సభ్యులపై చర్చ:Ahmadnisar
వికీపీడియా నుండి
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఒకో మారు ఒక వ్యాసంలో ఇచ్చిన లింకులు అక్షర భేదాల కారణంగా ఎర్ర లింకులు గా కనిపిస్తాయి. అంటే ఆవ్యాసం లేదనుకోవాలి. కానీ మరో విధమైన స్పెల్లింగుతో ఆ వ్యాసం ఉండే ఉండొచ్చు.
అక్కినేని నాగేశ్వరరావు గురించిన వ్యాసంలో "మనుషులు మమతలు" అనే సినిమా ప్రస్తావన రావచ్చును. మీరు మనుషులు-మమతలు, మనుషులూ మమతలూ, మనుషులు, మమతలు ఇలా చాలా విధాలుగా వ్రాస్తే అవి ఎరుపు రంగు లింకులుగా కనిపించి, ఆ వ్యాసం లేదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వ్యాసం పేరు మనుషులు మమతలు.
దారిమార్పు పేజీలతో ఈ సమస్య కొంత వరకు పరిష్కారం కావచ్చును. కానీ ఎన్నని తప్పు స్పెల్లింగులకు దారిమార్పులివ్వగలం? కాస్త శ్రమయినా విసుగుచెందకుండా సరైన లింకు కోసం వెతకండి. దయచేసి వీలయినంత వరకు లింకులు సవరించండి.
1 .. 2.. |
విషయ సూచిక |
[మార్చు] 40వేల వ్యాసం
- నిసార్ అహ్మద్ గారూ, మీరు ప్రారంభించిన మానస్ జాతీయ అభయారణ్యం వ్యాసంతో తెవికీ 40వేల వ్యాసాల మైలురాయికి చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా శుభాభివందనాలు. తెవికీలో మీకు కృషి అభినందనీయం --వైజాసత్య 00:23, 9 మే 2008 (UTC)
[మార్చు] ప్రాథమిక హక్కులు వ్యాసం
నిసార్ గారు, భారతదేశంలో ప్రాథమిక హక్కులు వ్యాసాన్ని బాగా తీర్చిదిద్దుతున్నారు. Right against exploitation కు దోపిడిని నివారించే హక్కు గాను, Right to constitutional remedies కు రాజ్యాంగ పరిహారపు హక్కుగాను వ్రాయవచ్చు. అట్లే ఆస్తి హక్కు విభాగంలో ఆర్టికల్ 19 నుండి 31 అని వ్రాశారు, దాన్ని ఒకసారి సరిచూడండి. వ్యాసం మొత్తం పూర్తయిన తర్వాత వాక్యాల అమరిక సరిచేయాల్సి వస్తుంది. అనువాదం చేసేటప్పుడు ఏ వ్యాక్యానికి ఆ వాక్యం విడివిడిగా వ్రాస్తాము కాబట్టి పేరా కూర్పు సరిగా ఉండక పోవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:25, 11 మే 2008 (UTC)
[మార్చు] ఉద్యమ ప్రణాళిక
మీ పేజీలో మీరు వ్రాసుకొన్న ప్రణాళిక చూశాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ప్లానింగ్ లేకుండా పెద్ద ప్రాజెక్టులు సాధ్యం కావు. కాని ఇది దీర్ఘకాలిక కార్యక్రమం గనుక మీరు వ్రాసిన విషయాలు అధ్యయనం చేసి, అంచెలంచెలుగా అమలు చేద్దాము. ఒక వారంలో నా వ్యాఖ్యలు వ్రాస్తాను. తరువాత రచ్చబండలో పెడదాము. (మీ చర్చా పేజీ బాగా పెద్దదైనందున పాత చర్చలను నిక్షిప్తం చేశాను) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:33, 15 మే 2008 (UTC)
[మార్చు] A little help: Ecser
Hi! I'm a Hungarian Wikipedia editor, my name is Norbert Kiss. I'm very proud of my village and I would like to read about it in a lot of langauges. I translated already it into 10 languages, but I can't speak Telugu. Could you help me. My village's English page is this: Ecser. Could you translate the page of Ecser into Telugu? Then just link the side into the English version and I will see it, or you could write me, when it is ready. My hungarian Wikipedia side is: My profile. Or my e-mail is: eino@freemail.hu
Thank you! Norbert
-
- Thank you fot the translation :) It looks great! Norbert
[మార్చు] దారి మార్పులు
నిస్సార్ గారూ! చర్చ:హిందూస్థానీ సంగీతము లో మీరు దారి మార్పు సూచించారు. దారి మార్పులు చాలా చీపు (అని వైజా సత్య అన్నాడనుకొంటాను). మీకు అవసరమనిపించినపుడు పేజీ పైన "తరలింపు" ట్యాబ్ ద్వారా దారి మళ్ళించేయండి. కేవలం భిన్నాభిప్రాయాలుండవచ్చునని అనుకుంటే చర్చకు పెట్టండి. మీ పేజీలో ఒక హంగెరీ వికీపీడియన్ తన వూరు ఏచర్ గురించి వ్రాయమని కోరాడు అని ఇప్పుడే చూశాను. ఆ పేజీ నేను మొదలు పెడతాను. వీలయితే మీరు అనువాదం చేయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:59, 24 మే 2008 (UTC)
[మార్చు] మీ వ్యాసాల నుండి కాపీ
చంద్రకాంతరావు గారూ, నాకు పట్టికలు, మూసలు తయారుచేయడం రాదు, కావున, మీవ్యాసాల నుండి కొన్ని పట్టికలు మూసలు కాపీచేసి వాడాను. నేనింతవరకు వ్యాసాలలో ఉపయోగించిన పట్టికలు, మీవ్యాసాల నుండి 'మాడల్' గా తీసుకున్నవే. అలాగే 'మూస:ఒలంపిక్ క్రీడలు' ఉపయోగించి, 'మూస:ఆసియా క్రీడలు' గా మార్చాను. అలాగే 'జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు' మూసను కూడా కాపీ చేసుకుంటున్నాను, అన్యదా భావించకండి ప్లీజ్, మిత్రుడు నిసార్ అహ్మద్ 20:36, 28 మే 2008 (UTC)
- నిసార్ గారు, ఇందులో అన్యధా భావించడానికేమీ లేదు పైగా నాకు సంతోషమే. మనం రచిస్తున్న వ్యాసాలు కూడా స్వేచ్చగా ఎవరైనా ఉపయోగించడానికే కదా. మీకు ఇంకనూ ఏదైనా అవసరమైతే అడగండి నా వంతు సహాయపడతాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:41, 28 మే 2008 (UTC)
[మార్చు] కుల నిర్మూలనపై చర్చ
- కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు మరియు కులనిర్మూలన, ఈ మూడు వ్యాసాలలో దాదాపు ఒకే రకమైన విషయాలున్నవి (ఉదాహరణలు అన్నిట్లోనా ఒకటే).
- కులాంతర వివాహం అనగా, ఒకే మతంలోని విభిన్న కులాలవారి మధ్య వివాహం.
- మతాంతర వివాహం అనగా, రెండు వేర్వేరు మతాలకు చెందిన వారి మధ్య వివాహం.
- మతం అంటే మార్గం, కులం అంటే సమాజంలో వృత్తి పరమైన గుర్తింపు. వీటి సహకారంతో మనిషి ఇప్పటివరకూ జీవిస్తూ వచ్చాడు. స్వేచ్ఛగా, ఇతరులకు హాని లేకుండా జీవనం సాగిస్తే ఏ బాదరబందీ వుండదు. ఉన్మాదం లేదా 'fanaticism' బయలుదేరకూడదు. మతాంతర వివాహాలు చేసుకున్న పెద్ద పెద్ద వారికి పెద్ద సమస్యలుండవేమో, చిన్నా చితకా మనుషులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇంకనూ సమస్యల సుడిగుండమేమో, సంకర మతాలు, సంకర కులాలు అనే విభాగాలు జనియించే ప్రమాదం వున్నదేమో?. కులం అనేది సామాజిక గుర్తింపు అయితే, కులం లేకుండా పోవడం అనేది కూడా ఓ గుర్తింపేకదా! ప్రతి మనిషి తన గుర్తింపు తన సమూహపు గుర్తింపు ప్రపంచం గుర్తించాలని కోరుకుంటాడు. అలాగే పైనుదహరింపబడిన వ్యాసాల రచయిత గారు, కులనిర్మూలన గురించి వ్రాస్తూనే, దూదేకుల అనే వ్యాసం సృష్టించారు. (వారి మనసు నొప్పించియుంటే క్షమాపణలు కోరుతున్నాను). కులాలు ఉండకూడదు అని కోరుకోవడంలో ఎంత ఔచిత్యముందో, కులాలుండాలి అని కోరుకోవడంలోనూ అంతే ఔచిత్యమున్నదేమో?. కానీ ఇక్కడ కులాలు 'తక్కువ' 'ఎక్కువ' అనే ధోరణి వుండకూడదు. ఇక్కడ నిర్మూలించాల్సింది, కులాల మధ్య తారతమ్యతను, వాటి పోలికలను, మరియు అస్పృశ్యతను. ప్రతి కులస్తుడూ తాను సరి, అని అనుకుంటాడు. అలాంటి సమయంలో ఇతరులు సరి కారు అనే అర్థం స్ఫురిస్తుంది. దూదేకుల అనే వ్యాసంలో రచయతగారు, దూదేకులు మాత్రమే 'సెక్యులర్'లు అనే అర్థం వచ్చేలా వ్రాశారు. ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ ఉదాత్తులు ఉన్నారు. సర్వజ్ఞానులూ ఉన్నారు. రచయిత గారికి ఓ సూచన, వాస్తవాలను సోదాహరణంగా వివరిస్తూ వ్రాస్తే అందరూ సంతోషంగా స్వీకరిస్తారు. మీ సొంత అభిప్రాయాలు గౌరవనీయమే, సమాజంలోని సత్యాలూ గౌరవనీయమే గదా. పరస్పర గౌరవాలే మంచి భవిష్యత్తుకు నాంది. నిసార్ అహ్మద్ 12:52, 29 మే 2008 (UTC)
ఇది అసలైన సెక్యులర్ కులం అనటానికి కారణం వీరిలో హిందూ, ముస్లిం,క్రైస్తవ ఆచారాలు మూడూ కనిపిస్తాయి కాబట్టి.అంతేకానీ దూదేకుల కులం మరో కులాని కంటే ఎక్కువని చెప్పలేదు.ఆకులాన్ని సమర్ధిస్తే కలిగే ప్రయోజనమూ లేదు.ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులాన్ని గురించి ఉన్న నిజాలు తెలిసిన విషయాలు చెప్పినట్లే ఈ వ్రాతలు కూడా.సెక్యులర్ గాఇలాగే ఇంకా ఏవైనా కులాలుంటే వాటిని గురించి తెలియ జేయండి.కులనిర్మూలనకే మన ఓటు.ఈకులాలు మనకు కూడు పెట్టవు.మనము కులాల బందీఖానాలో ఉన్నాము.కులం లేకుండా పోవడం వల్లనే మనలో నిజమైన ఐఖ్యత వస్తుంది.తెలుగు భాషపట్ల మీఅపార ప్రేమను వికీలో అనేక అంశాలపై మీరు చేసిన కృషిని చూశాను. అభినందనలు. రహంతుల్లా.
- అవును. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, కులనిర్మూలన -- ఈ మూడు వ్యాసాలలోని విషయాలను లాజికల్‌గా పునర్వ్యవస్థీకరించాలి. సమయం దొరికినపుడు ప్రయత్నిస్తాను. ఇందుకు కులం, మతం, వివాహం అనే వ్యాసాలను పరిశీలించి తరువాత వ్యాసాలను సరిచూడాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:38, 30 మే 2008 (UTC)
[మార్చు] ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా
నిస్సార్ గారూ! ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా ను మరింత సంపూర్ణంగా చేయగలరా? మీ పేజీలో ఉన్న వ్యాసాలన్నింటినీ ఏదో ఒక సెక్షన్‌లో ఉంచవచ్చును. కావాలంటే క్రొత్త సెక్షన్‌లు సృష్టించవచ్చును. {{ఇస్లాం}} మూసను ఈ జాబితా ఆధారంగా మళ్ళీ డిజైన్ చేయాలనుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:03, 1 జూన్ 2008 (UTC)
- కాసుబాబు గారూ, నమస్తే, ఈదుల్-అజ్ హా అనే పేజీని 'తరలింపు' బక్రీదు లేదా బక్రీద్ పేజీతో చేస్తే, తరలింపు జరిగి, బక్రీదు లేదా బక్రీద్ పేరుతో పేజీ వస్తుంది. కానీ పేజీ పేరు ఈదుల్-అజ్ హా గానే వుండాలి, బక్రీదు లేదా బక్రీద్ పేరులతో తరలింపు జరగాలి, అంటే యేమి చేయాలి కొంచెం తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 20:49, 23 జూన్ 2008 (UTC)
-
- బక్రీదు లేదా బక్రీద్ అనే (క్రొత్త) వ్యాసాలు తెరిచి, వాటిలో #REDIRECT [[ఈదుల్-అజ్ హా]] అని వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 03:50, 24 జూన్ 2008 (UTC)
[మార్చు] 3వ లక్ష దిద్దుబాటు
- నిస్సార్ గారూ వీకీపీడియా మైలురాయి అయిన 3వ లక్ష దిద్దుబాటు చేసినందుకు అభినందనలు.
--t.sujatha 04:06, 4 జూన్ 2008 (UTC)
[మార్చు] ధన్యవాదాలు
మీ అభిమానానికి ధన్యవాదాలు నిస్సార్ గారూ! δευ దేవా 08:45, 21 జూన్ 2008 (UTC)