See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
పి.టి.ఉష - వికీపీడియా

పి.టి.ఉష

వికీపీడియా నుండి

భారత దేశపు పరుగుల రాణి గా పేరుగాంచిన పి.టి.ఉష 1964 మే 20 న జన్మించింది. ఈమె పూర్తి పేరు పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్ ఉష (Pilavullakandi Thekkeparambil Usha). 1979 నుంచి భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express). 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, 1990 ఆసియాడ్ లో 3 రజిత, 1994 ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985 లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లలో సత్కరించింది.

విషయ సూచిక

[మార్చు] ప్రారంభ జీవితం

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీ లో జన్మించిన పి.టి.ఉష 1976 లో కేరళ రాష్ట్ర ప్రభుతం స్థాపించిన క్రీడా పాఠశలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిద్యం వహించి అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు రూ.250/-

[మార్చు] క్రీడా జీవితం

1979 లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని కోచ్ ఓ. నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982 లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. 1985 లో కువైట్ లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకమే పొందడమే కాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1984 లో అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానంలో వచ్చిననూ పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయింది. సెకనులో వందోవంతు తేడాతో కాంస్యపతకం పోందే అవకాశం జారవిడుచుకున్ననూ ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 1960 లో ప్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ కు కలిగిన దురదృష్టమే పి.టి.ఉషకు కూడా కలిగింది.

1986 లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985 లో జకార్తా లో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.

[మార్చు] సాధించిన విజయాలు

  • 1980 : మాస్కో ఒలింపిక్స్ లో పాల్గొంది. అదే సం.లో కరాచి ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 4 బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
  • 1981 : పూణే అంతర్జాతీయ మీట్ లో 2 బంగారు పతకాలను గెల్చింది. హిస్సార్ అంతర్జాతీయ మీట్ లో ఒక బంగారు పతకం సాధించింది. లూధియానా ఇంటర్నేషనల్ మీట్ లో 2 బంగారు పతకాలు సాధించింది.
  • 1982 : సియోల్ లో జరిగిన ప్రపంచ జూనియర్ మీట్ లో ఒక స్వర్ణం మరియు ఒక కాంస్య పతకం లభించింది. ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజిత పతకాలు లభించాయి.
  • 1983 : కువైట్ లో జర్గిన ఆసియా ట్రాక్ అండ్ పీల్డ్ పోటీలలో ఒక స్వర్ణం మరియు ఒక రజితం గెల్చింది. ఢిల్లీలో జర్గిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 2 స్వర్ణాలు గెల్చింది
  • 1984 : అమెరికా లోని ఇంగిల్వూడ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ మీట్ లో ఒక స్వర్ణం గెల్చింది. అదే సం.లో లాస్ ఏంజిల్స్ లో జర్గిన ఒలింపిక్స్ లో కొద్ది తేడాతో కాంస్యం చేజారింది. సింగపూర్ లో జర్గిన ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ మీట్ లో 3 స్వర్ణాలు కైవసం చేసుకుంది.
  • 1985 : చెక్ రిపబ్లిక్ లోని ఒలొమోగ్ లో జరిగిన ప్రపంచ రైల్వే మీట్ లో 2 స్వర్ణాలు, 2 రజిత పతకాలు సాధించి, ఉత్తమ రైల్వే అథ్లెట్ గా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి రైల్వే వ్యక్తి ఉష.
  • 1986 : సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు మరియు ఒక రజిత పతకం సాధించింది. మలేషియన్ ఓపెన్ అథ్లెటిక్స్ పోటీలలో ఒక స్వర్ణ పతకం సాధించింది. ఢిల్లీలో జర్గిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 2 బంగారు పతకాలు సాధించింది.
  • 1987 : సింగపూర్ లో జర్గిన ఆసియన్ ట్రాక్ అండ్ పీల్డ్ పోటీలలో 3 స్వర్ణ మరియు 2 రజిత పతకాలని కైవసం చేసుకుంది
  • 1988 : సింగపూర్ ఓపెన్ అథ్లెటిక్ మీట్ లో 3 స్వర్ణాలు సాధించింది.
  • 1989 : ఢిల్లీలో జర్గిన ఆసియన్ ట్రాక్ అండ్ పీల్డ్ పోటీలలో 4 స్వర్ణ మరియు 2 రజిత పతకాలు సాధించింది.
  • 1990 : బీజింగ్ ఆసియా క్రీడలలో 3 రజిత పతకాలు సాధించింది.
  • 1994 : హీరోషిమా ఆసియా క్రీడలలో ఒక రజిత పతకం గెల్చింది.
  • 1995 : చెన్నై లో జర్గిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్ లో ఒక కాంస్యం సాధించింది
  • 1999 : ఖాట్మండు లో జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్ లో ఒక స్వర్ణం మరియు 2 రజిత పతకాలు గెల్చింది.

[మార్చు] అవార్డులు, గౌరవాలు

  • 1984 : అర్జున అవార్డు తో సత్కారం
  • 1984 : భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదంతో సత్కరించింది
  • 1985 : జకర్తా అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పరిగణన
  • 1984, 1985, 1986, 1987 మరియు 1989 లలో ఆసియా అవార్డులో అత్తమ అథ్లెట్ గా అవార్డు
  • 1984, 1985, 1989 మరియు 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు
  • 1986 : సియోల్ ఆసియా క్రీడలలో ఉత్తమ అథ్లెట్ కు ప్రధానం చేసే అడిడాస్ గోల్డెన్ షూ అవార్డు
  • అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు
  • 1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు
  • 1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోపీ అవార్డు

[మార్చు] బయటి లింకులు

ఇతర భాషలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -