ముచ్చివోలు
వికీపీడియా నుండి
ముచ్చివోలు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలానికి చెందిన అతి పెద్ద పంచాయితీలలో ఒకటి. శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుంచి ఆం.ప్ర.రా.రో.ర.సం బస్సులలో సుమారు 30 నిమిషాలలో ఈ గ్రామానికి చేరుకొనవచ్చును. ఈ ఊరికి దగ్గరే ఉన్న రైల్వే స్టేషన్ అక్కుర్తి. అయితే ఇక్కడ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. రైలులో దూర ప్రయాణం చేయాలంటే శ్రీకాళహస్తికి వెళ్ళాలి.
జనాభా వివరాలు
గ్రామ జనాభా సుమారుగా 8 నుంచి 10 వేలు. ఇండ్ల సంఖ్య 800 నుంచి 1000. బలిజ కులస్తులు అత్యధిక సంఖ్యలో ఉండగా ఇతర కులాలైన వెలమ, కాపు, గొల్ల చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.
జీవనాధారం మరియు వృత్తులు
ఎక్కువ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. రైతులు వరి మరియు వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. ఆవులు, బర్రెల పెంపకం ద్వారా పాలు అమ్మి గ్రామస్తులు చెప్పుకోదగిన ఆదాయాన్ని గడిస్తుంటారు. ప్రాచీన గ్రామీణ వ్యవస్థ లాగే ఇక్కడ రజకులు, మంగలి వారు, కుమ్మరులు, వడ్రంగులు మొదలైన అన్ని రకాల వృత్తుల వారు నివసిస్తుంటారు.
విద్య
గ్రామము నందు ఒక ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత విద్యా పాఠశాల కలవు. ప్రక్క గ్రామాలైన మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికే వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. కళాశాల చదువుకు మాత్రం ఎవరైనా ప్రక్కనే ఉన్న శ్రీకాళహస్తికి వెళ్ళాల్సిందే.అక్షరాస్యాతా శాతం 75%. ఇక్కడి నుంచి చాలామంది ఇంజనీర్లుగా (ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో ఐ.టి) బెంగుళూరు, మరియు అమెరికాలలో పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఊరి ప్రజలకు ఇది గర్వకారణం.
[మార్చు] ఆలయాలు
గ్రామంలో నాలుగు దేవాలయాలు ఉన్నాయి.
- శ్రీ పాండురంగ స్వామి దేవాలయం
- శ్రీ రామాలయం
- శ్రీ వినాయక దేవాలయం
- శ్రీ వేమాలమ్మ దేవాలయం
ప్రతి యేటా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పాండురంగ స్వామి భక్తబృందం దీని నిర్వహణా భాద్యతలు చేపడుతుంది. ఈ భక్త బృందం లోని సభ్యులందరూ తప్పనిసరిగా ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ పండరి భజన లో పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామాలనించి కూడా ప్రజలు వచ్చి ఈ ఉత్సవాలను తిలకించడం విశేషం. ఇంకా ప్రతి యేటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వేమాలమ్మ తిరునాళ్ళు, నాగుల చవితి నాడు నాగులమ్మకు పూజలు నిర్వహిస్తారు.
గ్రామ చరిత్ర
గ్రామానికి ప్రధాన గ్రామదేవత బైకమ్మ. ప్రతి యేటా వూరి చెరువుగట్టుపై ప్రతిష్టించబడిన ఈ దేవతకు భక్తి శ్రద్ధలతో సంతర్పణ జరుపుతారు. ఈ వేడుకలలో చిన్నా పెద్దా తేడాలేకుండా గ్రామస్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ దేవత గురించి ఒక ఉదాత్త మైన గాథ ఒకటి ఉంది. ఒకానొక కాలంలో ఈ ఊరి చెరువుకు చిన్న గండి పడి, క్రమేపీ పెద్దదవసాగింది. అది పెద్దదైతే ఊరంతా జలమయం కావడం ఖాయం. పంటలు పండక ఊరి జనం అంతా ఒక సంవత్సరం పాటు పస్తులు ఉండాల్సి వస్తుంది. గ్రామస్థులు తమ శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ గండి మూతపడలేదు. అప్పుడు గ్రామంలోని విజ్ఞుడొకడు ఎవరైనా గంగమ్మ తల్లికి ఆత్మార్పణ కావించుకొంటే శాంతిస్తుందేమోనని సలహా ఇచ్చాడు. ఊరి క్షేమాన్ని పరమావధిగా భావించిన బైకమ్మ ఆ గండికి అడ్డంగా నిలబడి పూడ్చివేయమని కోరింది. గండి మూతపడి పోయింది. అప్పటినుంచీ ప్రజలు ఆమె తమ గ్రామాన్ని కాపాడడానికి వచ్చిన దేవతగా భావించి పూజలు చేస్తుంటారు.
ఇరుగు-పొరుగు గ్రామాలు
మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి, వేలవేడు, మాదమాల, అక్కుర్తి.
|
|
---|---|
కొత్తపల్లె చింతల · మన్నవరం · ఇనగలూరు (శ్రీకాళహస్తి) · గొవిందరావుపల్లె · వాంపల్లె · పోలి · భీమవరం · ఎంపేడు · అమ్మచెరువు · పాతగుంట · మంగళగుంట · వేలంపాడు · కలవగుంట · యర్లపూడి · మేలచూరు · పాపనపల్లె · బ్రాహ్మణపల్లె · గొల్లపల్లె వెంకటాపురం · బహదూర్ వెంకటాపురం · కొత్తూరు చెల్లమాంబపురం · రామానుజపల్లె · కుంతిపూడి · వాగవీడు · వెంగళంపల్లె ఎండ్రపల్లె · మడమల · వేలవీడు · రెడ్డిపల్లె · ఓబులయ్యపల్లె · ముద్దుమూడి · మంగళపురి · ముచ్చివోలు · ఎర్రగుడిపాడు · బోడవారిపల్లె · ఉడమలపాడు · అక్కుర్తి · పెనుబాక · కమ్మకొత్తూరు · చెరుకులపాడు · నారాయణపురం · గుంటకిందపల్లె · మద్దిలేడు · ఉరందూరు · పనగల్లు (గ్రామీణ) · అరవకొత్తూరు · అప్పలయ్యగుంట · చుక్కలనిడిగల్లు · అమ్మపాలెం · పుల్లారెడ్డి ఖండ్రిగ · తొండమనాడు · దిగువవీధి · ఎగువవీధి · చెర్లోపల్లె · కాపుగున్నేరి · మర్రిమాకులచేను ఖండ్రిగ · రాచగున్నెరి · చల్లపాలెం · బొక్కసంపాలెం · సుబ్బనాయుడు ఖండ్రిగ · రామలింగాపురం · వేడాం · రామాపురం |