ఆర్మూరు
వికీపీడియా నుండి
?ఆర్మూరు మండలం నిజామాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | ఆర్మూరు |
జిల్లా(లు) | నిజామాబాదు |
గ్రామాలు | 22 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
113,018 (2001) • 56008 • 57010 • 58.11 • 71.92 • 44.71 |
ఆర్మూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము.
ప్రధాన రహదారి మీదనున్న ఆర్మూరు వచ్చేపోయే వాహనాలకు సహజమైన స్టాపు. శిలామయమైన ఇక్కడి కొండలు లక్షల సంవత్సరాల సహజసిద్ధమైన రాపిడి వలన యేర్పడినవి. కొండ మీద నవనాథ సిద్దేశ్వర ఆలయము కలదు. స్థానిక ప్రజలు నవనాథులు లేదా సిద్ధులు ఈ ప్రాంతములోని సహజమైన గుహలు, కొండ చరియలలో ఇప్పటికీ నివసిస్తున్నారని నమ్ముతారు. ఇక్కడికి సమీపమున పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్న ఒక నీటిబుగ్గ యొక్క నీటికి రోగములు, వైకల్యములు నివారించే శక్తి ఉన్నదని భావిస్తారు.
సంధర్శకులు నిత్యం వస్తుంటారు. గుట్టపైన అందాలు ఆరబోసినట్లు పచ్చని ప్రకృతి, అందమైన గుహలు, గుహలో వెలసిన నవనాథ సిధ్దేశ్వర దేవాలయం మరియు గుట్ట మధ్యన విశాలమైన స్థలంలో నిర్మితమైన రామాలయం చూడముచ్చటైనది. గుట్టకు దక్షిణం వైపు రహదారి మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా వాహనాలు గుట్ట పైకి వెళ్ళవచ్చు. ఉత్తరం వైపు పట్టణం విస్తరించి ఉంది. ఉత్తరం వైపు గతంలో నిర్మించిన మెట్ల మార్గం కలదు. ఈ మెట్ల గుండ గుట్టపైకి వెళ్ళెటప్పుడు పొందె అనుభూతి మధురం. గుట్టపైన కొండల మధ్య చిన్నపాటీ చెరువు ఉంది. మెట్ల మార్గంలో అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని కొన్నేళ్ళ క్రితం వలస వచ్చిన ఓ సన్యాసి (ప్రస్తుత పూజారి) పరిరక్షిస్తున్నారు. ఆయన అమ్మ వారి కొలువును వదిలి ఇప్పటి వరకు గుట్ట దిగిరాలేదు. అక్కడి నుంది గుట్టపైకి ఎక్కే మార్గంలో హనుమాన్ మందిరం వున్నది.
భౌగోళీకంగా ఈ పట్టణం నిజామాబాదు జిల్లా ఉత్తరమున ఆదిలాబాదు సరిహద్దున ఉంది. జాతీయ రహదారి నెం.7 నుంచి సుమారు 1 కిలో మీటర్ లోపలికి కలదు. ఈ పట్టణము నిజామాబాదు నుంచి 27 కిలో మీటర్లు, హైదరాబాదు నుంచి 175 కిలో మీటర్ల దూరంలో ఉంది.
[మార్చు] గ్రామాలు
- ఆలూరు
- అందాపూర్
- అంకాపూర్
- ఆర్మూరు
- బర్దీపూర్ (నిర్జన గ్రామము)
- చేపూర్
- దేగావ్
- ఫతేపూర్
- గగ్గుపల్లి
- గొవింద్ పేట్
- ఇస్సపల్లి
- ఖానాపూర్
- కొమంపల్లి
- కోటార్మూరు
- మాచర్ల
- మగ్గిడి
- మామిడిపల్లి
- మంథని
- మెర్డేపల్లి
- పెర్కిట్
- పిప్రి
- రాంపూర్
- సురబ్రియాల్
|
|
---|---|
రెంజల్ • నవీపేట్ • నందిపేట్ • ఆర్మూరు • బాలకొండ • మోర్తాడ్ • కమ్మర్పల్లి • భీమ్గల్ • వేల్పూరు • జక్రాన్పల్లె • మాక్లూర్ • నిజామాబాదు మండలం • యెడపల్లె • బోధన్ • కోటగిరి • మద్నూరు • జుక్కల్ • బిచ్కుంద • బిర్కూర్ • వర్ని • డిచ్పల్లి • ధర్పల్లి • సిరికొండ • మాచారెడ్డి • సదాశివనగర్ • గాంధారి • బాన్స్వాడ • పిట్లం • నిజాంసాగర్ • యెల్లారెడ్డి • నాగారెడ్డిపేట • లింగంపేట • తాడ్వాయి • కామారెడ్డి • భిక్నూర్ • దోమకొండ |
|
|
---|---|
ఆలూరు · అందాపూర్ · అంకాపూర్ · ఆర్మూరు · బర్దీపూర్ (నిర్జన గ్రామము) · చేపూర్ · దేగావ్ · ఫతేపూర్ · గగ్గుపల్లి · గొవింద్ పేట్ · ఇస్సపల్లి · ఖానాపూర్ · కొమంపల్లి · కోటార్మూరు · మాచర్ల · మగ్గిడి · మామిడిపల్లి · మంథని · మెర్డేపల్లి · పెర్కిట్ · పిప్రి · రాంపూర్ · సురబ్రియాల్ |