See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
విజయనగర సామ్రాజ్యము - వికీపీడియా

విజయనగర సామ్రాజ్యము

వికీపీడియా నుండి

విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.

విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు.

ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. చివరి శతాబ్దాన్ని దీనికి క్షీణదశగా చెప్పుకోవచ్చు. సుల్తానుల సమాఖ్య వీరిని తళ్ళికోట యుద్ధములోదారుణంగా ఓడించి, రాజధానిని ఆరు నెలలబాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్ఠి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు.

విషయ సూచిక

[మార్చు] స్థాపన

విజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము మునుపు దక్షిణ భారత దేశమునందలి రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫుర్ ఓరుగల్లు ను ఆక్రమించి మలాబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర మరియు బుక్క అను గొల్ల సోదరులిద్దరు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. ఇరువురు ఢిల్లీకి తరలించబడి ఇస్లాము మతమునకు మార్చబడ్డారు. హోయసాల రాజు తిరుగుబాటు అణచివేయుటకు సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపుతాడు. సోదరులు తమకిచ్చిన కార్యము నెరవేర్చారు గాని విద్యారణ్యస్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి విజయనగర రాజ్యము స్థాపించారు[1]. హరిహర రాయలనే దేవరాయలని కూడా అంటారు. అతడే విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి. ముస్లిమ్ చరిత్రకారుడు బర్ని ప్రకారము బుక్క ముసునూరి కాపానీడు బంధువు. కాని ఇది సబబుగా తోచదు.

దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో హరిహరరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. హరిహరరాయలు తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది.

[మార్చు] తారస్థాయి

తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యముఆ వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొంది. ఒక బలీయమైన శక్తిగా నిలబడింది.

1510 ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను అధీనంలో ఉన్న గోవా ను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు చాలా ముఖ్యమైనవి.

శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్దములో సజీవముగా బయటపడిన రామరాయల తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా పెనుకొండకు పారిపోయాడు.

విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.

[మార్చు] పతనము

చివరకు కొంచము పరువు, ప్రతిష్ఠ మిగిలినా కూడ, పతనము తప్పలేదు. ఈ దశలో కూడా పోర్చుగల్ తో వాణిజ్యము కొనసాగించారు. బ్రిటీషు వారికి మద్రాసు పట్టణం ఏర్పాటు చేయటానికి భూమి మంజూరు చేశారు.

[మార్చు] వంశ పరంపర

కింది జాబితా రాబర్ట్ సెవెల్ రాసిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (విస్మృత సామ్రాజ్యం) అనే పుస్తకం నుండి సంగ్రహించినవి.

సంగమ వంశము

  • హరిహర I (దేవ రాయ) 1336-1343
  • బుక్క I 1343-1379
  • హరిహర II 1379-1399
  • బుక్క II 1399-1406
  • దేవ రాయ I 1406-1412
  • వీర విజయ 1412-1419
  • దేవ రాయ II 1419-1444
  • (తెలియదు) 1444-1449
  • మల్లికార్జున 1452-1465 (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర 1468-1469 (తేదీలు సందేహాస్పదం)
  • విరూపాక్ష I 1470-1471 (తేదీలు సందేహాస్పదం)
  • ప్రౌఢదేవ రాయ 1476-? (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర 1479-1480 (తేదీలు సందేహాస్పదం)
  • విరూపాక్ష II 1483-1484 (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర 1486-1487 (తేదీలు సందేహాస్పదం)

సాళువ వంశము

తుళువ వంశము

  • రామ (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565
  • తిరుమల (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567
  • తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575
  • రంగ II 1575-1586
  • వెంకట I 1586-1614

ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు

  • రంగ దేవరాయ II 1614-1615
  • రామ దేవరాయ 1615-1633
  • వెంకట దేవరాయ III 1633-1646
  • రంగ దేవరాయ III 1614-1615

[మార్చు] చూడండి

  1. విజయ నగర వంశస్తుల వంశ వృక్షములు
  2. విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు
  3. విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్తితులు
  4. విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి
  5. విజయ నగర రాజులు పరిపాలనా కాలాన్ని అనుసరించి

[మార్చు] సంబంధిత లింకులు

[మార్చు] వనరులు

  • Robert Sewell, A Forgotten Empire (Vijayanagar): A contribution to the history of India, Chapter 2 (http://www.gutenberg.org/dirs/etext02/fevch10.txt)
  • Rubies, J. P., Travel and Ethnology in Renaissance: South India Through European Eyes (1250-1625), 2000, Cambridge University Press, p. 15, ISBN 0521770556
  • H. Kulke, Reflections on the historiography of early Vijayanagara and Sringeri, in: Vijayanagara: City and Empire, Vol I, 1985, by A. Dallapiccola and S. Z. Ave, Stuttgart,pp. 120-143
  • Francis Buchanan, Travels in Southern India, Mysore, vol. III, East India Company, London, 1807, Buchanan, p. 110
  • J. R. Pantulu, Krishna Raya or The Story of the Karnatak Kingdom, The Quarterly Journal of the Andhra Historical Research Society, Vol. II, Pts. 3 and 4, Rajamundry, 1927, pp. 204-219
  • Durga Prasad, History of the Andhras (http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf)
  • B. Stein, Vijayanagara, Cambridge University Press, 1989, p. 141, ISBN 0521266939
  • N. Venkataramanayya, The Early Muslim expansion in south India, University of Madras Press, Madras, 1942
  • M. H. Ramasarma, The History of the Vijayanagar Empire, Vol. I, Bombay
  • History of Vijayanagar: The Never to be Forgotten Empire, Bangalore Suryanarain Row, 1993, Asian Educational Services, p. 23; ISBN 8120608607
  • B. A. Saletore, Theories concerning the origin of Vijayanagara, in: Vijayanagara Sexcentenary Association, Volume, Ed. Karmakar, Dharwar, 1936, pp. 139-160
  • B. V. Sreenivasa Rao, Notes on Vijayanagara, Journal of the Andhra Historical Research Society, Vol. 25, 1958-60, pp. 155-177
  • Y. Subbarayalu, The Revenue System of the Vijayanagara State, The Vijayanagara Heritage, Ed. Ramamurthy J.R, Sri Vidya Vijayanagara Hampi Heritage Trust, Anegondi, Hospet, 1996, pp. 75-80
  • J. D. B. Gribble, History of the Deccan, 1896, Luzac and Co., London
  • B. R. Gopal, The Gozalavidu Inscription of Bukkaraya, Journal of the Karnataka University, Vol. 7, Dharwad, 1971, pp. 174-183
  • N. Venkataramanayya, The Early Muslim expansion in south India, University of Madras Press, Madras, 1942
  • N. Venkataramanayya, Vijayanagara: Origin of the City and the Empire, Bulletin of the Department of Ancient History and Archaeology, Madras University, Madras, 1931
  • N. Venkararamanayya, The Founders of Vijayanagara Before the Foundation of the City, Journal of the Oriental Research, Vol. 12, Pt. 2, Madras, 1938, pp. 221-223

^ Telugu Vignana Sarvaswamu, Volume 2, History, Telugu University, Hyderabad

  • M. Somasekhara Sarma, A Forgotten Chapter of Andhra History, 1945, Andhra University, Waltair
  • K. A. Nilakanta Sastri and N. Venkataramanayya; Further Sources of Vijayanagara History, 1946, Vol. II , University of Madras, Madras



విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము
ఇతర భాషలు


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -