రాజ్ - కోటి
వికీపీడియా నుండి
రాజ్ - కోటి తెలుగు సినిమాలో ఒక జంట సంగీత దర్శకులు.
- రాజ్: ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు.
- కోటి: ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు.
వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రళయగర్జన వీరిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారుబుల్లోడు, హలో బ్రదర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లొ "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని టీవి షో (ఈటీవి) లకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవి తో హిట్లర్, బాలక్రిష్ణ తో పెద్దన్నయ్య, వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్ మొదలైనవి.