నక్షత్రము (ఖగోళ)
వికీపీడియా నుండి
నక్షత్రము ఒక ఖగోళ వస్తువు. రాత్రివేళ ఆకాశం నిర్మళంగా ఉన్నప్పుడు మనకు అసంఖ్యాకంగా నక్షత్రాలు కనిపిస్తాయి. ఇవి మనకు అపార దూరాలలో ఉండడం వల్ల చాలా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మనం ప్రతి రోజూ చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. భూమికి దగ్గరగా ఉండటంవలన సూర్యుడు పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల నక్షత్రాలు తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. కాని అవి ఒకదానితో ఒకటి పోలిస్తే కదలవు. నక్షత్రాలలో ఉండేవి హైడ్రోజను, హీలియం మొదలైన వాయువులు. హైడ్రోజన్ వాయువు హీలియంగా మారే ప్రక్రియలో అధికమైన ఉష్ణం, కాంతి వెలువడతాయి. ఈ ప్రక్రియనే కేంద్రక సంలీనం అంటారు.