న్యూయార్క్
వికీపీడియా నుండి
- ఈ వ్యాసం న్యూయార్క్ నగరం గురించి. అదే పేరుతో ఉన్న రాష్ట్రం కొరకు న్యూయార్క్ రాష్ట్రం చూడండి.
న్యూయార్క్ నగరం న్యూయార్క్ నగరం |
|||
|
|||
Nickname: The Big Apple, The City That Never Sleeps, Gotham, The Capital of The World (Novum Caput Mundi), The Empire City, The City So Nice They Named It Twice. | |||
న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ నగరం | |||
Coordinates: | |||
---|---|---|---|
Country | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | ||
రాష్ట్రం | New York | ||
Boroughs | The Bronx Brooklyn Manhattan Queens Staten Island |
||
Settled | 1624 | ||
ప్రభుత్వము | |||
- మేయర్ | Michael Bloomberg (I)[1] | ||
వైశాల్యము | |||
- City | 468.9 sq mi (1,214.4 km²) | ||
- భూమి | 303.3 sq mi (785.6 km²) | ||
- నీరు | 165.6 sq mi (428.8 km²) | ||
- పట్టణ | 3,352.6 sq mi (8,683.2 km²) | ||
- మెట్రో | 6,720 sq mi (17,405 km²) | ||
ఎత్తు | 33 ft (10 m) | ||
జనాభా (2007)[2] | |||
- City | 8,274,527 (World: 13th, U.S.: 1st) | ||
- Density | మూస:Permi2km2 | ||
- Urban | 18,498,000 | ||
- Metro | 18,818,536 | ||
- Demonym | New Yorker | ||
Time zone | EST (UTC-5) | ||
- Summer (DST) | EDT (UTC-4) | ||
Area code(s) | 212, 718, 917, 347, 646 | ||
వెబ్‌సైటు: www.nyc.gov |
న్యూయార్క్ నగరం (ఆంగ్లం : New York City) (అధికారికంగా న్యూయార్క్ యొక్క నగరము) యునైటెడ్ స్టేట్స్ లోని అత్యధిక జనాభా మరియు జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీని మెట్రోపాలిటన్ ప్రాంతం, ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో పరిగణింపబడుతుంది. 1970వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా పరిగణింపబడుతూ వచ్చింది. జార్జి వాషింగ్టన్ కాలంలో అమెరికా ప్రధమ రాజధానిగా వర్థిల్లినది. ఓ శతాబ్దం వరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య మరియు ఆర్థికకేంద్రంగా వెలుగొందింది. న్యూయార్క్ నగరం, భూగోళ నగరంగానూ, ఆల్ఫా వరల్డ్ సిటీ గానూ పరిగణింపబడుచున్నది. దీనికి కారణాలు, మీడియా, రాజకీయాలూ, విద్య, వినోద కార్యక్రమాలు, కళలు మరియు ఫ్యాషన్. ఈ నగరం విదేశీ వ్యవహారాలకూ కేంద్రంగానూ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంగానూ యున్నది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
1524కు ముందు యురోపియన్ల రాకకు పూర్వం ఇక్కడ 5,000 మంది లెనేప్ అనే అమెరికన్ పూర్వీకులు ఇక్కడ నివశిస్తుండేవారు.ఫ్రెంచ్ ప్రభుత్వం తరఫున పనిచేసే ఇటాలియన్ పర్యాటకుడు డచ్ ఫర్ ట్రేడింగ్ పేరుతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ఇక్కడ యురోపియన్ ఒప్పందానికి నాంది అయింది. 1614 తరవాత మాన్‌హట్టన్ దక్షిణ ప్రాంతాన్ని న్యూఆమ్‌స్టర్‌డామ్ పిలుస్తూ వచ్చారు. 1626 లో లెనేపులనుండి మాన్‌హట్టన్ ద్వీపాన్ని 60 డచ్ బంగారునాణాలకు డచ్ కాలనీ డైరక్టర్ జనరల్ పీటర్ మైన్యూట్ కొనుగోలు చేసాడు. కానీ ధర విషయం సరి అయిన నిర్ధారణ జరగలేదు. 24 అమెరిక డాలర్ల విలువ కలిగిన గాజు పూసలు చెల్లించినట్లు మరొక వాదన కూడా ఉంది. 1664 లో ఈ ప్రదేశం ఆంగ్లేయులచే ఆక్రమించబడి యార్క్ మరియు అల్బెనీల ఆంగ్లేయ రాజ ప్రతినిధి పేరుతో న్యూ యార్క్‌గా పిలువబడింది. ఆంగ్ల - డచ్ యుద్ధం చివర జరిగిన ఒప్పందంలో డచ్ ప్రభుత్వం ఆమ్‌స్టర్‌డామ్ ఆంగ్లేయులకు ఇచ్చి బదులుగా ఇండోనేషియాలో భాగమైన బాండా ద్వీపాలలో ఒకటైన రన్ ద్వీపాన్ని తీసుకున్నారు. 1700 నాటికి ఇక్కడ లెనేప్ అమెరికన్ పూర్వీకుల సంఖ్య 200కు క్షీణించింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో న్యూయార్క్ ప్రముఖ వ్యాపారకేంద్రంగా అభివృద్ధి సాధించింది. 1754లో రెండవ కింగ్ జార్జ్ ధార్మిక సౌజన్యంతో కింగ్ కాలేజ్ పేరుతో స్థాపించ బడింది. అమెరికన్ తిరుగుబాటు యుద్ధ సమయంలో న్యూయార్క్ కంపాజిన్ పేరుతో (న్యూయార్క్ యుద్ధం) ఈ నగరం వరస యుద్ధాలకు రంగస్థలంగా మారింది. న్యూయార్క్ నగరంలో కాంటినెంటల్ కాంగ్రెస్ కూటమి జరిగింది. 1789లో వాల్ స్ట్రీట్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్ టన్ చే ఫెడరల్ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. 1790 నాటికి అభివృద్ధిలో ఫిలడెల్ఫియాను అధిగమించి అమెరికాలో పెద్దనగరంగా మొదటి స్థానంలో నిలిచింది.
19 శతాబ్ధంలో వలసప్రజల రాక నగర అభివృద్ధి చెట్టాపట్టాలేసుకుని నడవటం ప్రారంభం అయింది.మాన్‌హట్టన్ చుట్టూ ఆనుకుని నగరం విస్తరించింది. దీనికి కమీషర్స్ ప్లాన్ ఆఫ్ 1811 పేరుతో చేపట్టిన నగరాభివృద్ధి ప్రణాళిక దోహదం చేసింది. 1819లో తెరవబడిన ఎరిక్ కెనాల్ విస్తారమైన ఉత్తర అమెరికా లోతట్టు ప్రాంతనికి చెందిన అంట్లంటిక్ వ్యవసాయ సంభదిత వ్యాపారానికి ద్వారాలు తెరుచుకోవడానికి దోహదమైంది. ఐరిష్ వలస జాతీయుల రాజకీయపక్క బలంతో స్థాపించబడిన టమ్మీ హాల్ స్థానిక రాజకీయాలపై ఆధిక్యత సాధించింది. గుర్తించ తగినంత స్వతంత్ర్య నల్లజాతీయుల జనసంఖ్య మాన్‌హట్టన్ లోని బ్రోక్‌లిన్ ప్రాంతంలో స్థిరపడసాగారు. 1827 నుండి ఇక్కడ బానిసలు అధికసంఖ్యలో నివశించారు .
1861-1865 మద్య కాలంలో అమెరికా సివిల్ వార్ సమయంలో బలవంతంగా రక్షణదళంలో చేర్చడానికి వ్యతిరేకంగా డ్రాఫ్ట్ రాయిట్స్ ఆఫ్ 1863 చెలరేగిన తిరుగుబాటు అమెరికా చరిత్రలో గుర్తించదగిన అశాంతని సృష్టించింది.అప్పటి వరకు ప్రత్యేక నగరంగా ఉన్న న్యూయార్క్ నగరం 1898 నుండి ఈతర కౌంటీలను కలుపుతూ కొత్త న్యూయార్క్ మహానగరంగా అవతరించింది.ది కౌంటీ ఆఫ్ న్యూయార్క్,ది కౌంటీ ఆఫ్ రిచ్‌మండ్ మరియు దికౌంటీ ఆఫ్ క్వీన్స్ పడమటి భాగంలో కొంత ఈ మహానగరంలో భాగాలైనాయి.1904 లో ఆరంభించిన ది న్యూయార్క్ సిటీ సబ్‌వే కొత్త నగరాన్ని ఒకటిగా చేరడానికి మరింత దోహద పడింది.20 వశతాబ్ధం సగభాగంలోనే ఈ నగరం పారిశ్రామికంగా వ్యాపారికంగా మరియు సమాచార రంగం అభివృద్దిలో అంతర్జాతీయ కేంద్రంగా మారింది. దక్షిణ అమెరికా నుండి పెద్ద మొత్తంలో వలసవచ్చిఉత్తర అమెరికాలో స్థిరపడే ఆఫ్రికన్ అమెరికన్లకు 1920 లో న్యూయార్క్ కేంద్రం అయింది.ఈ వలసలను గ్రేట్ మైగ్రేషన్‌గా వర్ణించబడింది.1916లో ఉఉతర అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు ఎక్కువగా నివసించే నగరంగా న్యూయార్క్‌ను గుర్తించారు.ఆర్ధిక రంగంలో జరిగిన విప్లవాత్మక ఆభివృద్ధి కారణంగా ఆకాశహర్మ్యాల నిర్మాణాలు అభివృద్ధి ప్రారంభం అయింది.1948 నాటికంతా పోటాపోటీగా నిర్మించబడిన ఈ నిర్మాణాలకారణంగా న్యూయార్క్ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకోవడంలో లండన్ అధిగమించింది.ఈ ప్రాముఖ్యత ఒక శతాబ్ధ కాలం కొనసాగింది.గ్రేట్ డిప్రెషన్ పేరుపొందిన ఆర్ధిక సంక్షోభం కాలంలో ఆర్ధిక సంస్కర్తగా గుర్తింపు పొందిన ఫియోరెల్లో లాగార్డియా రాకతో న్యూయార్క్ రాజకీయాలు కొత్త రూపు దిద్దుకున్నాయి.ఎనిమిది సంవత్సరాల కాలం న్యూయార్క్ రాజకీయాలు రిపబ్లికన్ల ఆధిక్యతలో కొనసాగాయి.డెమాక్రటిక్ ఓటమి ఫాల్ ఆఫ్ ది టామ్మనీ హాల్ గా అభివర్ణించబడింది.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం తిరిగివచ్చిన వారు మరియు యురోపియన్ నుండి వలస వచ్చిన ప్రజల కారణంగా న్యూయార్క్‌లో యుద్ధానంతర ఆర్ధికపురోగతి ఆరంభం అయింది.తూర్పు క్వీన్స్‌లో పెద్ద సంఖ్యలో నివాసగృహ ఆభివృద్ధి కొనసాగింది.రెండవ ప్రపంచయుద్ధం నుండి న్యూయార్క్ సురక్షితంగా బయటబడింది. అభివృద్ధి పధంలో కొనసాగుతున్న అంతర్జాతీయ నగరంగా న్యూయార్క్ నగరం గుర్తింపు పొందింది.అమెరికా అంతర్జాతీయంగా బలమైన ఆర్ధిక శక్తిగా ఆవిర్భవించింది. 1950 వరకు అమెరికా ప్రభుత్వ ప్రధాన కేంద్రంగానూ న్యూయార్క్ కొనసాగింది.అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజమ్ ఆవిర్భావం కళారంగంలోనూ అంతర్జాతీయ ప్రాముఖ్యత సాధించడంలో పారిస్‌ను అధిగమించింది.1960లో ఆరంభమైన ఆర్ధిక సంక్షోభం,నేరాల పెరుగుదల మరియు జాతివివక్ష కారణంగా పెరిగిన ఉద్రిక్తత. 1970 నాటికి శిఖరాగ్రాన్ని చేరింది.
ఆర్ధికరంగంలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా పరిస్థితి కొంత మెరుగైంది.1980 నాటికి జాతి వివక్ష కారణంగా చెలరేగిన ఉద్రిక్తత సద్దుమణిగింది.నేరాలసంఖ్య ఎక్కువశాతం తగ్గుముఖం పట్టింది.ఆసియా మరియు లాటిన్ అమెరికానుండి వలస ప్రజల రాక పెరగ సాగింది.ముఖ్యమైన రంగాలలో అభివృద్ధి ఆరంభమైంది ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఈ మార్పు ఎక్కువగా ఉంది.ఇది నగర ఆర్ధిక అభివృద్ధికి దోహదమైంది.2000 నాటికి నగర జనసంఖ్య శిఖరాన్నధిరోహించింది.
2001 సెప్టెంబర్ 11 ఆటాక్ ప్రజలు ఇప్పటికీ మరచిపోలేని విషాదం.ప్రపంచ వ్యాపార కేంద్రం(వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 3,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఈ ప్రదేశం నగరంలోని సందర్శనీయ ప్రదేశాలలో ఒకటి.
[మార్చు] ప్రకృతి వైపరీత్యాలు
అభివృద్ధి మాత్రమే కాక ఈ నగరం వైపరీత్యాలను ఎదుర్కుంది.1904లో ఈస్ట్ రివర్(తూర్పు నది)లోజరిగిన స్టీమ్ బోట్ జనరల్ స్లోకమ్ మంటల పాలు కావడంతో బోట్లో ఉన్న 1021 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.1911 ది ట్రయాంగిల్ షిర్ట్‌వైస్ట్ ఫాక్టరీ ఫైర్ గా పేర్కొనబడిన అగ్నిప్రమాదంలో 146 మంది దుస్తులు తయారీ పనివాళ్ళు ప్రాణాలు కోల్పోయారు .తరవాత కాలంలో పరిశ్రమలో సురిక్షిత కార్యక్రమాలు మెరుగుపరచబడ్డాయి.ఈ ప్రదేశంలో నిర్మాణదశలో ఉన్న ఫ్రీడమ్ టవర్ (స్వాతంత్ర్య గోపురం)2012 నాటికి తన నిర్మాణకార్యక్రమాలు పూర్తిచేసుకుంటుందని అంచనా.
[మార్చు] భౌగోళికం
న్యూయార్క్ నగరం అమెరికాకు ఈశాన్యంలోనూ న్యూయార్క్ రాష్ట్రానికి ఆగ్నేయంగానూ ఉంది.షుమారు వాషింగ్టన్ మరియు బోస్టన్ మద్యభాగంలో ఉంది.ఇది హడ్సన్ నది ముఖద్వారంలో ఉండటం వలన ఏర్పడిన సహజ ఓడ రేవు అట్లాంటిక్ సముద్రంలో పెద్ద వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందటానికి సహకరించింది. న్యూయార్క్‌లో ఎక్కువ భాగం మాన్‌హట్టన్,స్టేటన్ ద్వీపం మరియు లాంగ్ ఐలాండ్ అనే మూడు దీవులలో నిర్మించబడింది.పెరిగే జనాభాకు తగినంత భూభాగం తక్కువైన కారణంగా అధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటైంది.
హడ్సన్ నది న్యూయార్క్ లోయల నుండి ప్రవహించి న్యూయార్క్ సముద్రంలో కలుస్తుంది.హడ్సన్ నది నగరాన్ని న్యూజెర్సీ నుండి వేరుచేస్తుంది.లాంగ్ ఐలాండ్ నుండి హడసన్ నది నేరుఘా ప్రవహిస్తూ బ్రోంక్స్ మరియు మాన్‌హట్టన్ దీవులను లాంగ్ ఐలాండ్ నుండివేరుచేస్తూ ఉంటుంది.హార్లెమ్ నది వేరొక వైపు నేరుగా ప్రవహిస్తూ తూర్పుప్రాంతం మరియు హడ్సన్ నదుల నదులమద్య నేరుగా ప్రవహిస్తూ బ్రోంక్స్ మరియు మాన్‌హట్టన్ లను వేరుచేస్తూ ఉంటుంది.
నగర భూభాగం కృత్రిమంగా మానవప్రయత్నంతో కొంచం కొంచం విస్తరిస్తూ ఉంది.ఈ విస్తరణ కార్యక్రమం డచ్ కాలనీ కాలంలోనే ప్రారంభం అయింది.మాన్ హట్టన్ దిగువ ప్రాంతంలో ఈ విస్తరణ సుస్పష్టంగా చూడచ్చు.1970 మరియు 1980ల మద్య మాన్హట్టన్ లోతట్టు ప్రాంతంలో అభివృద్ధి చేసిన బ్యాటరీ పార్క్ సిటీ ఈ విస్తరణను స్పష్టంగా గుర్తించవచ్చు.ప్రత్యేకంగా మాన్‌హట్టన్ ప్రాంతంలో ఈ విస్తరణ వలన సహజ సిద్ధత కనుమరుగైంది.
న్యూయార్క్ నగర విస్తీర్ణం 304.8 చదరపు మైళ్ళు.న్యూయార్క్ నగర మొత్తం ప్రదేశం 468.9 చదరపు మైళ్ళు.159.88 చదరపు మైళ్ళు జలభాగం మిగిలిన 321 మైళ్ళు భూభాగం.నగరంలో ఎత్తైన ప్రాంతం స్టేటన్ దీవిలోని టాట్ హిల్ (Todt Hill).ఇది సముద్ర మట్టానికి 409.8 అడుగులు.దీని దిగువభాగం దట్టమైన వనప్రదేశం.స్టేటన్ దీవి గ్రీన్‌బెల్ట్‌లో ఇది ఒక భాగం.
[మార్చు] వాతావరం
న్యూయార్క్ నగర చలికాలలో చలి అధికం.దీవుల లోపలి భాగం కంటే సముద్ర తీరాలు కొంచం వెచ్చగా ఉంటాయి.చలి,మంచు మరియు వర్షం ఎక్కువైనా వేసవికాలంలో ఎండ కూడా అధికం.వేసవి ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది.వాతావరణంలో తడిశాతం అధికం.హరికేన్లాంటి తుఫానులు తరచుగా రాకపోయినా ఈ నగరం 1821 లో నార్‌ఫోక్ అండ్ లాండ్ ఐలాండ్ హరికేన్ మాన్‌హట్టన్ దక్షిణ ప్రాంతాన్ని దెబ్బతీసింది.న్యూ ఇంగ్లాండ్ హరికేన్ ఆఫ్ 1938 నగర తూర్పు తీరంపై ప్రభావం చూపింది.
[మార్చు] పరిసరాలు
న్యూయార్క్ నగర ప్రజలు అధికంగా ప్రభుత్వ ప్రయాణ సౌకర్యాలను వాడుకుంటారు.న్యూయార్క్ నగర ప్రభుత్వ వాహనాల ప్రయాణీకుల సంఖ్య అమెరికాలో ప్రధమ స్థానంలో ఉంది.ఈ కారణంగా శక్తి(ఎనర్జీ)ని సామర్ధ్యంగా వాడుకునే నగరాలలో న్యూయార్క్ అమెరికాలోనే ప్రధమ స్థానంలో ఉంది.ఈ కారణంగా 2006లో 10.8 లక్షల గాలన్ల ఆయిల్ పొదుపు చేసినట్లు అంచనా.న్యూయార్క్ నగర సరాసరి గ్రీన్‌హౌస్ గ్యాస్ విడుదల 7.1.అమెరికా జాతీయ సరాసరి 24.5.దేశంలోని గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల లలో 1% న్యూయార్క్ నగరంనుండి విడుదల ఔతుంది.న్యూయార్క్ నగర ప్రజలు దేశంలోని ప్రజలలో 2.7%.న్యూయార్క్ నగరవాసి శాన్ ఫ్రాన్సిస్కో నగరవాస్ ఉపయోగించే విద్ద్యుత్శక్తిలో సగం కంటే తక్కువ ఉపయోగిస్తాడు అలాగే డల్లాస్ నివాసి కంటే షుమారు నాల్గవ వంతు మాత్రమే ఉపయోగిస్తాడు.
ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్య నివారణపై దృష్టి కేంద్రీకరించింది.జసాంద్రత కారణంగా పెద్ద మొత్తంలో కేంద్రీకృతమైన కాలుష్యం న్యూయార్క్ నగర నివాసితులకు ఆస్త్మా లాంటి శ్వాస సంబంధిత వ్యాదులు రావడానికి కారణమైంది.పురపాలక వ్యవస్థ శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే సాధనాలను ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది.న్యూయార్క్ క్లీన్ ఎయిర్ డీసెల్-హైబ్రీడ్ మరియు కమ్‌ప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లను ఉపయోగించే బస్సులను అధికంగా ఉపయోగించడంలో దేశంలో ప్రధమస్థానంలో ఉంది.న్యూయార్క్ నగరం శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే గ్రీన్ ఆఫీస్ బిల్డింగ్స్ భవన నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంది.
న్యూయార్క్ నగరం ప్రజలకు త్రాగునీటిని కేట్ స్కిల్ మౌంటెన్స్ వాటర్ షెడ్ రక్షిత నీటిసరఫరా పధకంద్వారా అందిస్తుంది.ఈ పధకంద్వారా అందించే నీరు వాటర్ ట్రీట్ మెంట్ ప్రక్రియ అవసరం లేకుండానే కలుషితంకాని స్వచ్చమైన త్రాగు నీటిని నగరవాసులకు అందిస్తుంది.అమెరికాలో ఇలాంటి నీటిని అందించే ఐదు నగరాలలో న్యూయార్క్ నగరం ఒకటి.
[మార్చు] భవన నిర్మాణం
న్యూయార్క్ ఆకాశహర్మాలు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.తక్కువ బడ్జెట్ యూరోపియన్ సంప్రదాయ భవనాల నుండి న్యూయార్క్ నగరాన్ని ఆకాశహర్మ్యాల నిర్మాణల వైపు క్రమంగా మార్పు కొనసాగింది.న్యూయార్క్ నగరంలో 5671 ఆకాశహర్మ్యాలు ఉన్నాయి.200మీటర్ల కంటే ఎత్తైన భవనాలు మాత్రం 48.ఎక్కువగా జలంచేపరినృత్తం కాబడి కడు సుందరంగా ఉంటాయి.నగరంలోని ప్రజాసాంద్రత,వ్యాపారకేంద్రంలో అందుయాటులో లేని ఆస్తుల ధరలు కారణంగా ప్రత్యేకంగా నిర్మించబడిన విస్తారంగా క్రింది తరగతి ప్రజల నివాసాలు,కార్యాలయాలు మరియు నివాస గృహసముదాయాలు నిర్మాణాలలో న్యూయార్క్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ ఖ్యాతి చెందిన అనేక శైలిలో భవన సముదాయాలు ఉన్నాయి.వీటిలో ముఖ్యమైనవి వూల్ వర్త్ (1913),మొదటి దశలో నిర్మించిన గోతిక్ రివైవల్,జోనింగ్ రిసొల్యూషన్ (1926),సెట్బాక్,ఆర్ట్ డికో శైలిలో నిర్మించిన క్రిస్లర్ బిల్డింగ్(1930) వీటి స్టీల్ ప్లేట్స్ అలంకరణ సూర్య కిరణాలకు ప్రతిఫలిస్తూ ఈ భవనాలకు ప్రత్యేక అందాలను సమకూరుస్తాయి.ఈ భవనం అనేక మంది ప్రముఖులు మరియు ఆర్కిటెక్ లచే ప్రశంసలను అందుకుంది.