బ్రాహ్మణగూడెం
వికీపీడియా నుండి
బ్రాహ్మణగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము. ఇది నిడదవోలు పట్టణానికి (పంగిడి వెళ్ళే మార్గంలో) 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రాజమండ్రి పట్టణానికి ఈ గ్రామం సుమారుగా 20 కి.మీ. దూరంలో ఉన్నది. చాలా మంది ఈ ఊరి పేరుని చూసి ఇక్కడ అందరూ బ్రాహ్మణులే ఉంటారనుకుంటారు. కాని ఇక్కడ అలాగేమీ ఉండదు. అన్ని ఊళ్లలో ఉన్నట్లే తగు మాత్రం బ్రాహ్మణులు ఉంటారు. ఈ ఊరి మొత్తం ప్రజలలో సుమారు 90% వ్యవసాయం మీద అధారపడి జీవిస్తున్నారు. ఈ ఊరు పారిశ్రామికంగా కూడా కొంతవరకు అభివృధ్ధి చెందింది. ఈ గ్రామం చాగల్లు మండలం లోని ఒక మేజర్ పంచాయతి. ఈ ఊరి జనాభా సుమారుగా 12,000 వరకూ ఉంటుంది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
పూర్వం "బాపన్న" అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి మొదట నివాసం ఏర్పరుచుకున్నాడు. తరువాత కాలక్రమేణా చాలామంది వచ్చి నివాసముండటం ప్రారంభించారు. ఐతే మొదట బాపన్న వచ్చాడు కాబట్టి ఈప్రాంతాన్ని అతని పేరుమీదుగానే "బాపన్నగూడెం" అని పిలుస్తూ వచ్చారు కాల క్రమేణా అది బ్రాహ్మణగూడెంగా మార్పు చెందినది.
[మార్చు] గ్రామ సర్పంచ్‌ల జాబితా
- మాధవరెడ్డి రామారావు (31-3-1944 నుండి 22-6-1952)
- ఆత్కూరి అప్పారావు (25-1-1953 నుండి 10-5-1956)
- గారపాటి రాజన్న (11-5-1956 నుండి 20-9-1959)
- గారపాటి బులిమునియ్య కుమారుడు సుబ్బారావు (28-9-59 నుండి 10-6-1970)
- గారపాటి ఆచార్యులు కుమారుడు సుబ్బారావు (11-6-1970 నుండి 27-4-1974)
- గారపాటి మునీశ్వర రావు (8-5-1974 నుండి 30-5-1981)
- గారపాటి భాస్కర రావు (31-5-1981 నుండి 24-10-1983)
- మాధవరెడ్డి తాతారావు (29-6-1984 నుండి 30-3-1988)
- గారపాటి సత్యనారాయణ (31-3-1988 నుండి 20-10-95)
- గారపాటి శివ రామ కృష్ణ (21-10-1995 నుండి 16-8-2001)
- గారపాటి పద్మావతి(కాశీవిశ్వనాధం భార్య)(17-8-2001 నుండి 22-8-2006)
- కొయ్యే వెంకట్రావు (దావీదు)(23-8-2006 నుండి
[మార్చు] గ్రామంలో సౌకర్యాలు
గ్రామీణ గ్రంథాలయం, 3 కమ్యూనిటి హాళ్ళు ,పశు వైద్యశాల, త్రాగునీటి అవసరాల కోసం 3 రక్షిత మంచినీటి టాంకులు కలవు.
- ఊరి వ్యవసాయం కోసం 3 చెరువులు ఉన్నాయి. అవి - ఉప్పుగుంట చెరువు, ప్రత్తిపాటి చెరువు, రావుల చెరువు.
[మార్చు] రవాణా సౌకర్యాలు
- ఊరికి పాసింజరు బళ్ళకోసం చిన్న హాల్ట్ రైల్వే స్టేషన్ కలదు.
- బస్టాండ్ కలదు.
[మార్చు] దేవాలయాలు
- గ్రామంలో కల దేవాలయాల వివరములు.
- పంచాయతన రామలింగేశ్వర దేవస్థానం(శివాలయం),
- శ్రీ సీతారామస్వామి దేవస్థానం(రామాలయం),
- నాగారమ్మ(గ్రామదేవత) దేవాలయం,
- శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం,
- శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానం
- శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం,
- శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం,
- శ్రీ వెంకటేశ్వర దేవస్థానం,
- శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం మొదలగునవి కలవు.
[మార్చు] విద్యా సౌకర్యాలు
3 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల 4 ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళు ఉన్నాయి
[మార్చు] పరిశ్రమలు
ఊరిలో పరిశ్రమల పరంగా మంచి అభివృద్ది కలదు.
- 6 పెద్ద రైస్ మిల్లులు
- 3 భారీ పౌల్ట్రీ ఫారంలు
- 2 కోకోనట్ ప్రోసెసింగ్ యూనిట్లు
- 1 ఇంజనీరింగ్ కంపెనీ
- 1 ఎగ్ ట్రే తయారీ యూనిట్ ఉన్నాయి
[మార్చు] ఊరి విశేషాలు
ఇక్కడి ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. ఊరి చుట్టూ చెరువులు, చెట్లు, గట్లూ చాలా అందంగా కనిపిస్తాయి. కనుకనే ఇ.వి.వి.లాంటి దర్శకులు ఇక్కడ సినిమాలు తీశారు. ఇ.వి.వి.సత్యనారాయణ నువ్వంటే నాకిష్టం అనే చలన చిత్రం చాలా భాగం ఈ ఊరిలోనే చిత్రీకరించాడు .
[మార్చు] గ్రామ సమస్యలు
- ఈ ఊరి ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే ఇక్కడకు 7కి.మీ. దూరం లోని చాగల్లు (మండల కేంద్రం) పోవలసిందే. కాబట్టి వారంలో 2 రోజులు కాని , రోజుకి 2 గంటలు కానిప్రభుత్వ వైద్యుడు ఇక్కడకు వచ్చి వైద్య సేవలు అందిస్తే బాగుంటుంది.
- శ్మశానవాటిక లో సౌకర్యాలు సరిగాలేవు.శాశ్వత ప్రాతిపదిక మీద మంచి ఏర్పాట్లు చేయవలసి ఉంది
- ఎవరి ఇంట్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఇంటిముందే రోడ్డు మీదే హంగామా (భోజనాలూ వగైరా) అంతా ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక ఏ వర్షమైనా వస్తే ఈ హడావిడి కోసం చేసిన డబ్బు ఖర్చు అంతా వౄధా . కాబట్టి ఈవూరికి ఒక కల్యాణమండపం లాంటిది ఉంటే బాగుంటుంది.
- గ్రామ పంచాయతీ సంపూర్ణ పారిశుధ్యం కోసం పాటు పడుతూ సామూహిక మరుగు దొడ్ల తో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిమిత్తం కూడా డబ్బు బాగానే ఖర్చు చేస్తుంది.నామ మాత్ర ఖర్చుతోనే ఎవరైనా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మింపచేసుకోవచ్చును. పంచాయతీ కూడా పారిశుధ్య ప్రాముఖ్యత గురించి బాగానే ప్రచారం చేస్తున్నది. అయినా కొందరు పాత అలవాట్లను వొదులుకోలేకుండా వున్నారు వారిలో పరివర్తన కోసం ఇంకా బాగా కృషి చేయాలి
|
|
---|---|
బ్రాహ్మణగూడెం · చాగల్లు · చిక్కాల · దారవరం · కలవలపల్లె · మల్లవరం (చాగల్లు మండలం) · మార్కొండపాడు · నందిగంపాడు · నేలటూరు · సింగనముప్పవరం · ఉనగట్ల |