Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఆసియా క్రీడలు - వికీపీడియా

ఆసియా క్రీడలు

వికీపీడియా నుండి

ఆసియా క్రీడలు (ఆంగ్లము : Asian Games), వీటికి ఏషియాడ్ అని కూడా అంటారు. ప్రతి నాలుగేండ్లకొకసారి జరిగే ఈ క్రీడలు వివిధ క్రీడా పోటీల వేదిక. ఆసియా ఖండానికి చెందిన దేశాల క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటారు. దీని నిర్వాహక మరియు నియంత్రణా సంస్థ ఆసియా ఒలంపిక్ మండలి (Olympic Council of Asia), ఈ మండలిని నియంత్రించే సంస్థ అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (International Olympic Committee) (IOC). 1951లో ఢిల్లీలో ప్రారంభమైన ఆసియా క్రీడలలో ప్రతి క్రీడాంశంలోనూ తొలి మూడు స్థానాలకు వరుసగా బంగారు పతకం, వెండి పతకం మరియు కాంస్య పతకం పతకాలు ప్రదానం చేస్తారు.

పోటీదారులు, తమ పౌరసత్వం గల దేశ జాతీయ ఒలంపిక్ కమిటీ ద్వారా తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు. పతకాల ప్రదానోత్సవాలలో ఆయా దేశాల జాతీయగీతాలు ఆలాపించి, మరియు పతాకాలు ఎగురవేస్తారు.

15వ ఆసియా క్రీడలు కతర్ లోని దోహా లో జరిగాయి, ఇవి డిసెంబరు 1 నుండి డిసెంబరు 15 2006, వరకూ జరిగాయి. 16వ ఆసియా క్రీడలు చైనా లోని గువాంగ్జౌ లో నవంబరు 12 నుండీ నవంబరు 27 2010 వరకూ జరుగుతాయి.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] ఆసియా క్రీడల ఏర్పాటు

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ఆసియాలోని అనేక దేశాలు, బ్రిటిష్ వారి దాస్యశృంఖనాలనుండి విముక్తి పొందాయి, స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నాయి. ఈ దేశాలు తమ దేశాల మధ్య సయోద్య మరియు సత్సంబాధలకొరకు, క్రీడలు ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఆగస్టు 1948 లో లండన్ లో జరిగిన ఒలంపిక్ క్రీడలు జరిగే సమయాన, భారత ఒలంపిక్స్ కౌన్సిల్ ప్రతినిథి గురుదత్ సోంధి, ఆసియా క్రీడల గురించి తన అభిప్రాయాలను ప్రకటించాడు. ఆసియా దేశాలు, ఈ విషయాన్ని అంగీకరించి, ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్ తన అంగీకారాన్ని తెలిపింది. 1949 లో ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సమావేశమై ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి, 1951 లో ఢిల్లీ లో మొదటి ఆసియా క్రీడలు జరపాలని నిశ్చయించాయి. ఈ క్రీడలు ప్రతి నాలుగేండ్లకొకసారి జరపాలని కూడా నిశ్చయించాయి.

[మార్చు] ఫెడరేషన్ పునర్-వ్యవస్థీకరణ

1962 లో చైనా మరియు ఇస్రాయేలు లను ఈ ఫెడరేషన్ లో సభ్యత్వాన్ని నిరాకరించింది. ఇండోనేషియా, చైనా మరియు ఇస్రాయేలుల సభ్యత్వాన్ని నిరాకరించింది. 1970 లో దక్షిణ కొరియా, ఉత్తరకొరియా నుండి అపాయాల సాకుతో ఈ క్రీడలను అతిథ్యమివ్వడానికి నిరాకరించింది. 1973లో అమెరికా సన్నిహిత దేశాలు చైనా సభ్యత్వాన్ని నిరాకరించగా, అరబ్బు దేశాలు ఇస్రాయేలు సభ్యత్వాన్ని నిరాకరించాయి. 1977 లో పాకిస్తాన్ ఈ క్రీడలకు అతిథ్యమివ్వడానికి నిరాకరించింది, కారణం భారతదేశం మరియు బంగ్లాదేశ్ లతో యుద్ధాలుండడం. ఈ నిరాకరణల సందర్భాలలో ఈ క్రీడలను బాంకాక్ థాయిలాండ్ లో నిర్వహించారు.

[మార్చు] సభ్యదేశాల పెంపుదల

1994 ఆసియా క్రీడలలో, ఇతర దేశాల తిరస్కారాలున్ననూ, ఓ.సీ.ఏ., వెనుకటి సోవియట్ యూనియన్ కు చెందిన రిపబ్లిక్కులైన కజకస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమేనిస్తాన్ మరియు తజికిస్తాన్ లను సభ్యులుగా అంగీకరించింది.

2006 లో ఆస్ట్రేలియా అభ్యర్థనను, ఓ.సీ.ఏ. ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ అల్-ఫహద్ అల్-సబా తిరస్కరించాడు. దీని కారణం, ఆస్ట్రేలియా కు సభ్యత్వమిస్తే, ఓషియానియాకు చెందిన అనేక చిన్న దేశాలు నష్టపోతాయని. [1] క్రికెట్ ను 2010 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు [2].

[మార్చు] భారతదేశంలో ఆసియా క్రీడలు

1951 లో మొదటి ఆసియా క్రీడలు భారత దేశంలోని ఢిల్లీలో జరిగాయి. ఆ తరువాత మళ్ళీ 1982 లో 9వ ఆసియా క్రీడలకు వేదిక కూడా ఢిల్లీ అయింది.

[మార్చు] ఆసియా క్రీడల జాబితా

మునుపటి మరియు భవిష్యత్తులో 2014 వరకూ ఆతిథ్యమిస్తున్న దేశాలు. ఎర్రటి చుక్క, క్రీడలు జరిగే నగరాన్ని సూచిస్తుంది.
మునుపటి మరియు భవిష్యత్తులో 2014 వరకూ ఆతిథ్యమిస్తున్న దేశాలు. ఎర్రటి చుక్క, క్రీడలు జరిగే నగరాన్ని సూచిస్తుంది.
సంవత్సరం క్రీడలు ఆతిథ్యమిచ్చిన నగరం దేశము
1951 I ఢిల్లీ భారతదేశం
1954 II మనీలా ఫిలిప్పైన్స్
1958 III టోక్యో జపాన్
1962 IV జకార్తా ఇండోనేషియా
1966 V బాంకాక్ థాయిలాండ్
1970 VI 1 బాంకాక్ థాయిలాండ్
1974 VII టెహరాన్ ఇరాన్
1978 VIII 2 బాంకాక్ థాయిలాండ్
1982 IX ఢిల్లీ ఇండియా
1986 X సియోల్ దక్షిణ కొరియా
1990 XI బీజింగ్ చైనా
1994 XII హిరోషిమా జపాన్
1998 XIII బాంకాక్ థాయిలాండ్
2002 XIV బుసాన్ దక్షిణ కొరియా
2006 XV దోహా కతర్
2010 XVI గువాంగ్జో చైనా
2014 XVII ఇంచియోన్ దక్షిణ కొరియా

1 అసలు ఆతిథ్యమిచ్చినది దక్షిణ కొరియా
2 అసలు ఆతిథ్యమిచ్చినది పాకిస్తాన్

[మార్చు] క్రీడల జాబితా

క్రింద నుదహరింపబడిన క్రీడలు ఆడబడుతాయి, వాటి ప్రక్కనే అవి ప్రవేశపెట్టబడిన సంవత్సరం చూడవచ్చును.

  • విలువిద్య – 1978 నుండి
  • అథ్లెటిక్స్ – ప్రారంభం నుంచి
  • బాడ్మింటన్ – 1962 నుండి
  • బేస్ బాల్ – 1994 నుండి
  • బాస్కెట్ బాల్ – ప్రారంభం నుంచి
  • బాడీ బిల్డింగ్ – 2002 నుండి 2006
  • బౌలింగ్ – 1978, 1986 నుండి
  • బాక్సింగ్ – 1954 నుండి
  • కేనోయింగ్ – 1990 నుండి
  • చదరంగం – 2006 నుండి
  • క్యూ స్పోర్ట్స్ – 1998 నుండి
  • సైక్లింగ్ – 1951, 1958 నుండి
  • గుర్రపు స్వారీ – 1982 నుండి 1986, 1994 నుండి
  • ఫెన్సింగ్ – 1974 నుండి 1978, 1986 నుండి
  • ఫుట్ బాల్ – ప్రారంభం నుంచి
  • గోల్ఫ్ – 1982 నుండి
  • జిమ్నాస్టిక్స్ – 1974 నుండి
  • హ్యాండ్ బాల్ – 1982 నుండి
  • హాకీ – 1958 నుండి
  • జూడో – 1986 నుండి
  • కబడ్డీ – 1990 నుండి
  • కరాటే – 1994 నుండి
  • నవీన పెంటాథ్లాన్ – 1994, 2002
  • రోయింగ్ – 1982 నుండి
  • రగ్బీ – 1998 నుండి
  • సెయిలింగ్ – 1970, 1978 నుండి
  • సెపక్టక్రా – 1990 నుండి
  • షూటింగ్ – 1954 నుండి
  • సాఫ్ట్ బాల్ – 1990 నుండి
  • సాఫ్ట్ టెన్నిస్ – 1994 నుండి
  • స్క్వాష్ – 1998 నుండి
  • ఈత – ప్రారంభం నుంచి
  • టేబుల్ టెన్నిస్ – 1958 to 1966, 1974 నుండి
  • టేక్వాండో – 1986 నుండి
  • టెన్నిస్ – 1958 to 1966, 1974 నుండి
  • ట్రయాథ్లాన్ – 2006 నుండి
  • వాలీబాల్ – 1958 నుండి
  • వెయిట్ లిఫ్టింగ్ – 1951 to 1958, 1966 నుండి
  • కుస్తీ – 1954 నుండి
  • వుషూ – 1990 నుండి
  • క్రికెట్ – 2010 నుండి


[మార్చు] మూలాలు

  1. (ఆంగ్లము)ఆసియా క్రీడల్లో ఆస్ట్రేలియాకు అర్హత లభించలేదు. తీసుకొన్న తేదీ: 2008-04-26.
  2. (ఆంగ్లము)ఆసియా క్రీడల్లో క్రికెట్. తీసుకొన్న తేదీ: 2008-04-26.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com