See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
తక్కెళ్ళపాడు - వికీపీడియా

తక్కెళ్ళపాడు

వికీపీడియా నుండి

తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలానికి చెందిన గ్రామము.

గుంటూరుకు 5 కి.మీ. దూరంలో 5వ నెంబరు జాతీయ రహదారి (NH-5)లో ఈ గ్రామం ఉంది. ప్రస్తుత జనాభా షుమారు 10,000. కాని ఊరు అంతగా అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చును. ఊరికి ఒక ప్రక్క ప్రకృతి ఉద్యానవనం (ఎన్.టి.ఆర్. మానస సరోవర్) ఉన్నది. మరో ప్రక్క ఒక దంతవైద్య కళాశాల, ఒక I.T.I ఉన్నాయి. ఊరిలొ ఒక హైస్కూలు కూదా ఉన్నది. రోడ్లపైన వెళ్ళే పశువుల మంద, గుళ్ళోంచి వినిపించే భక్తి పాటలు, కూడలిలో జనం - ఇది క్లుప్తంగా ఊరి ముఖచిత్రం.

2 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఈ గ్రామానికి 500 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. చెరువు ఒడ్డున ఉన్న శివాలయం 150 సంత్సరాలు పురాతనమైనది. ప్రతి సంవత్సరం ఆర్ద్రా నక్షత్రంలో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఆర్ద్రోత్సవాలు చేస్తారు. ఈ ఉత్సవాలను అప్పటి గ్రామ కరణం శ్రీ కాట్రపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు ప్రారంభించారు. ఇప్పటికి 60 పైచిలుకు "ఆర్ద్రోత్సవాలు" వైభవంగా జరిగాయి. శివాలయానికి దగ్గరలో రామాలయం ఉంది. గ్రామ ప్రముఖులు కాసరనేని సదాశివరావు గారిపేరు మీద "డాక్టర్ కాసరనేని సదాశివరావు కళా పరిషత్" పేరుతో ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో తెలుగు నాటికల పోటీలు జరుగుతాయి.

వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి. కృష్ణానది నీరు వ్యవసాయానికి ముఖ్యమైన వనరు. పుగాకు, వరి, ప్రత్తి- ఇవి ముఖ్యమైన పంటలు ఈ వూరికి తూర్పు వైపున ఉప్పలపాడు, దక్షిణం వైపున గారపాడు (రామచంద్రపాలెం) ఉత్తరం వైపున పెదకాకాని గ్రామాలు, పడమర వైపున గుంటూరు నగరం ఉన్నవి.

ఈ వూరిలో దక్షిణం గా కొంత పొలాలలో కొత్త ఇళ్ళు అనే పేరు తో ప్రభుత్వం అన్ని వర్ణాల వరికి ఇళ్ళు కట్టించి ఇచ్చింది. ఈ గ్రామానికి పడమర గా ఉన్న కాలువ (గుంటూరు ఛానల్) పంటపొలాలకు నీరు అందిస్తుంది. అనేక గ్రామాలకు ఇది మంచి నీటి కాలువ గా ఉపయోగపడుతుంది.ఈ కాలువ క్రిష్ణా నది నుండి వస్తుంది. డాక్టర్ కాసరనేని సదాశివరావు, డాక్టర్ కొండబ్రోలు బసవపున్నయ్య గార్ల స్వగ్రామం

ఉత్తరం వైపు సుమారు 30 ఎకరాల వైశాల్యం గల ఒక మంచి నీటి చెరువు ఉంది, దీన్ని ఊర చెరువు అని పిలుస్తారు.పూర్వం వర్షాలు కురిసినప్పుడు పడమరగా ఉన్న వాగు ద్వారా నీరు వచ్చి ఈ చెరువు నిండేది. పూర్వం వేసవి లో నీటి సౌకర్యం సరిగా లేకపోవటం తో ప్రక్కనే ఉన్న పెదకాకాని గ్రామంలోని బావుల నుండి నీరు తెచ్చేవారు.ప్రస్తుతం కాలువ నుంచి చెరువుకి సంవత్సరమంతా నీటి సౌకర్యం ఉండేలా ఏర్పాటు జరిగింది.రెండు మంచి నీటి ఓవర్ హెడ్ టాంక్‌ లు, ప్రతీ ఇంటికి మంచి నీటి కొళాయిలు ఏర్పాటయ్యాయి. గ్రామం లో తూర్పు వైపున చౌడేశ్వరి అమ్మవారి ఆలయం, దక్షిణం గా బ్రహ్మం గారి గుడి ఉన్నాయి.ఇక్కడ కార్తీక మాసం అన్న సమారాధనలు జరుగుతాయి. అద్దంకి నుండి వచ్చిన ఆద్దంకమ్మ గుడి, చెరువు కట్ట మీద పోలేరమ్మ గుడి ఉన్నాయి.

.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -