See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
పంజాబ్ - వికీపీడియా

పంజాబ్

వికీపీడియా నుండి

పంజాబ్
Map of India with the location of పంజాబ్ highlighted.
రాజధాని
 - Coordinates
చండీగఢ్
 - 30.73° ఉ 76.78° తూ
పెద్ద నగరము లూధియానా
జనాభా (2000)
 - జనసాంద్రత
24,289,296 (15వ స్థానం)
 - 482/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
50,362 చ.కి.మీ (19వ స్థానం)
 - 19
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1956-11-01
 - ఎస్.ఎఫ్.రోడ్రిగ్స్
 - అమరిందర్ సింగ్
 - ఒకే సభ (117)
అధికార బాష (లు) పంజాబీ
పొడిపదం (ISO) IN-PB

పంజాబ్ రాజముద్ర

పంజాబ్ (ਪੰਜਾਬ, पंजाब) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము-కాష్మీరు, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైఋతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.

'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.

విషయ సూచిక

[మార్చు] ప్రాచీన చరిత్ర

భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రధమ నాగరికత సింధునదీ నాగరికత ఈ ప్రాంతంలోనే ఉన్నది.

భారతదేశంపై దండెత్తిన పాశ్చాత్యులకు (గ్రీకులు, అరబ్బులు, టర్క్‌లు, ఇరానియనులు, ముఘలులు, ఆఫ్ఘనులు) పంజాబు మొదటి యుద్ధభూమి. కనుక ఆత్మ రక్షణ, పోరాట పటిమ పంజాబీయుల చరిత్రలో అత్యంత ముఖ్యభాగాలైపోయాయి. పోరస్ (పురుషోత్తముడు) అనే రాజుతో యద్ధాన్ని చేస్తున్న గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన తల్లికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది - నేను సింహాలలాంటి ధైర్యవంతులైన వీరులతో యద్ధం చేస్తున్నాను. నా సైనికులకు ప్రతి అడుగూ ఉక్కులా అడ్డు తగులుతున్నది. నువ్వు ఒకే అలెగ్జాండరుకు జన్మనిచ్చావు. కాని ఇక్కడ ప్రతిఒకడినీ ఒక అలెగ్జాండరు అనవచ్చును[1]

[మార్చు] విభజన తర్వాత చరిత్ర

1947కు ముందు ఒకటిగా ఉండే పంజాబు స్వాతంత్ర్యసందర్భంగా విభజనకు గురైంది. మహమ్మదీయులు ఎక్కువగా ఉన్న (పశ్చిమ) పంజాబు పాకిస్తాను దేశంలో భాగమైంది. సిక్కు, హిందూ మతస్తులు అధికంగా ఉన్న(తూర్పు) పంజాబు భారతదేశంలో ఉన్నది.

రాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు. [2]


పాటియాలా, మరి కొన్ని చిన్న రాజసంస్థానాలుకూడా భారతదేశంలో భాగమైనాయి. 1950లో భారతదేశంలో రెండు పంజాబు రాష్ట్రాలు ఏర్పరచారు - బ్రిటిష్‌పాలనలో ఉన్న పంజాబును "పంజాబు" రాష్ట్రమనీ, అక్కడి రాజసంస్థానాలనన్నిటినీ కలిపి "పాటియాలా, తూర్పు పంజాబు సంయుక్త రాష్ట్రము" (Patiala and East Punjab States Union-PEPSU) అనీ అన్నారు. 1956లో PEPSU కూడా పంజాబు రాష్ట్రంలో విలీనం చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాది జిల్లాలను మాత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు.


ఆంతకుపూర్వపు పంజాబు ప్రావిన్సు రాజధాని లాహోరు పాకిస్తాన్‌కు చెందిన పంజాబులో ఉన్నందున భారత పంజాబుకు కొత్త రాజధాని అవసరమయ్యింది. అప్పుడు చండీగఢ్ నగరాన్ని క్రొత్త రాజధానిగా నిర్మించారు. 1966 నవంబరు 1న పంజాబులో హిందువులు ఎక్కువగా ఉన్న ఆగ్నేయప్రాంతాన్ని వేరుచేసి హర్యానా రాష్ట్రంగా ఏర్పరచారు. రెండు రాష్ట్రాలకూ మధ్యనున్న చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయించారు. పంజాబుకూ, హర్యానాకూ కూడా రాజధాని చండీగఢ్‌ రాజధానిగా కొనసాగుతున్నది.

[మార్చు] భాష

సరిహద్దుకు అటూ, ఇటూ మాట్లాడేది ' పంజాబీ' భాష అయినా లిపులు మాత్రం వేరు. భారతదేశంలో పంజాబీ భాషను 'గురుముఖి' లిపిలో వ్రాస్తారు. పాకిస్తానులో పంజాబీ భాషను 'షాహ్‌ముఖి' లిపి (అరబిక్ లిపినుండి రూపాంతరం చెందినది)లో వ్రాస్తారు.

[మార్చు] సంస్కృతి

పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు.

[మార్చు] మతం

భారతదేశంలో హిందువులు మెజారిటీగా లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో దాదాపు 60% ప్రజలు సిక్ఖు మతస్తులు.[3] అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం అని ప్రసిద్ధమైన హర్‌మందిర్ సాహిబ్ సిక్ఖు మతస్తుల పరమ పవిత్ర స్థలము.

సిక్ఖుల తరువాత హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అమమృత్‌సర్‌లో జైన మతస్తులకు కూడా ఒక పవిత్రస్థలము.

[మార్చు] జిల్లాలు

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
PB AM అమృత్‌సర్ అమృత్‌సర్ 3074207 5075 606
PB BA భతిండా భతిండా 1181236 3377 350
PB FI ఫిరోజ్‌పూర్ ఫిరోజ్‌పూర్ 1744753 5865 297
PB FR ఫరీద్‌కోట్ ఫరీద్‌కోట్ 552466 1472 375
PB FT ఫతేహ్‌గర్ సాహిబ్ ఫతేహ్‌గర్ సాహిబ్ 539751 1180 457
PB GU గుర్‌దాస్‌పూర్ గుర్‌దాస్‌పూర్ 2096889 3570 587
PB HO హోషియార్‌పూర్ హోషియార్‌పూర్ 1478045 3310 447
PB JA జలంధర్ జలంధర్ 1953508 2658 735
PB KA కపూర్తలా కపూర్తలా 752287 1646 457
PB LU లుధియానా లుధియానా 3030352 3744 809
PB MA మాన్సా మాన్సా 688630 2174 317
PB MO మోగ మోగ 886313 1672 530
PB MU ముక్త్‌సర్ ముక్త్‌సర్ 776702 2596 299
PB NS నవాన్ షెహర్ నవాన్ షెహర్ 586637 1258 466
PB PA పటియాలా పటియాలా 1839056 3627 507
PB RU రూప్‌నగర్ రూప్‌నగర్ 1110000 2117 524
PB SA సంగ్‌రూర్ సంగ్‌రూర్ 1998464 5021 398

[మార్చు] ఆర్ధిక వ్యవస్థ

[మార్చు] స్థూల ఆర్ధిక స్థితి

పంజాబు స్థూల ఆర్ధిక ఉత్పత్తి (మిలియన్ రూపాయలలో, మార్కెట్ ధరల ఆధారంగా) క్రింద ఇవ్వబడింది.భారత ప్రభుత్వ గణాంక విభాగం అంచనా .

సంవత్సరం రాష్ట్రం స్థూల ఆర్ధిక ఉత్పత్తి
1980 50,250
1985 95,060
1990 188,830
1995 386,150
2000 660,100

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 2004లో పంజాబు స్థూల ఉత్పత్తి 27 బిలియన్ డాలర్లు అని అంచనా.

[మార్చు] మౌలిక సదుపాయాలు

వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ పంజాబు ప్రశంసనీయమైన పురోగతి సాధించింది. మంచి మౌలిక సదుపాయాలు (ముఖ్యంగా రోడ్లు, కకాలువలు, విద్యుత్తు) పంజాబును వ్యవసాయానికి, పరిశ్రమలకు అనువైన రాష్ట్రంగా మలచాయి.

పంజాబు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు - రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థ - దేశంలో అత్యుత్తమమైనదని "భారత జాతీయ ప్రాయోగిక ఆర్ధిక పరిశోధనా సంస్థ" (Indian National Council of Applied Economic Research -NCAER) నివేదికలో పేర్కొనబడింది. ఈ సూచిక ప్రకారం భారతదేశపు సగటు 100 పాయింట్లు కాగా పంజాబుకు ఈ విషయంలో 210 పాయింట్లు లభించాయి.

అలాగే పంజాబులో సగటు విద్యుత్తు వినియోగం దేశపు సగటుకంటే రెండున్నర రెట్లు ఎక్కువ. 1974 నాటికే పంజాబులో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కలుగజేయబడింది.

  • మొత్తం రోడ్లు: 47,605 కి.మీ. - జాతీయ రహదారులు రాష్ట్రంలో దాదాపు అన్ని నగరాలకు, ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయి. 97% గ్రామాలకు పక్కా రోడ్లున్నాయి.
    • జాతీయ రహదారులు: 1000 కి.మీ.
    • రాష్ట్రం హైవేలు: 2166 కి.మీ.
    • జిల్లా స్థాయి రోడ్లు: ముఖ్యమైనవి 1799 కి.మీ. + ఇతరం 3340 కి.మీ.
    • లింకు రోడ్లు: 31,657 కి.మీ.

[మార్చు] వ్యవసాయం

పంజాబు నేల సారవంతమైనది. దానికి తోడు మంచి నీటి వనరులు, ప్రాజెక్టులు, అభివృద్ధిశీలురైన రైతులు పంజాబును వ్యవసాయంలో అగ్రగామిగా చేశారు. గోధుమ ప్రధానమైన పంట. ఇంకా ప్రత్తి, చెఱకు, వరి, జొన్న, ఆవ, బార్లీ వంటి పంటలు, రకరకాల పండ్లు పంజాబులో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు.

పంజాబును "భారతదేశానికి ధాన్యాగారం" అంటారు. భారతదేశంమొత్తం గోధుమ ఉత్పత్తిలో 60%, వరి ఉత్పత్తిలో 40% పంజాబునుండే వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో చూసినట్లయితే 2% గోధుమ, 1% వరి, 2% ప్రత్తి పంజాబులో పండుతున్నాయి.

[మార్చు] పరిశ్రమలు

పంజాబులోని కొన్ని ముఖ్యమైన పారిశ్రామికోత్పత్తులు - విజ్ఞానశాస్త్రీయ పరికరాలు, విద్యుత్‌పరికరాలు, యంత్రభాగాలు, వస్త్రాలు, కుట్టు మిషనులు, క్రీడావస్తువులు, ఎరువులు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఉన్ని దుస్తులు, చక్కెర, నూనెలు.


[మార్చు] పర్యాటక రంగం

పంజాబులో యాత్రికులను ఆకర్షించే అనేక స్థలాలున్నాయి. - చారిత్రిక స్థలాళు, ప్రకృతి అందాలు, మందిరాలు, నాగరికతానిలయాలు, గ్రామీణ సౌందర్యం, జానపద కళారూపాలు - వీటివలన పర్యాటక రంగం మంచి అభివృద్ధిని సాధిస్తున్నది. కొన్ని పర్యాటక స్థలాలు:

  • అమృత్‌సర్
  • వాగా సరిహద్దు
  • భక్రా-నంగల్
  • లూధియానా
  • జలంధర్
  • పాటియాలా

[మార్చు] విద్య

పంజాబులో ఉన్నతవిద్యనందించే సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. 1960-70 దశకంలో దేశంలో హరితవిప్లవం విజయవంతం కావడానికి పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్ర వహించింది.

  1. గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్‌సర్.
  2. పంజాబీ విశ్వవిద్యాలయం, పాటియాలా.
  3. పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
  4. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూధియానా.
  5. పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, జలంధర్.
  6. పంజాబ్ వైద్య విశ్వవిద్యాలయం, ఫరీద్‌కోట్.
  7. పంజాబ్ పశువైద్య విశ్వవిద్యాలయం, తల్వాండీ సాబో[4].
  8. గురు అంగద్‌దేవ్ పశువైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం[5].
  9. నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జలంధర్.
  10. థాపర్ ఇనస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ, పాటియాలా.

[మార్చు] ఇతరాలు

1980 దశకంలో ఖలిస్తాన్ అనే ప్రత్యేక సిక్ఖుదేశం కావాలని తీవ్రవాద ఉద్యమం నడచింది. ఈ సమయంలో పంజాబు జీవితం, ఆర్ధిక వ్యవస్థ బాగా అస్తవ్యస్తమైనాయి. క్రమంగా పంజాబు పోలీసులు, భారత మిలిటరీ కలిసి తీవ్రవాద ఉద్యమాన్ని అణచివేశారు. స్వర్ణదేవాలయంలో మకాం వేసిన తీవ్రవాదులను అధిగమించడానికి మిలిటరీ ఆలయంలోకి ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ చర్య సిక్ఖుమతస్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. The evolution of Heroic Tradition in Ancient Panjab, 1971, Dr Buddha Parkash. History of Porus, Patiala, Dr Buddha Parkash. History of the Panjab, Patiala, 1976, Dr Fauja Singh, Dr L. M. Joshi (Ed). Panjab Past and Present, pp. 9-10; History of Porus, pp. 12, 38, Dr. Buddha Parkash; Histoire du Bouddhisme Indien, p 110, E. Lamotte; Political History of Ancient India; 1996, p 133, 216-17, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee; Hindu Polity, 1978, pp 121, 140, Dr K. P. Jayswal.
  2. Punjab - State. 4to40.com. తీసుకొన్న తేదీ: 2006-10-14.
  3. India census data
  4. Higher Education. తీసుకొన్న తేదీ: 2006-09-16.
  5. Finally, Punjab gets its first veterinary university. Official web site of Punjab, India. తీసుకొన్న తేదీ: 2006-09-20.


[మార్చు] బయటి లింకులు



aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -