కలివికోడి
వికీపీడియా నుండి
కలివికోడి మూస:StatusCritical
|
|||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కలివికోడి
|
|||||||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|||||||||||||||
రైనాప్టిలస్ బైటార్క్వేటస్ బ్లిత్, 1848 |
|||||||||||||||
|
అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జీవుల జాబితా లోని పక్షి కలివికోడి (Kalivikodi). 1848 లో జెర్డాన్ ఈ పక్షిని కనుగొన్నాడు. ఇంగ్లీషులో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ (Jerdon's Courser) అని అంటారు. దీని శాస్త్రీయ నామం - రినోప్టిలస్ బైటర్క్వేటస్ (Rhinoptilus bitorquatus). భారత ప్రభుత్వపు "అటవీ జంతు సంరక్షణ చట్టం 1972" కింద ఈ పక్షి సంరక్షించబడింది.
గోదావరి, పెన్నా నదీలోయలలో కనిపించే పక్షి ఇది. దీన్ని స్థానికంగా జత పట్టీల చిటానా అనికూడా పిలుస్తారు. 1900 నుంచి కనుమరుగైన ఈ నిశాచర (Nocturnal) పక్షి, 1986 జనవరి తొలి వారంలో మళ్ళీ కనిపించింది. దురదృష్టవశాత్తు ఈ పక్షి మృతి చెందిన కారణంగా బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ వారు తొలిసారిగా ఈ పక్షిని మ్యూజియంలో ఉంచారు. అప్పటినుండీ, ఈ పక్షి కడప జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో కనిపిస్తూనే ఉంది. ఈ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది.
తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో భాగంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జలాశయం నుండి తవ్వుతున్న ఉపకాలువలు, కలివికోడి నివాసప్రాంతాల గుండా పోతుండడంతో ఈ పక్షి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.