తుర్కపల్లి (నల్గొండ జిల్లా మండలం)
వికీపీడియా నుండి
?తుర్కపల్లి మండలం నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | తుర్కపల్లి |
జిల్లా(లు) | నల్గొండ |
గ్రామాలు | 22 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
32,140 (2001) • 16309 • 15820 • 49.52 • 62.39 • 36.24 |
తుర్కపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.
ఈ గ్రామం భువనగిరి పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉంది. ఇది ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామము.
విషయ సూచిక |
[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు
ఇక్కడ ముఖ్యమైన పంటలు వరి, మొక్కజొన్న. మామిడి నంటి తోటలు కూడా గణనీయంగా ఉన్నాయి. భూగర్భ జలాలే ప్రధానమైయన నీటి వనరు. చిన్న చిన్న చెరువులు ఉన్నాయి.
రాజధాని నగరానికి సమీపంలో ఉండడంవల్ల కూరగాయలు, పాలు వంటివి నగరానికి తీసికొని వెళ్ళి (కుషాయిగూడాలో) అమ్మడం చాలఅ మందికి ఉపాధి కలిపిస్తుంది.
[మార్చు] రవాణా, ఇతర సదుపాయాలు
ఈ వూరు హైదరాబాదు నగరంలో ఇ.సి.ఐ.ఎల్. క్రాస్‌రోడ్ దగ్గరనుండి అరగంట ప్రయాణంలో చేరుకోవచ్చును. భువనగిరినుండి బస్సు సదుపాయం, ఆటోలు ఉంటాయి. ఈ వూరు భువనగిరి - మెదక్ ప్రధాన మార్గంపై ఉంది.
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. కమ్యూనిటీ సెంటర్ ఉంది.
ఇతర సదుపాయాలు:
- ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్
- పోలీస్ స్టేషన్
- పెట్రోలు పంపు
[మార్చు] ఆలయాలు
వూరి ప్రక్క వూరు వెంకటాపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. సుప్రసిద్ధ యాత్రా స్థలం యాదగిరిగుట్ట ఇక్కడికి 14 కి.మీ.
[మార్చు] ఇతర విశేషాలు
ఈ వూరు ఈ మద్యకాలంలోనే మండల కేంద్రంగా అయ్యింది. ఈ గ్రామానికి చెందిన గుడిపాటి ఉపేందర్ రెడ్డి కృషివల్ల జపాన్ దేసపు సహకారంతో వూరిలో హైస్కూలు భవనాలు, క్రీడా పరికరాలు, మరిన్ని సదుపాయాలు కూర్చడం జరిగింది. అప్పుడే ఆ పాఠశాలను అప్పర్‌ప్రైమరీ స్థాయినుండి హైస్కూలు స్థాయికి మార్చారు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గోపాలపురం
- కొండాపూర్
- శ్రీనివాసపూర్
- తిరుమలాపూర్
- వీరారెడ్డిపల్లి
- గండమళ్ళ
- కోనాపురం
- ఇబ్రహీంపూర్
- దత్తాయిపల్లి
- తుర్కపల్లి
- వాసాలమర్రి
- మల్కాపురం
- చిన్నలక్ష్మాపురం
- నాగాయిపల్లి
- మాధాపురం
- ధర్మారం
- ములకలపల్లి
- పల్లిపహాడ్
- రుస్తాపురం
- వెంకటాపూర్ (తుర్కపల్లి)
- కోమటికుంట
- వేల్పుపల్లి
నల్గొండ జిల్లా మండలాలు
బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట