పలాస
వికీపీడియా నుండి
?పలాస మండలం శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పలాస |
జిల్లా(లు) | శ్రీకాకుళం |
గ్రామాలు | 49 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
87,850 (2001) • 42978 • 44872 • 64.97 • 77.27 • 53.31 |
అక్షాంశరేఖాంశాలు:
పలాస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
[మార్చు] మండలంలోని పట్టణాలు
- పలాస-కాశీబుగ్గ
[మార్చు] పలాస-కాశీబుగ్గ పట్టణము (మున్సిపాలిటీ)
ఈ పలాస పది సంవత్సరముల కిందట ఒక పెద్ద గ్రామము. జీడి పరిశ్రమ ఇక్కడ బాగా వృద్దిచెంది, జనాభా పెరగడమువలన పట్న వాతావరణము నెలకొని ఉంటుంది. 1995 వరకూ ఇది గ్రామ పంచాయతీగా పరిగణించబడేది. తరువాత దీన్ని 1996 నవంబరు 22 న నగరపంచాయతీగా ఏర్పాటు చేసారు. ఆదాయ వనరులు పెరగడం వలన, జనాభా పెరుగుదలను దృష్ఠిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో మున్సిపాలిటీ గా ఏర్పాటు చేసారు. అప్పట్లో 21 వార్డులుండేవి. ఇప్పుడు 25 వార్డులు అయ్యాయి.
2007 నవంబర్ నాటికి: టెక్కలి నియోజకవర్గములో 14 వార్డులు, సోంపేట నియోజకవర్గములో 11 వార్డులు ఉన్నాయి.
- ప్రధాన పరిశ్రమ: జీడి పరిశ్రమ సుమారు. 160 ప్రోసెసింగు కేంద్రాలు ఉన్నాయి. సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తోంది.
- జనాభా: 59,899 (2001 జనగణన ప్రకారం 49,899)
- వార్డులు: 25
- పోలింగు బూతులు: 38
- వోటర్లు: 33,277
- పురుషులు: 16229
- స్రీలు: 17.048 .
మొత్తము వార్డులు | కాంగ్రెస్ గెలిసినవి | తెదేపా గెలిచినవి | స్వతంత్రులు |
25 | 14 | 7 | 4 |
చైర్మన్ పదవి కాంగ్రెస్ కే వచ్చింది. అధ్యక్షపదవి - స్త్రీ జనరల్ కేటగిరీ అయినందున "కోట్నిలక్ష్మి" చైర్పర్సన్ అయ్యారు.
సంవత్సరము | అధ్యక్షులు | పార్టీ | కేటగిరీ | ఉపాధ్యక్షులు | పార్టీ | కేటగిరీ |
2002 | వజ్జబాబూరావు | కాంగ్రెస్ | బూరకాళింగ (బి.సి) | కోట్నిదుర్గాప్రసద్ | కాంగ్రెస్ | వైశ్య (ఎఫ్.సి) |
2007 | కోట్నిలక్ష్మి | కాంగ్రెస్ | వైశ్య (ఎఫ్.సి) | ఆర్.శాంతకుమారి | కాంగ్రెస్ | బెహరా (బి.సి) |
[మార్చు] డేకురు కొండ యాత్ర
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల సమీపములోని డేకురుకొండ యాత్ర ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన జరుగుతుంది. పిల్లలు లేనివారు కొండపైనుంది జారితే పిల్లలు పుడతారని ఇక్కడ ప్రజల నమ్మకము. ఈ విదంగా పలువురు జారుతూ ఉంటారు. ఈ కొండపై ఈశ్వరాలయము, సంతోషిమాత, నాగదేవత ఆలయాలు ఉన్నాయి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] మూలాలు
- అర్.డి.ఓ - ఆఫీసు, టెక్కలి.
- వార్త వార్తాపత్రిక, శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా మండలాలు
వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట