కె.ప్రత్యగాత్మ
వికీపీడియా నుండి
కోటయ్య ప్రత్యగాత్మ తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. ఈయన సినిమా రంగములో ప్రవేశించక మునుపు 1952లో ప్రజాశక్తి లో పాత్రికేయునిగా, జ్వాలా పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ప్రత్యగాత్మ దర్శకునిగా తొలి సినిమా 1961లో విడుదలైన భార్యాభర్తలు. ఈయన తెలుగులో 21 సినిమాలు మరియు హిందీలో 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన ఆత్మా బ్యానర్ క్రింద చిలకా గోరింక మరియు మా వదిన చిత్రాలను స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించాడు.
ఈయన 2001, జూన్ 8న హైదరాబాదులో కన్నుమూశాడు. ప్రత్యగాత్మ, తెలుగు సినీ రంగములో రెబెల్‌స్టార్ గా పేరుతెచ్చుకున్న కృష్ణంరాజును 1966లో విడుదలైన చిలకా గోరింక సినిమాతో పరిచయము చేశాడు.
విషయ సూచిక |
[మార్చు] పురస్కారాలు
ఈయన 1962లో భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రముగా రజత కమలాన్ని అందుకున్నాడు.
[మార్చు] చిత్ర సమాహారం
[మార్చు] తెలుగు సినిమాలు
- భార్యాభర్తలు (1961)
- కులగోత్రాలు (1962)
- పునర్జన్మ (1963)
- మంచి మనిషి (1964)
- మనుషులు మమతలు (1965)
- చిలకా గోరింక (1966)
- మా వదిన (1967)
- ఆదర్శ కుటుంబం (1969)
- అమ్మకోసం (1970)
- మనసు మాంగల్యం (1970)
- శ్రీమంతుడు (1971)
- స్త్రీ (1973)
- పల్లెటూరి బావ (1973)
- దీక్ష (1974)
- ముగ్గురమ్మాయిలు (1974)
- అల్లుడొచ్చాడు (1976)
- అత్తవారిల్లు (1976)
- గడుసు అమ్మాయి (1977)
- కన్నవారి ఇల్లు (1978)
- మంచి మనసు (1978)
- కమలమ్మ కమతం (1979)
- నాయకుడు – వినాయకుడు (1980)
[మార్చు] హిందీ సినిమాలు
ఈయన హిందిలో కె.పి.ఆత్మ పేరుతో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు
- దో లడ్కియా (1976)
- మెహమాన్ (1973)
- ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ (1971)
- బచ్పన్ (1970)
- తమన్నా (1969)
- రాజా ఔర్ రంక్ (1968)
- ఛోటాభాయి (1966)
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోటయ్య ప్రత్యగాత్మ పేజీ