పులిచింతల ప్రాజెక్టు
వికీపీడియా నుండి
కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మింప తలపెట్టిన సేద్యపు నీటి ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు / కె.ఎల్.రావు సాగర్ ప్రాజెక్టు (Pulichintala project / K L Rao Sagar Project). విజయవాడ వద్దగల ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపున గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపున నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉన్నది. కృష్ణా డెల్టాను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఆనకట్ట 1964లో ప్రతిపాదించబడినా, దీని గురించి ఆలోచించింది 1984 తరువాతనే.
విషయ సూచిక |
[మార్చు] ఆనకట్ట ఆవశ్యకత
కృష్ణా నదిపై ప్రాజెక్టులు |
ప్రకాశం బారేజి |
నాగార్జునసాగర్ |
శ్రీశైలం |
తెలుగుగంగ |
ఎ.మాధవరెడ్డి ప్రాజెక్టు |
శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ |
పులిచింతల |
ప్రియదర్శిని జూరాల |
పోతిరెడ్డిపాడు |
ట్రిబ్యునళ్ళు |
బచావత్ ట్రిబ్యునల్ |
కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పెద్ద ఆనకట్టలలో నాగర్జునసాగర్ ఒకటి. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ద్వారా దాదాపు 35.14 లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యం కావాల్సి ఉంది. ఇందులో కృష్ణా డెల్టా కు చెందిన 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఉంది.
కృష్ణా డెల్టాకు సాగునీరు విజయవాడ వద్దగల ప్రకాశం బారేజి ద్వారా సరఫరా అవుతుంది. ఇక్కడ నది మట్టం సముద్రమట్టానికి 50 అడుగులు ఉంటుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7,36,000 ఎకరాలకు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5,72,000 ఎకరాలకు బారేజి నుండి సాగునీరు సరఫరా అవుతుంది. అయితే బారేజి నీటి నిల్వ సామర్ధ్యం అతి స్వల్పం (3 టి.ఎం.సి) కాబట్టి, వచ్చిన నీరు వచ్చినట్లే కాలువలలోకి వదలాలి, లేదా సముద్రం లోకి వదిలెయ్యాలి. అందుచేత డెల్టాకు అవసరమైన సాగునీటి నిల్వ నాగార్జున సాగర్ లోనే చెయ్యడం తప్పనిసరి.
అయితే, కర్ణాటకలో ఆలమట్టి ఆనకట్ట కట్టడం వలనా, 2003, 2004లలో కలిగిన వర్షాభావ పరిస్థితుల వలనా కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నాగార్జున సాగర్ అట్టడుగు నీటి మట్టానికి పడిపోయింది. అయితే నాగార్జున సాగర్కు, ప్రకాశం బారేజికి మధ్య ఉన్న పరీవాహక ప్రాంతం నుండి నదిలోకి వచ్చే నీటిని నిలవజేసేందుకు జలాశయం లేదు. ఈ ప్రాంతంలోనే మున్నేరు, మూసి, పాలేరు నదులు వచ్చి కృష్ణలో కలుస్తాయి. బారేజిలో నిల్వ సామర్ధ్యం లేకపోవడం చేత, ఈ నీరు సముద్రం లోకి వదలక తప్పని పరిస్థితి ఉంది. ఈ నీరు 140 టి.ఎం.సి.లు ఉంటుందని అంచనా. ఇందులో 60 టి.ఎం.సి.లు వాడుకోగలిగే వీలు ఉంది. ఈ నీటిని నిల్వ చేసుకునేలా ఒక ఆనకట్టను, జలాశయాన్ని నిర్మించగలిగితే, డెల్టా ఆయకట్టు స్థిరపడటమే కాక, శ్రీశైలం, సాగర్ ల వద్ద నుండి మరింత నీటిని ఇతర ప్రాంతాలకు మళ్ళీంచగలిగే వీలు కలుగుతుంది.
[మార్చు] పులిచింతల పూర్తయితే
1. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో తయారయ్యే సిమెంటును గుంటూరు జిల్లాకు బ్యారేజీపై నిర్మించే బ్రిడ్జి మీదుగా రవాణా చేసే అవకాశం ఏర్పడుతుంది. 2. గుంటూరు జిల్లా నుంచి ఈబ్రిడ్జి మీదుగా హైదరాబాదు వెళ్ళేందుకు సులభతరమవుతంది. తద్వారా కొన్ని ప్రాంతాల నుంచి హైదరాబాదుకు ప్రయాణదూరం తగ్గనుంది. 3.కృష్ణా జిల్లాలోని ముత్యాల, గుంటూరు జిల్లాలోని అచ్ఛంపేటలకు మధ్య మార్గం ఏర్పడుతుండటంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు దగ్గరకానున్నాయి. 4. రాయలసీమ నుంచి ప్రకాశం బ్యారేజి ద్వారా హైదరాబాదు, తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు ఇకనుంచి సత్టెనపల్లి, అచ్ఛంపే ట మీదుగా జగ్గయ్యపేట ద్వారా హైదరాబాద్ వెళ్ళేందుకు మరింత మెరుగైన అవకాశం ఏర్పడుతుంది.
[మార్చు] ప్రాజెక్టు గణాంకాలు
ఆనకట్ట కట్టినపుడు ఏర్పడే జలాశయ పూర్తి సామర్ధ్యం 53.34 టి.ఎం.సి.లు కాగా ఇందులో - ఉపయోగపడని కనీస నిల్వ (డెడ్ స్టోరేజి) పోగా, 45.54 టి.ఎం.సి.ల నీరు వినియోగంలోకి వస్తుంది. జలాశయంలో 15 గ్రామాలు పూర్తిగాను, 8 గ్రామాలు పాక్షికంగాను మునిగిపోతాయి. మొత్తం 29,760 ఎకరాలు మునుగుతాయి. ఇందులో 9291 ఎకరాలు అడవి కాగా మిగతాది ప్రజల స్వంత ఆస్తులు.
[మార్చు] మునిగిపోయే గ్రామాలు
- నల్గొండ జిల్లా: నెమలిపురి, వెల్లటూరు, రేపల్లె, అడ్డూరు, చింట్యాల
- గుంటూరు జిల్లా: పులిచింతల, కొల్లూరు, చిట్యాల, కేతవరం, తాడుట్ల, గోవిందాపురం, వెల్లంపల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. బోదనం, గోపాలపురం, కామేపల్లి, వేమవరం, రేగులగడ్డ పాక్షికంగా మునిగిపోతాయి.
[మార్చు] చరిత్ర
1964లో శాసనసభ కమిటీ ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే 1988 వరకు అది చర్చలకే పరిమితమైంది. 1988 నవంబర్ 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసాడు. ఆనాటి అంచనా రూ 269 కోట్లు. శంకుస్థాపన అయినప్పటికీ, పని మొదలు కాలేదు. తిరిగి 2004 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరోసారి శంకుస్థాపన చేసాడు.
సంఘటనలు
- 2002 డిసెంబర్ 21: పూర్వ ముఖ్యమంత్రి, రామారావు 1988లో వేసిన శంకుస్థాపన ఫలకాన్ని పీపుల్స్ వార్ నక్సలైట్లు పేల్చివేసారు.
- 2002 ఫిబ్రవరి 9: పులిచింతల ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాని స్పష్టం చేయాలని తెరాస నేత కె.సి.ఆర్కోరాడు.
- 2004 సెప్టెంబర్ 30: ప్రాజెక్టు నిర్మాణం విషయమై ఎస్.ఇ. బాపూజీ, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. నల్గొండ జిల్లా వజినేపల్లి వద్ద అక్టోబర్ 15 న పని మొదలు పెడతామని కంపెనీ చెప్పింది. చైనా ప్రభుత్వ కంపెనీ అయిన చైనా రైల్వే 18 బ్యూరో గ్రూప్ తో కలిసి ప్రాజెక్టు నిర్మాణం చేపదుతున్నామని కంపెనీ తెలిపింది.
- 2004 నవంబర్ 17: పర్యావరణ అనుమతులు ఇంకా పొందనందున ప్రాజెక్టు పనులు ఆపివేయాలని కోర్టు స్టే ఇచ్చింది.
- 2005 ఏప్రిల్ 24: పులిచింతల పని త్వరలో మొదలవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
- 2005 ఏప్రిల్ 29: ప్రాజెక్టు వలన పలనాడు ప్రాంతానికి ఏమాత్రం ఉపయోగం లేకపోగా, అక్కడి గ్రామాలు మునిగిపోతున్నాయని, అంచేత ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అఖిల భారత ప్రజా సంఘర్షణ వేదిక రాష్ట్ర కమిటీ సభుడు కె.రవిచంద్ర పిలుపునిచ్చాడు.
- 2005 జూన్ 9: ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి వచ్చింది. ఓ వారంలో పనులు మొదలు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
- 2005 జూలై 8: తమ భూములకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కోరుతూ, రైతులు పులిచింతల ప్రాక్జెక్టు స్థలం వద్ద సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు.
- 2005 జూలై 25: పులిచింతల ప్రాజెక్టు స్థలం మార్చము అని, పని యథావిధిగా కొనసాగుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నాడు.
- 2006 ఫిబ్రవరి 21: పులిచింతల ప్రాజెక్టుకు కె.ఎల్.రావు సాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
[మార్చు] వివాదాలు
పులిచింతలకు వ్యతిరేకంగా కింది వాదనలు ఉన్నాయి.
- జలాశయంలో మునిగిపోతున్న గ్రామాల ప్రజల పునరావాసానికి సంబంధించిన వాదన.
- అసలు సేద్యపు నీటి సరఫరా లేనేలేని తెలంగాణా లోని ప్రాంతాల్లో ప్రాజెక్టులను నిర్మించేవరకు పులిచింతలకు ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం లేదనేది రెండో వాదన.
- ఆ ప్రాంతంలోని సున్నపురాయి గనులు జలాశయంలో మునిగిపోతాయన్న మూడో వాదన కూడా ఉంది.
[మార్చు] మూలాలు, వనరులు
ప్రజాశక్తి వారు ప్రచురించిన ఇ-పొత్తం