ప్రపంచీకరణ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
గ్లోబలైజేషన్ అనే ఆంగ్ల పదాన్ని తెలుగులో ప్రపంచీకరణ అంటున్నాం. కొందరు వేళాకోళంగా గోళీకరణ అన్నారు. ఇది ఒక క్రియా నామవాచకం. ఒక క్రియ జరగడం సూచిస్తుంది. ఏదో ఒకటి ప్రపంచమంతటికీ చెందటమనేదే ఆ క్రియ.
వర్తమాన కాలంలో వర్తక వ్యాపారాలు ప్రపంచీకరణ చెందుతున్నాయి. అంటే ఏ దేశపౌరులైనా ఏదేశంలోనైనా సరుకులు ఉత్పత్తి చేసుకోవచ్చు. అందుకు కావలసిన శ్రమను ఏదేశం నుంచైనా కొనుగోలు చేసుకోవచ్చు. కావలసిన పెట్టుబడిని ఏ దేశపౌరులనుంచైనా సేకరించుకోవచ్చు. ఏ దేశపు ద్రవ్య నిలువలనైనా వినియోగించుకోవచ్చు. ఆ సరుకులని ఏ దేశంలోనైనా అమ్ముకోవచ్చు. ఈ రకమైన ఏర్పాటుకి వివిధ దేశాల ప్రభుత్వాలు ఒడంబడుతున్నాయి. ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనినే ప్రపంచీకరణ అంటున్నాం.
[మార్చు] పరిణామాలు
వివిధ దేశాల పౌరులు ఈ ఏర్పాటు వల్ల తమ దేశాలలో అనేక మార్పులు గమనిస్తున్నారు. తమ జీవితాలలో లోగడ ఉన్నవెన్నో పోగొట్టుకుంటున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తిరగబడుతున్న కొందరి ప్రాణాలని వారి ప్రభుత్వాలే తీస్తున్నాయి. అందరికీ కావలసిన కూడూ, గూడూ, విద్య, వైద్యం వంటివి అంతకుముందుతో పోలిస్తే ప్రపంచీకరణ తరవాత ఇటీవల దేశపౌరులకి అధిక పరిమాణంలో అందుతున్నాయని స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. అలా అందని దేశాలలో పరిస్థితికి కారణం ఆ దేశ ప్రభుత్వాలు ప్రపంచీకరణలో వెనకబడటమే అంటున్నారు. ఇలా కొందరు వివరిస్తుంటే ఈ ప్రపంచీకరణ పరిణామాల గురించి అనేక భయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడుపుతున్నారు.