దులీప్ ట్రోఫి
వికీపీడియా నుండి
భారతదేశంలో 5 జోన్ల మద్య జరిగే దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్కే దులీప్ ట్రోఫి (Duleep Trophy) అని పేరు. ఇది దేశంలోని 5 భౌగోళిక జోన్ల మద్య జరిగే దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంటు. దులీప్ సింహ్ జీ పేరుమీదుగా ఈ టొర్నమెంటును 1961-62 నుంచి నిర్వహించడం జరుగుతున్నది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
భారతదేశంలో క్రికెట్‌ను పర్యవేక్షించే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసీఇ) ఈ పోటీలను 1961-62 నుంచి నిర్వహిస్తున్నది. 1961-62లో నిర్వహించిన మొట్టమొదటి దులీప్ ట్రోఫీలో పశ్చిమ జోన్ (వెస్టర్న్ జోన్) సౌత్ జోన్‌ను 10వికెట్ల తేడాతో ఓడించి కప్ కైవసం చేసుకుంది.
[మార్చు] జోన్ల కూర్పు
దులీప్ ట్రోఫీలో ఆడే జోన్లు భౌగోళిక ప్రాతిపదికగా 5 భాగాలుగా విభజించారు.
|
|
|
|
|
[మార్చు] నగదు బహుమతి
దులీఫి ట్రోఫీ విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.30 లక్షల నగదు బహుమతి కూడా ప్రధానం చేస్తారు. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.15 లక్షల నగదు బహుమతి లభిస్తుంది.
[మార్చు] ఎలైట్ టీములు
2002-03 నుంచి జోనల్ టీముల స్థానే ఎలైట్ టీములను బరిలోకి దించారు. ఎలైట్ ఏ, ఎలైట్ బి, ఎలైట్ సి, ప్లేట్ ఏ, ప్లేట్ బి అనే 5 టీములను ఏర్పాటు చేశారు. కాని ఈ కొత్త కూర్పు జట్ల మద్య సమతూకం కొరవడటం వల్ల ఒక్క ఏడాది మాత్రమే కొనసాగింది.[1] మళ్ళీ పూర్వపు మాదిరిగానే 5 జోన్లు (అతిథి జట్టు కాకుండా) లీగ్ దశలో పోటీ పడుతున్నాయి. లీగ్ పోటీలు 193-94 నుంచి కొనసాగుతున్నాయి. అంతకు క్రితం నాకౌట్ పోటీలు జరిగేవి.
[మార్చు] అతిథి జట్టు
2003-04 నుంచి దేశంలోని 5 జట్లతో పాటు మరో విదేశీ జట్టును కూడా పోటీకై ఆహ్వానించడం జరుగుతున్నది. ఈ జట్టుకు అతిథి జట్టుగా పిలుస్తారు. ఈ జట్టుతో పాటు మొత్తం 6 జట్లు ట్రోఫీకై పోటీలో ఉంటాయి.
-
-
-
సీజన్ అతిథి జట్టు 2003-04 ఇంగ్లాండు ఏ జట్టు 2004-05 బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 2005-06 జింబాబ్వే క్రికెట్ యూనియన్ ప్రెసిడెంట్స్ XI 2006-07 శ్రీలంక ఏ జట్టు 2007-08 ఇంగ్లాండ్స్ లయన్స్ జట్టు
-
-
[మార్చు] ఇప్పటి వరకు విజేతగా నిల్చిన జట్లు
[మార్చు] ఇవి కూడా చూడండి
- రంజీ ట్రోఫి
- దేవధర్ ట్రోఫి
- ఇరానీ ట్రోఫి
- భారత్‌లో క్రికెట్ చరిత్ర
దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు |
---|
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్ |
[మార్చు] మూలాలు
- ↑ "Duleep Trophy to revert back to old format", Cricinfo, 1 September 2003. Retrieved on 2007-08-26.