ఇ.వి.సరోజ
వికీపీడియా నుండి
1951 తమిళ చిత్రం ఎన్ తంగై ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం తమిళ నాడులో తిరువారూర్ జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. చెన్నైలో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరతనాట్యం అభ్యసించడానికి వెళ్ళింది. ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆతరవాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రబలతమిళ్ దర్శకుడు టి.ఆర్.రామన్ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. అక్టోబరు 3, 2006 లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.