కమ్మ
వికీపీడియా నుండి
కమ్మ (Kamma) లేక కమ్మవారు అనునది దక్షిణ భారత దేశంలో ఒక కులం. ఈ కులస్తులు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోను, కొద్ది సంఖ్యలో కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలోను ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 4 నుండి 5% [1][2] వరకు కమ్మ కులస్తులు ఉంటారు. వీరి భాష ప్రధానంగా తెలుగు.
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు. కమ్మనాడు అను ఒక విభాగము పెక్కు శాసనములలొ కన్పడును. ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియుచున్నది. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోను, మరియు తమిళనాడులో కొన్ని ప్రాంతాలలోను ఉన్నారు.
చాలాకాలం వ్యవసాయం ప్రధానమైన వృత్తిగా ఉన్న ఈ కులస్తులలో కొందరు గడచిన నాలుగు దశాబ్దాలచలో విద్య, సినిమా, పారిశ్రామిక, వాణిజ్య మరియు రాజకీయ రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించి ఆంధ్ర ప్రదేశ్ సమాజంలో ప్రముఖులుగా పరిగణింపబడుతున్నారు.
[మార్చు] మూలాలు
- ↑ Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India, కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ.
- ↑ 1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories, కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిధ్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి.
[మార్చు] బయటి లింకులు, వనరులు
- Castes and Tribes of Southern India, 5వ సంచిక, ఎడ్గార్ థర్స్టన్, 1909.
- ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910.
- కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య ఛౌధరి1939.