కట్టావారిపాలెం
వికీపీడియా నుండి
కట్టావారిపాలెం గ్రామము ప్రకాశం జిల్లా కొండపి మండలములోని ముఖ్యమయిన గ్రామాలలో ఒకటి. ఇది కొండపి పట్టణమునకు ఒక మైలు దూరములో ఉన్నది. ఈ గ్రామము గత శతాబ్దము నుంచి కొండపి కరణీకం కింద పరిపాలింపబడినది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
గ్రామములో కమ్మ కులస్తుల ప్రాబల్యము అధికము. వడ్డెర, గొల్ల మిగిలిన కులస్తులు. అందరికి వ్యవసాయమే జీవనాధారము. ముఖ్యముగా రావెళ్ళ వారి ఆధీనములో అన్ని రాజకీయ, సామాజిక అంశములు ముడిపడి ఉండెడివి. గ్రామ మునసబు మరియు సర్పంచులుగా కొన్ని దశాబ్దములుగా సేవలందించిరి. కొండపి మండలమునే గాక చుట్టుపక్కల ప్రాంతాలకు కూడ సుపరిచితము. గ్రామములో కట్టా, మామిళ్ళపల్లి, బెజవాడ, బొక్కిసం,ఆరికట్ల,అంగలకుర్త్తి,బొడ్డపాటి,బెజవాడ మొదలగు కుటుంబాలు ప్రాముఖ్యముగా ఉన్నవి. కట్టావాలరిపాలెం, కొండపి అసెంబ్లీ నియొజకవర్గంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
[మార్చు] గ్రామ విశేషాలు
గ్రామ ప్రజలు కళలును పోషించటంలో తమకు సాటిలేదని నిరూపిస్తూ, మరుగునపడి పోతున్నటువంటి కోలాటం, చెక్కభజన, ముగ్గులపోటీలు, భజన మొదలగు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ, వాటి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఉగాది రోజున జరిగే సంబరాలు , ఆ రోజున దేవుని(జాల్లపాలెం) సన్నిధిలో వుంచే విద్యుత్ ప్రభల ప్రాభవం కనులారా చూసి తరించవలసిందే. ఉన్నత ఉద్యోగాలలో ఉండి, "ఉన్న వూరు కన్నతల్లి" అనే సామెతను అక్షరాలా పాటిస్తూ , మనవూరివికాసం సభ్యులు గ్రామాభివ్రుద్దికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. [ref:http://groups.yahoo.com/group/kattavaripalem]
[మార్చు] వ్యవసాయం
ఇక్కడ పండించే పంటలలో వరి, పొగాకు, శనగ, జొన్న, వేరుశనగ తదితర పంటలు ముఖ్యమైనవి. ఎక్కువగా మెట్ట పంటలు ఆధారము.
[మార్చు] ప్రభుత్వకార్యాలయాలు
[మార్చు] దేవాలయాలు
[మార్చు] సౌకర్యాలు
[మార్చు] రవాణా సౌకర్యాలు
[మార్చు] సంస్కృతి
ప్రాచీన కాలము నుండి గ్రామము విద్యకు, కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి.
[మార్చు] ఇతర విశేషాలు
|
|
---|---|
మూగచింతల · నెన్నూరుపాడు · గుర్రప్పడియ · పెట్లూరు · కోయవారిపాలెం · సి.జి.అనంతభొట్లవారి ఖండ్రిక · అనకర్లపూడి · కొండపి గడియారంవారి ఖండ్రిక · చినకండ్ల గుంట · పెదకండ్ల గుంట · ఇలవెర · కట్టావారిపాలెం · కొండపి · పెరిదేపి · ముప్పవరం · చోడవరం · వెన్నూరు · చినవెంకన పాలెం · కే.ఉప్పలపాడు · గొగినెనివారిపాలెమ్ |