ప్రజాశక్తి
వికీపీడియా నుండి
ప్రజాశక్తి హైదరాబాదులోని ప్రజాశక్తి సాహితీ సంస్థచే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ప్రజాశక్తి స్వాతంత్ర్యోద్యమ కాలములో 1942లో ఆవిర్భవించింది. 1945 నుండి ఈ పత్రిక ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేదించబడినది. 1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి విజయవాడ కేంద్రముగా తొలి సంచిక వెలువడినది. 2005 సెప్టెంబర్ వరకు 8 సంచికలకు ఎదిగినది.