషా | malafu, panam culloo [2] |
గబాన్ | toutou |
ఘనా | doka, nsafufuo, palm wine, yabra, akpeteshi |
భారత్ | కల్లు (கள்ளு)(കള്ള്)a, Tamil tadib, toddy |
మలేషియా | కల్లు (கள்ளு), నీర, tuak, toddy |
బర్మా | htan yay |
నైజీరియా | emu, ogogoro, palm wine, tombo liquor, Nnmaya ngwo |
పపువా న్యూగినియా | segero, tuak |
ఫిలిప్పీన్స్ | టూబా, lambanog |
దక్షిణ ఆఫ్రికా | ubusulu |
సియెర్రా లియోన్ | poyo |
శ్రీ లంక | కల్లు (கள்ளு), రా (රා) |
a Telugu, Tamil and Malayalam.
b Marathi.