వాల్మీకి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి మహర్షి వృత్తాంతం స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. వేదవ్యాసుడు సనత్సుజాతుడిని వాల్మీకి ముని వృత్తాంతం గురించి అడుగుతాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ. అగ్ని శర్మ తల్లిదండ్రులు కౌశికి, సుమతి. చిన్నతనంలో అగ్నిశర్మ వేదాభ్యాసం సరిగా చేయలేదు. తల్లిదండ్రులు పెద్దవారు అయ్యాక ఆ రాజ్యంలో క్షామము వచ్చింది. అందువలన అగ్నిశర్మ తిండి కోసం , దైనందిక జీవితం కోసం దారి దొంగగా మారిపోతాడు. ఒకరోజు దారి దోపిడి చేస్తుండగా సప్తఋషులు ఆ మార్గంలో వస్తారు. అప్పుడు అ సప్త మహర్షులలో ఒకరైన అత్రి మహర్షి అగ్ని శర్మని ప్రశ్నిస్తాడు. తన కుటుంబీకులు తాను చేస్తున్న పాపాన్ని భరిస్తారో లేదో కనుగొని రమ్మంటాడు. అప్పుడు అగ్ని శర్మ ఇంటికి చేరుకొని తన కుటుంబ సభ్యులను తాను చేసే కర్మలలో భాగం పంచుకొంటారా అని అడుగగా వారు పంచుకోమని చెబుతారు. విషయాన్ని వెళ్లి సప్తఋషుల కు చెప్పగా వారు అత్రి మహర్షి మోక్ష ప్రాప్తికి ధ్యానం చెయ్యమని రామ నామాన్ని తిప్పి "మరా" అని బోధించి మరా నామాన్ని జపించమని చెప్పి వెళ్లిపోతారు. చాలా కాలం తరువాత అత్రి మహర్షి ఆ మార్గంలో పయనిస్తుండగా అక్కడ ఒక చీమల పుట్ట కనిపిస్తుంది. అది చూసి అక్కడ అగ్ని శర్మ ఉన్నాడని గ్రహించి వానికి విషయాన్ని, 'వల్మీకం' అంటే పుట్ట నుండి వచ్చిన వాడు కాబటి వాల్మీకి అయ్యాడు.
[మార్చు] ఇవికూడా చూడండి
|
|
---|---|
పాత్రలు | దశరథుడు ◊ కౌసల్య ◊ ఋష్యశృంగుడు ◊ సుమిత్ర ◊ కైకేయి ◊ జనకుడు ◊ మంధర ◊ రాముడు ◊ భరతుడు ◊ లక్ష్మణుడు ◊ శత్రుఘ్నుడు ◊ సీత ◊ ఊర్మిళ ◊ మాండవి ◊ శ్రుతకీర్తి ◊ విశ్వామిత్రుడు ◊ అహల్య ◊ జటాయువు ◊ సంపాతి ◊ హనుమంతుడు ◊ సుగ్రీవుడు ◊ వాలి ◊ అంగదుడు ◊ జాంబవంతుడు ◊ విభీషణుడు ◊ తాటక ◊ శూర్పణఖ ◊ మారీచుడు ◊ సుబాహుడు ◊ ఖర ◊ రావణుడు ◊ కుంభకర్ణుడు ◊ మండోదరి ◊ మాయాసురుడు ◊ ఇంద్రజిత్తు ◊ ప్రహస్తుడు ◊ అక్షయకుమారుడు ◊ అతికాయుడు ◊ లవుడు ◊ కుశుడు ◊ వానరులు |
కాండములు | బాలకాండ ◊ అయోధ్యకాండ ◊ అరణ్యకాండ ◊ కిష్కింధకాండ ◊ సుందరకాండ ◊యుద్ధకాండ ◊ ఉత్తరకాండ |
ఇతర విషయాలు | అయోధ్య ◊ మిథిల ◊ లంక ◊ సరయు ◊ త్రేతాయుగం ◊ రఘువంశం ◊ లక్ష్మణ రేఖ ◊ ఆదిత్య హృదయం ◊ ఓషధీపర్వతం ◊ సుందరకాండము ◊ వేదవతి ◊ వానరులు |