ఇస్రాఫీల్
వికీపీడియా నుండి
ఇస్రాఫీల్ (అరబ్బీ: إسرافيل) సూర్ ధరించిన మలక్ . ఇస్లామీయ శాస్త్రాలలో ఒక దేవదూత, ఇతని పేరు ఖురాన్ లో ప్రస్తావింపబడలేదు. ముగ్గురు మలాయిక పేర్లు జిబ్రయీల్, మీకాయీల్ మరియు ఇజ్రాయీల్ (ఖురాన్ లో ఇతని పేరు 'మలకల్ మౌత్') పేర్లు ప్రస్తాయింపబడినవి.
[మార్చు] ఇస్లామీయ సంప్రదాయం
సూర్ వూదబడును, భూమ్యాకాశాలలో వున్న సర్వమున్నూ నాశనం గావింపబడును, అల్లాహ్ ను మినహాయించి. మరల సూర్ వూదబడును, అపుడు చూడండి అన్నియూ మరలా సృష్టింపబడుదురు. ఖురాన్ (39.68).
ఆదమ్ ను సృష్టించుటకు అల్లాహ్ మట్టిని తీసుకురమ్మని తన నలుగురు మలాయికాలను భూమ్మీదకి పంపిస్తాడు, ఆ నలుగురిలో ఇస్రాఫీల్ ఒకరు.
ఇస్రాఫీల్ తన సూర్ బాజావాద్యాన్ని ఎల్లవేళలా తన పెదవులకు ఆన్చి, అల్లాహ్ ఆజ్ఞకొరకు వేచి వుంటాడు. ఖయామత్ ఎపుడు వస్తుందో, దాని కొరకు ఆజ్ఞ (అల్లాహ్ నుండి) ఎప్పుడు వస్తుందో అప్పుడు తన సూర్ ను మొదటిసారి వాయిస్తాడు. అనగా భూమ్యాకాశాలు వినాశమయ్యేలా బ్రహ్మాండమైన మహాశబ్దం ఉదయిస్తుంది. సృష్టి అంతా నాశనం అవుతుంది. తన సూర్ ను రెండవసారి వాయిస్తాడు. చనిపోయినవారందరూ మరలా జీవింపబడుతారు, అంతిమతీర్పుకొరకు తీసుకుపోబడుతారు.
|
|
---|---|
ఇస్లాం · అల్లాహ్ · ముహమ్మద్ · ఖోరాన్ · మలాయిక · ప్రవక్తలు · మక్కా · మదీనా · రాషిదూన్ ఖలీఫాలు · ఖిలాఫత్ · ఖలీఫా · మస్జిద్-అల్-హరామ్ · మస్జిద్-ఎ-నబవి · బైతుల్-ముఖద్దస్ · ఇస్లామీయ స్వర్ణయుగం · ముస్లింల పవిత్ర స్థలాలు · కాబా · మస్జిద్ · హిజ్రత్ · ముస్లింల పండుగలు · ఇస్లామీయ కేలండర్ · · సున్నీ ఇస్లాం · షరియా · హదీసులు · సున్నహ్ · ఈద్గాహ్ · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్ల జాబితా · ముస్లిం పండితులు · ఇస్లామిక్ దేశాలు · ముస్లిం శాస్త్రవేత్తలు · ముస్లింల సాంప్రదాయాలు · యౌమ్-అల్-ఖియామ · కాఫిర్ · మోమిన్ · ఖిబ్లా · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా · భారతదేశంలో ఇస్లాం సూఫీ తత్వము · ఔలియాలు · సూఫీలు · |