వికీపీడియా నుండి
శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే జట్టునే శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lankan cricket team ) అని వ్యవహరిస్తారు. ఈ జట్టు మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 1975లో తొలి ఒకరోజు ప్రపంచకప్ పోటీలలో ఆడినది. 1981లో ఈ జట్టుకు టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా లభించింది. ఈ హోదా లభించిన జట్టులలో ఇది 8వది. 1990 దశాబ్దంలో పూర్తిగా క్రిందిస్థాయిలో ఉన్న జట్టు క్రమంగా ఉన్నత స్థానంలోకి చేరినది. 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ సాధించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ఒక స్థానాన్ని సంపాదించి అడపాదడపా విజయాలను నమోదుచేస్తూనే ఉంది. 2007 వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ లాంటి బ్యాట్స్‌మెన్లు మరియు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ లాంటి బౌలర్లు శ్రీలంకకు గత 15 సంవత్సరాలలో పలు విజయాలు అందజేశారు.
అక్టోబర్ 2007 నాటికి శ్రీలంక 170 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 29.41% విజయాలు సాధించగా, 37.05% పరాజయాలు పొందినది. 33.52% డ్రాగా ముగించింది.
[మార్చు] శ్రీలంక క్రికెట్ జట్టు చరిత్ర
1972కు పూర్వం సిలోన్ అనబడే శ్రీలంక దేశంలో 1926-27లో మొట్టమొదటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పోటీ కొలంబోలోని విక్టోరియా పార్క్‌లో నిర్వహించారు. అందులో శ్రీలంక ఇన్నింగ్స్ ఓటమిని పొందినది.[1] శ్రీలంక జట్టుకు తొలి విజయం పటియాలాలోని ధృవ్‌పాండవ్ స్టేడియంలో 1932-33లో జరిగిన మ్యాచ్‌లో దక్కినది.[2]
1981లో శ్రీలంక జట్టుకు టెస్ట్ హోదా కల్పించబడినది. ఈ హోదా పొందిన దేశాలలో ఇది ఎనిమిదవది. 1982లో ఈ జట్టు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అంతకు ముందే 1975లో జరిగిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో పాల్గొని అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడినది. 1990 దశకంలో ఈ జట్టు శక్తివంతమైన ప్రదర్శన ప్రదర్శించింది. ఇదే ఊపుతో 1996లో భారత ఉపఖండంలో జరిగిన 6వ ప్రపంచ కప్ పోటీలలో విశ్వవిజేతగా నిల్చి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపర్చింది. 2003లో దక్షిణాఫ్రికాలో నిర్వహించబడిన ప్రపంచ కప్‌లో కూడా సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగింది. 2007లో ఫైనల్ వరకు దూసుకెళ్ళింది.
[మార్చు] వివిధ టోర్నమెంట్లలో శ్రీలంక జట్టు ఆట ప్రదర్శన
వన్డే ప్రపంచ కప్ |
ఐసిసి చాంపియన్ ట్రోఫీ |
ఆసియా కప్ |
ఆస్ట్రేలేషియా కప్ |
కామన్వెల్త్ క్రీడలు |
ఐఐచి ట్రోఫీ |
|
- 1998: సెమీ ఫైన్స్
- 2000: క్వార్టర్ ఫైనల్
- 2002: భారత్‌తో కల్సి సంయుక్త విజేత
- 2004: ప్రాథమిక రౌండ్
- 2006: మెయిన్ రౌండ్
|
|
|
|
- 1979: చాంపియన్
- 1982 తరువాత: టెస్ట్ హోదా పొందినందున పాల్గొనే అర్హతలేదు
|
[మార్చు] శ్రీలంక జట్టు రికార్డులు
[మార్చు] టెస్ట్ క్రికెట్ రికార్డులు
- జట్టు అత్యధిక స్కోరు : 952/6 (భారత్ పై, 1997) (ప్రపంచ రికార్డు)
- టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ : మహేలా జయవర్థనే (7271 పరుగులు)
- అత్యధిక టెస్టులు ఆడినది : ముత్తయ్య మురళీధరన్ (118 టెస్టులు)
- అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించినది : అర్జున రణతుంగ (56 టెస్టులు, 1988 నుంచి 1999 వరకు)
- టెస్ట్ ఇన్నింగ్సులో అత్యధిక వ్యక్తిగత స్కోరు : 374 (మహేలా జయవర్థనే, దక్షిణాఫ్రికాపై, 2006లో)
- టెస్టు ఇన్నింగ్సులో అత్యధిక భాగస్వామ్య పరుగులు : 624 (మూడవ వికెట్టుకు) (కుమార సంగక్కర, మహేలా జయవర్థనే), దక్షిణాఫ్రికాపై, 2006లో (ప్రపంచ రికార్డు)
- టెస్టులలో అత్యధిక సెంచరీలు సాధించినది : మహేలా జయవర్థనే (21)
- టెస్టులలో అత్యధిక అర్థసెంచరీలు సాధించినది : అర్జున రణతుంగ (38)
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మరళీషరన్ (723+) (ప్రపంచ రికార్డు)
- ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సార్లు 5 వికెట్లు సాధించినది : ముత్తయ్య మురళిధరన్ (62) (ప్రపంచ రికార్డు)
- ఒకే టెస్టులో 10 వికెట్లను అత్యధిక సార్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (20) (ప్రపంచ రికార్డు)
- టెస్ట్ ఇన్నింగ్సులో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ : 51/9 (ముత్తయ్య మురళీధరన్, జింబాబ్వే పై, 2002)
- బౌల్డ్ ద్వారా అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (157) (ప్రపంచ రికార్డు)
- స్టంపింగ్ ద్వారా అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (41) (ప్రపంచ రికార్డు)
[మార్చు] వన్డే క్రికెట్ రికార్డులు
- అత్యధిక టీం స్కోరు : 443/9 )నెదర్లాండ్ పై, 2006) (ప్రపంచ రికార్డు)
- వన్డేలలో అత్యధిక పరుగులు చేసినది : సనత్ జయసూర్య (12,116)
- అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడినది : సనత్ జయసూర్య (403)
- అత్యధిక వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించినది : అర్జున రణతుంగ (193)
- వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు : 189 (సనత్ జయసూర్య, భారత్‌పై, 2000లో)
- అత్యధిక భాగస్వామ్య పరుగులు : 286 (తొలి వికెట్టుకు, సనత్ జయసూర్య, ఉపల్ తరంగ) (ప్రపంచ రికార్డు)
- అత్యధిక వన్డే సెంచరీలు సాధించినది : సనత్ జయసూర్య (25)
- అత్యధిక వన్డే అర్థసెంచరీలు సాధించినది : అరవింద డి సిల్వ, సనత్ జయసూర్య (64 చొప్పున)
- వన్డేలో అతివేగంగా సెంచరీ సాధించినది : సనత్ జయసూర్య (17 బంతులలో ) (ప్రపంచ రికార్డు)
- ఒకే వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ : సనత్ జయసూర్య (11)
- వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ : సనత్ జయసూర్య (242)
- వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మరళీధరన్ (455)
- వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ : 19/8 (చమిండా వాస్, జింబాబ్వే పై, 2001లో) (ప్రపంచ రికార్డు)
- ఒకే వన్డేలో 5 వికెట్లను అత్యధిక సార్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (8)
- 4 వరస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ : లసిత్ మలంగ (దక్షిణాఫ్రికాపై, 2007లో) (ప్రపంచ రికార్డు)
- ఒకే వన్డేలో 8 వికెట్లను సాధించిన ఏకైక బౌలర్ : చమిండా వాస్ (ప్రపంచ రికార్డు)
[మార్చు] శ్రీలంక టెస్ట్ క్రికెట్ కెప్టెన్లు
-
-
-
[మార్చు] శ్రీలంక వన్డే క్రికెట్ కెప్టెన్లు
-
-
-
[మార్చు] ఇవి కూడా చూడండి
1975 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు |
అనుర టెన్నెకోన్(కెప్టెన్) · అజిత్ డి సిల్వ · సోమచంద్ర డి సిల్వ · రంజిత్ ఫెర్నాండో · డేవిడ్ హేన్ · లలిత్ కలుపెరుమ · దులీప్ మెండిస్ · టోని ఒపాథా · మేవాన్ పీరిస్ · అనుర రణసింఘే · మైకెల్ టిస్సెరా · బండుల వర్ణపుర · సునీల్ వెట్టిముని |
1979 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు |
అనుర టెన్నెకోన్(కెప్టెన్) · అజిత్ డి సిల్వ · సోమచంద్ర డి సిల్వ · స్టాన్లీ డి సిల్వ · రాయ్ డయాస్ · రంజన్ గుణతిలకె · సునీల్ జయసింఘే · రంజన్ మధుగలె · దులీప్ మెండిస్ · టోని ఒపాథా · సుదాత్ పాస్కల్ · బండుల వర్ణపుర · సునీల్ వెట్టిముని |
- ↑ Ceylon v Marylebone Cricket Club in 1926/27. CricketArchive. తీసుకొన్న తేదీ: 2007-05-06.
- ↑ Patiala v Ceylon in 1932/33. CricketArchive. తీసుకొన్న తేదీ: 2007-05-06.
[మార్చు] బయటి లింకులు