రెడ్డి
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. (అనువాదకులకు వనరులు) |
- గమనిక: ఈ తరహా వ్యాసంలో వివాదాస్పదమైన విషయాలు ఉండే అవకాశం ఉన్నది. కనుక నిర్ధారించుకొనదగిన ఆధారాలు చాలా అవుసరం. రచయితలు ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా కోరడమైనది.
రెడ్డి (Reddy, Reddi) అనునది హిందూ మతంలోని ఒక కులం.వీరి కులం కాపు గానే పేర్కొంటారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 11% నుండి 15% వరకు రెడ్డి కులస్తులు కలరు. వీరి భాష ప్రధానంగా తెలుగు. భూస్వాములు, గ్రామ పెద్దలు ఈ కులస్తులకు చెందినవారే ఎక్కువ. కర్ణాటక, తమిళనాడు (వీరు అక్కడ రెడ్డియార్లుగా వ్యవహరించబడతారు) మరియు కేరళలలో కూడా రెడ్డి కులస్తులు కలరు.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికం
రెడ్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలోను,మరియు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లలో కూడా నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామపెద్దగా (మునసబు)రెడ్డి కులస్తులే వ్యవహరిస్తూ ఉంటారు.వీరు పన్నులు వసూళ్ళు, గ్రామ రక్షణ మరియు గ్రామము తరపున ప్రభుత్వంతోను, బయట వారితోను వ్యవహారాలను నడుపుతూ ఉంటారు. ఈ కులములో కొందరు ధనికులు, భూస్వాములు మరియు వ్యాపారస్తులు.చాలా వరకు చిన్నకారు రైతులే. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో,చిన్నగ్రామాలలో గ్రామం తరఫున వీరి మాటే వేదవాక్కు.గ్రామ నాయకత్వము ఈ కులస్తులే నెరపుతారు. రాజకీయాలలో ప్రముఖ పాత్ర వీరిదే. కర్ణాటకకు చెందిన రెడ్లను 'ఒక్కలింగ'లు అనికూడా అంటారు. మరలా వీరిలో బంటులు మరియు గౌడులు అనే ఉప కులాలు కలవు. కేరళ రెడ్లను నాయర్లుగా ప్రసిద్ది పొందారు. కొండరెడ్లకు (గిరిజన)మామూలు రెడ్లకు సాంఘికంగాను,భౌగోళికంగాను ఏవిధమైన సంబంధమూ కనిపించదు.
[మార్చు] చరిత్ర
[మార్చు] మూలం
రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందిన వారు కాదు.వీరు దక్కను పర్వత కనుమలకు చెందిన అనేక సమూహాల కలయిక అని చరిత్ర చెపుతుంది.
కొంత మంది చరిత్రకారుల ప్రకారం రెడ్డి వర్గం వారిని రథివర్గం అంటారని, శాతవాహనులు మరియు మౌర్య చక్రవర్థులకంటే ముందు అనగా క్ర్రీస్తు పూర్వం:200లో దక్కను పర్వత కనుమల లోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు.వీరు ఉత్తరఅంధ్రప్రదేశ్,కర్నూల్, మరియు పూణె దగ్గరి ప్రదేశాలలో నివసించారు అని పురావస్తు పరిశోధనల ద్వారా తెలుస్తుంది."రథి" అనగా "రథం నడిపేవాడు" అని, రథం అనగా గుర్రాల చేత లాగబడే వాహనం అని "సంస్క్రుతం"లో అర్థం. వారి రాజును మహారథి అని పిలిచేవారు.
చాలా ప్రాంతాలలో గ్రామ పెద్దగా వుండే వారిని "రెడ్డి" గా వ్యవహరిస్తారు.కాలగమనంలో వారి అనుచరులు రెడ్డి గ్రూపులుగా ఎర్పడ్డారు.ఈవిధంగా కూడా రెడ్డి వర్గం ఎర్పడిందని చెప్పవచ్చు. గత దశాబ్దకాలం ముందు వరకు కూడా రాయలసీమ లోని చాలా గ్రామాల్లో గ్రామాధికారులను "రెడ్డి" అనే సంభోదించేవాల్లు. తరువాత వారిని గ్రామ కార్యదర్శులుగా మార్చారు, అయినప్పటికీ వారిని "రెడ్డి" అనే సంభోదించేస్తున్నారు.
[మార్చు] 9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దపు తొలి నాళ్ళ వరకు
9వ శతాబ్దం నుండి రెడ్లు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.రెడ్లయొక్క మొట్టమొదటి లిఖితపూర్వక ఆధారాలు శిలాశాసన కాలం నుండి రాష్ట్రకూటుల 9వ శతాబ్ది కాలం వరకు లభ్యమైనవి.
[మార్చు] రెడ్ల పేర్లు పెట్టిన పట్టణాలు, నగరాలు
- రంగారెడ్డి జిల్లా
- సంగారెడ్డి పట్టణం
- కామారెడ్డి పట్టణం
- జంగారెడ్డిగూడెం గ్రామం
- జాజిరెడ్డిగూడెం, నల్గొండ జిల్లా గ్రామం
- వీరారెడ్డి పల్లె, అనంతపురం జిల్లా గ్రామం
- రెడ్డి పల్లె, అనంతపురం జిల్లా గ్రామం
- నాగిరెడ్డి పల్లె, అనంతపురం జిల్లా గ్రామం
[మార్చు] ప్రముఖ రెడ్లు
[మార్చు] కళలు
- వేమన - కవి మరియు యోగి
- గోన బుద్దారెడ్డి - 13వ శతాబ్దపు కవి మరియు రామాయణ ఆనువాదకుడు.
- సురవరం ప్రతాపరెడ్డి - రచయత
- నితిన్ రెడ్డి - చలనచిత్ర నటుడు
- కె.వి.రెడ్డి - చలనచిత్ర దర్శకులు (విఖ్యాత మాయాబజార్,మిస్సమ్మ చిత్రాల దర్శకులు)
- బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి - చలనచిత్ర దర్శకులు
- పట్టాభి రామ రెడ్డి - రచయత, చలనచిత్ర నిర్మాత మరియు సంఘసంస్కర్త
- సి.నారాయణరెడ్డి - కవి
- విషాల్ రెడ్డి - చలనచిత్ర నటుడు
- యస్.వి.కృష్ణారెడ్డి - చలనచిత్ర దర్శకులు
- రాజారెడ్డి, రాధారెడ్డి - కూచిపూడి నర్తకులు
- శివా రెడ్డి - హాస్య నటుడు, ధ్వన్యనుకరణ (మిమిక్రి) కళాకారుడు.
[మార్చు] వ్యాపారం
- వై.వేణుగోపాల రెడ్డి - గవర్నరు, రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా
- జి. శశి రెడ్డి - ఆప్ ల్యాబ్స్ టెక్నాలజిస్, అమెరికాలొ ఇన్ఫర్మేశన్ టెక్నాలజి వ్యాపరవేత్త
- లకిరెడ్డి బాలిరెడ్డి - అమెరికాలొ పూటకుళ్ళ ఇళ్ళ వ్యాపరవేత్త, ప్రస్తుతం జైలులొ ఉన్నాడు
[మార్చు] రాజకీయాలు
- నిమ్మ రాజా రెడ్డి - తెలుగుదేశం పార్టి, మాజి ఏం.ఏల్.ఏ
- పి. చిన్నమ్మ రెడ్డి - మాజి ఏం.ఏల్.ఏ
- జె.సి.దివాకర రెడ్డి, ఏం.ఏల్.ఏ, తాడిపత్రి,
[మార్చు] కేంద్ర ప్రభుత్వం
- జైపాల్ రెడ్డి - కేంద్ర పట్టణాభివౄద్ది శాఖా మంత్రి, భారత ప్రభుత్వము. 2004 నుండి లోక్‌సభ సభ్యుడు
- నీలం సంజీవ రెడ్డి - భారతదేశ రాష్ట్రపతి (1977-1982) మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
[మార్చు] రాష్ట్ర ప్రభుత్వం
- బెజవాడ గోపాల రెడ్డి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1955-1956) మరియు ఉత్తరప్రదేశ్ గవర్నరు(1967-1972)
- కాసు బ్రహ్మానంద రెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(1964-1971)
- భవనం వెంకట్రామిరెడ్డి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1982 ఫిబ్రవరి - 1982 సెప్టెంబరు)
- కోట్ల విజయభాస్కర రెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(1982-1984) మరియు (1992-1994)
- కె. చంగలరాయ రెడ్డి - మైసూరు రాష్ట్ర (ప్రస్తుతం కర్ణాటక) తొలి ముఖ్యమంత్రి (1947-1952)
- మర్రి చెన్నారెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(1989-1990),ఉత్తరప్రదేశ్ గవర్నరు(1974-1977),పంజాబు గవర్నరు(1982-1983), రాజస్థాన్ గవర్నరు(1992-1993), తమిళనాడు గవర్నరు(1993-1996)
- నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1990-1992)
- నీలం సంజీవ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1956-1960 మరియు1962-1964)
- టంగుటూరి అంజయ్య అలియాస్ రామకృష్ణా రెడ్డి తల్లా- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1980-1982)
- వై.యస్.రాజశేఖరరెడ్డి -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (2004 నుండి ఇప్పటివరకు)
[మార్చు] లోక్‌సభ సభ్యులు
- నేదురుమల్లి జనార్దనరెడ్డి - లోక్ సభ సభ్యులు
- మేఖపాటి రాజమోహనరెడ్డి - లోక్ సభ సభ్యులు*
- మాగుంట శ్రీనివాసులురెడ్డి - లోక్ సభ సభ్యులు
- వై.ఎస్.వివేకానందరెడ్డి -లోక్ సభ సభ్యులు
- అనంత వెంకట్రామి రెడ్డి - లోక్ సభ సభ్యులు
- కోట్ల జయసుర్య ప్రకాష్ రెడ్డి - లోక్ సభ సభ్యులు
- ఎస్. పి. వై. రెడ్డి - లోక్ సభ సభ్యులు
- మధుసూధన్ రెడ్డి తక్కల - లోక్ సభ సభ్యులు
- సురవరం సుధాకర్ రెడ్డి - లోక్ సభ సభ్యులు
[మార్చు] క్రీడలు
- భరత్ రెడ్డి - భారత మాజీ క్రికెట్ ఆటగాడు
[మార్చు] గమనికలు
- ^ http://www.dailypioneer.com/indexn12.asp?main_variable=VOTE_2004&file_name=vote983.txt&counter_img=983
- ^ http://www.odi.org.uk/livelihoodoptions/papers/wp179.pdf#search='caste%2C%20class%2C%20an%20social%20articulation'
- ^ A Manual of the Kurnool State in the Presidency of Madras by Narahari Gopalakrishnamh Chetty, Government Press, Madras, 1886) p.139
- ^ Some were elected more than once.
- ^ Reddies in Tamil Nadu are called as Reddiyars as a courtesy of High respect.
- ^ Even though "Reddy" is the name of the caste in the Hindu system, "Reddy" is the last name in India and as the middle name in North America. Read the Reddy name confusion section.
- ^ {http://www.vepachedu.org/castemore.htm.
- ^ http://indculture0.tripod.com/reddis.htm
- http://www.timesofindia.com/today/11indi7.htm
[మార్చు] బయటి లింకులు
[మార్చు] ఇంకా చూడండి
- అగ్రవర్ణం
- రాష్ట్రకూటులు
- చాళుక్యులు