ఇంగువ
వికీపీడియా నుండి
ఇంగువ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఇంగువ చెట్టు
|
|||||||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|||||||||||||||
ఫెరులా అసఫొటిడా L. |
|||||||||||||||
|
ఇంగువ (Asafoetida) వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం మరియు చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు.
విషయ సూచిక |
[మార్చు] ఇంగువ మొక్క
ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాష్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు.
- ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి. వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది.
- ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది.
[మార్చు] ఉపయోగాలు
[మార్చు] సుగంధ ద్రవ్యం
[మార్చు] ఔషధ గుణాలు
- ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది.
- మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. అందుకే భారతీయ వంటలలో ఇంగువ పోపు తప్పనిసరి అని భావిస్తారు.
- ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకంగా ఇది వాదుకలో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే అహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్ధం.
[మార్చు] మూలాలు
- ఈనాడు ఆదివారం వ్యాసం 'గుబాళించే జిగురు' ఆధారంగా.