See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ముస్లింల ఆచారాలు - వికీపీడియా

ముస్లింల ఆచారాలు

వికీపీడియా నుండి

ముస్లింల ఆచారాలు. ముస్లిం అనగా ఇస్లాం ను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు. ఇస్లాం సూచనలకు మూలాధారాలు: ఖురాన్, సున్నహ్, హదీసులు మరియు షరియా.

ముఖ్య గమనిక: ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు.

బొమ్మ:Milad image.jpg
కేరళ లో మీలాద్-ఉన్-నబి సందర్భంగా సమావేశం.

ఆచారాలకూ చేష్ఠలకూ మూఢవిశ్వాసాలకూ తేడాలు:

ఆచారం: ముస్లింలు పరస్పరం 'సలాము' చేసుకోవడం ఆచారం. ఈ ఆచారం ఎంతో పరిశుధ్ధమైనది. దీని ఉదాహరణ ముస్లిమేతరులుకూడా ఇస్తారు.
చేష్ఠలు: ఉదాహరణకు అరేబియాలో కొందరు అరబ్బులు ఒంటెల పందెం లో, ఒంటెలకు ఉత్సాహపరచేందుకో లేక బెదిర్చి పరుగులంకించేందుకో, ఒంటెలకు పసిపిల్లలకు కట్టేశారట. పసిబిడ్డలు చేసే అర్తనాదాలకు ఆ ఒంటెలు బెదిరి పరుగులంకించేవట. ఈ మధ్య ఈ వార్త ప్రపంచమంతా గప్పుమంది. ఆ అరబ్బులు ముస్లింలు, వారు చేసిన చేష్టలు ఇస్లాం బోధించినవికావు.
మూఢ విశ్వాసం: కొందరు మౌల్వీలు, జిన్లు తమ వశంలో వున్నాయని, వాటి ద్వారా ఏలాంటి కార్యాలైనా సిధ్ధింపజేస్తామని పామరులకు నమ్మబలికి వారివద్దనుండి డబ్బులు రాబట్టడం తరచూ చూస్తూంటాము. ముస్లింలై వుండీ అల్లాహ్ పై బలమైన విశ్వాసంలేని వారు, ఇలాంటి మూఢనమ్మకాల షికారు అవుతారు. షికారుచేయువాడు ధార్మికవిషయాలు తెలిసినవాడేనని మరువకూడదు. కానీ ఇతనికి తెలిసింది అసత్యమనేది సత్యం.

ఈ చేష్ఠలు మరియు మూఢవిశ్వాసాలనుండి ప్రజలను బయటపడవేయడానికే ఇస్లాం అవతరించింది. ఇస్లాం సదాచారాలకు పుట్టినిల్లు. ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు. అందరూ అంగీకరించే ముస్లిం ఆచారాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

భారత్ లో ఓ ముస్లిం జంట నికాహ్. వెనుక భాగాన ఓ హిందువు గంగాస్నానం ఆచరిస్తున్నాడు.
భారత్ లో ఓ ముస్లిం జంట నికాహ్. వెనుక భాగాన ఓ హిందువు గంగాస్నానం ఆచరిస్తున్నాడు.

విషయ సూచిక

[మార్చు] వివాహం

బొమ్మ:Nikah 003.jpg
ఓ ముస్లిం వధువు 'నికాహ్ నామా లో సంతకం చేస్తూ.

ఇస్లాం నికాహ్ లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది.నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం. సున్నత్.బ్రహ్మచర్యాన్నీ,వైరాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలోఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్దీకరిస్తుంది. వ్యభిచారం హరామ్ లేదా నిషిద్ధం.వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా వుండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు, ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం, దుబారా ఎక్కువ. ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ.ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలమంది మౌల్వీలు, మౌలానాలు మరియు ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు,వీళ్ళంతా నూర్ బాషా, దూదేకుల సాయిబుల్నిపెళ్ళిచేసుకోరు సరిగదా లదాఫ్,పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తి కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్టూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.

[మార్చు] నామకరణాలు

[మార్చు] సలాము చేయుట

[మార్చు] పురుషులు గడ్డాన్ని పెంచడం

[మార్చు] పురుషులు టోఫీ ధరించడం

ఇస్రాయీలు లోని ఒక యువ బెదుయీన్ ఉత్తర ఆఫ్రికా నమూనాలో ఫెజ్ ధరించాడు.
ఇస్రాయీలు లోని ఒక యువ బెదుయీన్ ఉత్తర ఆఫ్రికా నమూనాలో ఫెజ్ ధరించాడు.

ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకూ మరియు గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు టోపీ, ఫెజ్ వగైరా.

[మార్చు] స్త్రీలు హిజాబ్ ధరించడం

హిజాబ్ కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, టర్కీ; దుబాయి యు.ఎ.ఇ.; టెహరాన్  ఇరాన్; మరియు జైపూర్, రాజస్థాన్, భారతదేశం.
హిజాబ్ కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, టర్కీ; దుబాయి యు.ఎ.ఇ.; టెహరాన్ ఇరాన్; మరియు జైపూర్, రాజస్థాన్, భారతదేశం.

హిజాబ్ లేదా పరదా(అరబ్బీ : حجاب )

ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, మరియు సద్-నీతి.[1] ఈ పదము ఖురాన్ లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినది. దీనినే ఉర్దూ లో పరదా లేదా నఖాబ్, అరబ్బీ లో 'ఖిమార్' خمار.

ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. బురఖా భారతీయ, అఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడవున్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.

[మార్చు] సమాధులను సందర్శించడం

బొమ్మ:Dargah sharif.jpg
The Qawwali is the art of Singing a Song in the Praise of Islamic Personalities.
బొమ్మ:Dargah.jpg
మెజారిటీ ముస్లింలు ఔలియాల సమాధుల వద్దకు దుఆ చేయుటకు సందర్శిస్తారు.

ఇస్లాం లో సమాధులను సందర్శించడం నిషేధం కాదు. సమాధులను సందర్శించే అసలు కారణం మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. లేదనగా మానవుడు ఈ లోకంలోనే అనంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో ప్రపంచం వైపు పరుగెత్తి, అధర్మాల పాలవుతాడు. ఏనాటికైనా మనమందరమం మరణిస్తామనే ఆలోచన రేకెత్తిస్తే, అతడి జీవితం కుదుటపడి, న్యాయ ధర్మమార్గాన్ని ఆచరించుటకు ప్రయత్నిస్తాడు. మానవులు 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించినపుడు, పాప కర్మములనుండి దూరంగా వుంటూ సత్యమైన జీవితాన్ని గడుపుటకు ఉద్యుక్తుడౌతాడు. అల్లాహ్ ను గ్రహిస్తాడు. ధర్మమార్గాన వచ్చి తీరుతాడు.

సమాధుల వద్దకు, అనగా ఖబ్రస్తాన్ (ముస్లిం శ్మశాన వాటిక) వద్దకు గాని, ఔలియాల దర్గాల వద్దకు వెళ్ళినపుడు ఏమి ఆచరించవచ్చును? వేటి కొరకు నిషేధాలున్నవి?

ఆచరణీయాలు:

  • సమాధులు ప్రశాంతతకు, ఆత్మప్రరమైన శాంతికి నిలయాలు. సమాధుల వద్దకు పిల్లలూ పెద్దలూ పురుషులూ అందరూ వెళ్ళవచ్చును.
  • సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచవచ్చును.
  • సమాధులలో ఉన్నవారి మగ్ ఫిరత్ కొరకు, అల్లాహ్ తో 'దుఆ' (ప్రార్థన) చేయవచ్చును.
  • సమాధులలో ఉన్నవారి పేర్ల దాన ధర్మాలు చేయవచ్చును.
  • హదీసుల ప్రకారం సమాధులలో ఉన్నవారికొరకు ఖురాన్ పఠించవచ్చును.

నిషేధితాలు:

  • సమాధుల వద్ద సాష్టాంగ ప్రమాణాలు చేయరాదు.
  • సమాధులలో వున్న వారితో నోములు (మన్నత్ లు) నోచరాదు.
  • సమాధులలో వున్న వారితో ప్రార్థనలు చేయరాదు. కారణం అన్ని ప్రార్థనలు ఆలకించువాడు మరియు తీర్చువాడు అల్లాహ్ ఒక్కడే.
  • సమాధుల చుట్టూ 'తవాఫ్' (ప్రదక్షిణ) లు చేయరాదు.
  • సమాధుల వద్ద ఔలియాలను స్తోత్తం చేస్తూ ఎల్లవేళలా మన్ ఖబత్ లు పాడుకుంటూ వుండిపోరాదు. ఇలా చేస్తూ పోతే అసలైన ఈశ్వరుణ్ని (అల్లాహ్) ను మరచిపోతారు.
  • సమాధులే మనకు సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే గృహద్వారలు అనే వింత పోకడను విడనాడాలి.
  • తల నీలాలు సమర్పించరాదు.
  • సమాధులలో నిద్రించేవారి పేరున, ఔలియాల పేరున తావీజులు, తాయెత్తులు ధరించరాదు. కారణం ఔలియాలు ఇవన్నీ నేర్పించలేదు. ఇలాంటి మూఢ మరియు అంధవిశ్వాసాలను దూరం చేయడానికే 'ఔలియాలు' పనిచేశారు. తిరిగీ 'ఔలియా'ల పేరుతో ఈ మూఢవిశ్వాసాలను నెలకొల్పి, ఔలియాలకు చెడ్డపేరు తేకూడదు.

[మార్చు] ఆచారాల పరంగా ముస్లింలలో నేటి స్థితి

ముస్లింలు విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించరు. కాని దక్షిణ ఆసియా మరియు పర్షియన్ మరియు షియా మతం యొక్క ప్రభావాలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో క్రింది విషయాలు గోచరిస్తాయి. భారతదేశంలోని ముస్లిం సమాజాలలో వీటి ప్రవేశం ఎలా జరిగిందంటే, నవాబులు దాదాపు షియా మతానికి చెందినవారు. ఉదాహరణకు లక్నో నవాబు, అవధ్ నవాబు, బెంగాల్ నవాబు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీ వంశము, ఆసఫ్ జాహీ వంశము, టిప్పూ సుల్తాన్, ఆర్కాడు నవాబు, మదురై నవాబు, వీరందరూ షియాలే. వీరి పరిపాలనా కాలంలో చాలా దర్గాలు, ఆషూర్ ఖానాలు, ముహర్రం పీర్ల పండుగలు, (నేటికినీ లక్నో మరియు హైదరాబాదు నగరాలలో చూడవచ్చును), ఫాతెహా ఖ్వానీలు, కుండోంకే ఫాతెహా (రజబ్ నెలలో ఇమాం జాఫర్-ఎ-సాదిక్ మన్నత్ లేదా నోము), ఘడీ కే ఫాతెహా, చరాగోంకే ఫాతెహా (దీపాల మన్నత్), దర్గాల వద్ద 'షిఫా ఖానా' లు, చెరువులు గుంటలు, కొలనులలో మునగడం లాంటి విషయాలు, వెలసాయి. ఇలాంటి అంధవిశ్వాసాల నుండి మానవాళికి కాపాడడానికే ఇస్లాం అవతరించింది. కానీ నేటికినీ చాలా మంది ముస్లింలు 'అజ్ఞాన కాలం'లోనే విహరిస్తున్నారనే భావన నేటి లోకం భావిస్తున్నది. పెద్ద పెద్ద ముస్లిం సుల్తానులు ఔలియాల వద్ద నోములు నోచితే (ఉదాహరణకు అక్బర్ తనకు సంతానం లేదని సలీం చిష్తీ అనే సూఫీ ఔలియా సమాధి వద్ద మన్నత్ (నోము) చేశాడు) సాధారణ జనం అలాంటి చక్రవర్తులకు అనుకరించడంలో అతిశయోక్తిలేదు.

  • దర్గాలు
  • జెండా మానులు (జెండాలు తగిలించిన వృక్షాలు)
  • పంజాలు (మొహర్రంలో ప్రతిష్టించే పీర్లు)
  • ఔలియాల నషాన్లు (ఔలియాల పేరును తగిలించి అక్కడక్కడా ప్రతిష్ఠానాలు)

పైనుదహరించిన విషయాలు ఇస్లాం ప్రబోధించినవా కావా అనే వాటి గురించి చర్చలు జరుగుతూనే వున్నాయి. ఇవన్నీ సరైన విషయాలేనని సున్నీ బరేల్వీ జమాత్, సరైనవి కావు అని తబ్లీగీ జమాత్ పరస్పర ప్రకటనలు మరియు బోధనలు చేపడుతూనేవున్నవి. అప్పుడప్పుడూ వీరిమధ్య అడపాదడపా వాగ్వాదాలు, చిన్న చిన్న కొట్లాటలు, మరియు ఒకరికి వ్యతిరేకంగా ఒకరి దూషణలు సర్వ సాధారణం.

[మార్చు] పురుషులకు ఖత్నా చేయడం

[మార్చు] పిల్లలకు అఖీఖా చేయడం

[మార్చు] పిల్లలకు బిస్మిల్లాఖ్వానీ చేయడం

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -