ఊబలంక
వికీపీడియా నుండి
ఊబలంక, తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామానికి 3 కి.మి దూరం లొ పుణ్యక్షేత్రమైన ర్యాలి కలదు. ఈ గ్రామానికి తరచు రాజమండ్రి, రావులపాలెం నుండి బస్సు సౌకర్యం ఉన్నది. ఈ గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం. ఈ గ్రామంలొ వరి చేలు ఉన్నాయి. అవి కాకుండా అరటి,కొబ్బరి తోటలు ఉన్నాయి. గ్రామానికి ప్రధాన రహదారి ప్రక్కన పంట కాలువ కలదు. రహదారి జంక్షన్ వద్ద సాయి బాబా, దత్తాత్రాయే స్వామి గుడి, వేంకటేశ్వర స్వామి ఉన్నాయి.
ప్రస్తుతం ప్రెసిడెంట...శ్రీమతి లావన్యరాము గారు.
[మార్చు] ఊబలంక లో వున్న దేవాలయాలు:
శివాలయం-వూరి మధ్యలో ఉంటుంది. రామాలయం-శివాలయం కి దగ్గరలో ఉంటుంది. కనక దుర్గ ఆలయం- రామాలయం కి ఎదురుగ కాలవ వడ్డున ఉంటుంది. సుభ్రమన్యస్వామి ఆలయం-శివాలయం తో పాటు ఉంటుంది. కొటసత్తెమ్మ ఆలయమం-చిన్నవంతెన దగ్గరలో ఉంటుంది. మహలక్ష్మి ఆలయం-గ్రామ దేవత.వూరి మధ్యలో ఉంటుంది. వినాయకుడి గుడి,షిర్దిసాయి బాబా గుడి,సరస్వతి గుడి,వెంకటేశ్వర స్వామి గుడి, అన్ని వూరి చివర ఉన్నాయి.
[మార్చు] విద్యా సౌకర్యాలు
గ్రామంలో సెకండరీ స్కూల్ స్థాయి వరకు విద్యాసౌకర్యం కలదు. గ్రామంలో ఎలిమెంటరీ స్కూళ్ళు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవు.
ఇక్కడి హోటల్లలో భోజనం రుచికరంగా ఉంటుంది. మెడికల్ షాప్ లు, కిరాణా షాప్ లు పుష్కలంగా ఉన్నాయి. ఏటిగట్టు, పక్కన కాలవ, గట్టుకి అవతల పచ్చని పొలాలు అందంగా ఉంటాయి.
--నాగిరెడ్డి--
నాగిరెడ్డి.ద్వారంపూడి@జీమెయిల్.కామ్
|
|
---|---|
ఊబలంక · రావులపాలెం · కొమర్రాజు లంక · వెదురేశ్వరం · రావులపాడు · లక్ష్మీ పోలవరం · జుత్తిగపాడు · పొడగట్లపల్లి · గోపాలపురం · ఈతకోట · దేవరాపల్లి · ముమ్మిడివరప్పాడు |