వికీపీడియా నుండి
- అంతర్ముఖం ఉపోద్గాతము.
మనుషి యొక్క అంతరసౌందర్యాన్ని చూపించేదే అంతర్ముఖం. పర్సనాలిటీ అన్న పదం 'పెర్సొనే' అన్న లాటిన్ పదం నండి వచ్చింది. పెర్సొనే అంటే ముసుగు అదే వ్యక్తిత్వం. మొహం మీదా మనసుమీదా ఉన్న పొర.
- పది సంవత్సరాల కాలంలో పదిసార్లు ముద్రణ జరిగి అత్యద్భుత నవలగా పాఠకులు ప్రశంసించిన నవల అంతర్ముఖం.
- మానవ సంబంధాలు మద్య ముఖ్యంగా ప్రేమ, స్వార్ధం, అవకాశవాదం, ఆధారపడటం గురించి లోతుగా చర్చిస్తూ సాగే నవల.
- వృద్దుల యొక్క భావావేశాలు ఆలోచనలు చక్కగా వివరిస్తూ రచించిన కధనం.
[మార్చు] నవల్లో కొటేషన్స్
- మాటా చేతా ఒకటవటమే నిజాయితీ. నీ వ్యక్తిత్వంతో నువ్వుబ్రతుకు. నిన్నిష్టపడేవాళ్ళే నీతో ఉంటారు. నిన్నిష్టపడని వాళ్ళు నీకు దూరంగా పోతారు.
- నేను వయస్సులో వృద్ద శవాన్ని - జ్ఞానంతో శైశవాన్ని.
- ప్రేమ అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు. ఎప్పుడయితే నీలో కేవలం తీసుకోవడం ప్రారంభమవుతుందో అప్పుడు అవతలి వారికి నీపై ప్రేమ నశించడం ప్రారంభమవుతుంది.