స్టీవ్ జాబ్స్
వికీపీడియా నుండి
స్టీవ్ జాబ్స్ | |
2008 మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్ లో మ్యాక్ బుక్ ఎయిర్ పట్టుకున్న స్టీవ్ జాబ్స్ |
|
జననం | ఫిబ్రవరి 24 1955 (వయసు 53) [1] సాన్ ఫ్రాంసిస్కో, క్యాలిఫోర్నియా అమెరికా [1] |
---|---|
వృత్తి | చైర్మెన్ మరియు CEO యాపిల్ ఇంకోర్పరేటడ్[2] |
వేతనం | US$1[3][4][5] |
ఉన్న డబ్బు | ▲ US$5.7 బిలియన్లు (2007) [6] |
భార్య | లావ్రీన్ పొవెల్ (1991-ప్రస్తుతం) |
సంతానం | 4 |
స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌కు చైర్మెన్ మరియు CEO. పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్‌కు కూడా కొద్దికాలం CEOగా ఉన్నాడు. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు.
విషయ సూచిక |
[మార్చు] ప్రారంభ జీవితం
1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన కొద్ది రోజులకే పాల్ మరియు క్లారా జాబ్స్ దంపతులు దత్తత తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అయిన భారతదేశాన్ని సందర్శించడానికి అవసరమయిన డబ్బు కోసం ఒక వీడియో గేంస్ కంపెనీలో చేరాడు. కొన్నాళ్ళు అక్కడ పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత తన కాలేజ్ ఫ్రెండ్ అయిన డేనియల్‌తో (ఇతడు తర్వాత ఆపిల్ కంపెనీలో మొట్టమొదటి ఉద్యోగి అయ్యాడు) కలసి భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి అదే కంపనీలో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ తన చిరకాల మిత్రుడు అయిన స్టీవ్ వోజ్‌నైక్‌తో కలసి కంప్యూటర్ చిప్‌ల గురించి పనిచేసి కొత్త విషయాలు కనుగొన్నాడు.
[మార్చు] యాపిల్ కంప్యూటర్
1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రామే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.
ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు.
[మార్చు] NeXT
తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.
తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు.
[మార్చు] తిరిగి ఆపిల్‌కు
స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసాడు. ఆ విభాగాల్లో పనిచేస్తున్న వుద్యోగులను పనిలోనుండి తొలగించాడు. కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు.
కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది.
[మార్చు] జీతం
ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది. జాబ్స్‌కు ప్రస్తుతం ఆపిల్ కంపెనీలో 7,500,000 షేర్లు ఉన్నాయి. 2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలర్లు.
[మార్చు] పిక్సర్ మరియు డిస్నీ
1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. ఈ కంపెనీ నిర్మించే చిత్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి, పంపిణీ చేయడానికి డిస్నీ కంపెనీతో కాంట్రాక్టు యేర్పరుచుకుంది.
మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ వందల మిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి.
డిస్నీతో కాంట్రాక్టు పూర్తి అయిన తర్వాత యేర్పడిన మనస్పర్థలవల్ల పిక్సర్ ఇంకో కాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అపుడు డిస్నీకి వచ్చిన కొత్త CEO పిక్సర్‌ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేసాడు. జాబ్స్ అందుకు ఒప్పుకొన్నాడు. అప్పటినుండి డిస్నీ-పిక్సర్ కలసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసే ఆరుగురు సభ్యుల కమిటీలో జాబ్స్ ఒకడుగా ఉంటున్నాడు.
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 Smithsonian Oral and Video Histories: Steve Jobs. Smithsonian Institution (1995-04-20). తీసుకొన్న తేదీ: 2006-09-20.
- ↑ Apple - Press Info - Bios - Steve Jobs. యాపిల్ (May 2006). తీసుకొన్న తేదీ: 2006-09-20.
- ↑ "Putting Pay for Performance to the Test", న్యూ యొర్క్ టైమ్స్, 2007-04-08.
- ↑ "Apple again pays Jobs $1 salary", సీనెట్ న్యూస్.కామ్, 2006-03-13.
- ↑ "Jobs's salary remained at $1 in 2005", AppleInsider, 2006-03-14.
- ↑ "Forbes 400 Richest Americans", ఫోర్బ్స్, 2007-03-30. Retrieved on 2007-03-30.